Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని భారీ ట్విస్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యిది కంటెస్టెంట్..!
Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ సీజన్ 10లో తొమ్మిదో వారం ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. రోజురోజుకూ ఓటింగ్ సరళిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుండటంతో హౌస్‌లో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా సీరియల్ నటుడు ముకేష్ గౌడ అనూహ్యంగా భారీ ఓటింగ్ సాధించి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఏకంగా 32 శాతం ఓట్లు వచ్చినట్లు అనధికారిక పోల్స్ చెబుతున్నాయి. మరోవైపు టెంపర్ వంశీ 18 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. ఇక అతి తక్కువ ఓట్లు పొందుతున్న కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లడంతో ఈ వారం ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో అసలైన ఆట ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా తొమ్మిదో వారం ఓటింగ్ ఫలితాలపై సోషల్ మీడియాలో రకరకాల లీకులు, అంచనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవైపు గతవారం రోహిత్ ఎలిమినేషన్ అన్యాయమంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడటంతో హౌస్‌లో టెన్షన్ మొదలైంది. వచ్చే వారం కీలకమైన ఫ్యామిలీ వీక్ జరగనుండటంతో ఈ తొమ్మిదో వారం ఎలిమినేషన్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్యామిలీ వీక్‌కు ముందు ఎవరు హౌస్‌ను వీడతారన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. గతవారం ఎవరూ ఊహించని విధంగా రోహిత్ ఎలిమినేట్ కావడంతో ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన బయటకు వెళ్లిన తర్వాత కొంతమంది కంటెస్టెంట్లలో భావోద్వేగాలు కనిపించగా, మరికొందరి ఆటతీరులో మార్పులు వచ్చాయి. దీంతో ఒక్కో కంటెస్టెంట్ గ్రాఫ్ పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ఈ వారం నామినేషన్ల విషయానికి వస్తే ఏకంగా పది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు. దీంతో ఓటింగ్ పోరు మరింత ఉత్కంఠగా మారింది.
Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని భారీ ట్విస్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యిది కంటెస్టెంట్..!
Bigg Boss 10 Telugu : 32 శాతం ఓట్లతో టాప్‌లో ముకేష్ గౌడ.. రెండో స్థానంలో వంశీ!
తొమ్మిదో వారం నామినేషన్లలో దేబ్జానీ, నీతూ, వర్షిణి, ముకేష్ గౌడ, టెంపర్ వంశీ, అమన్, సుధీర్, నరేష్, ఆటో రాంప్రసాద్, శివ కుమార్ ఉన్నారు. వీరిలో ఎవరు ప్రేక్షకుల మద్దతు పొందుతారు? ఎవరు తక్కువ ఓట్లతో ప్రమాదంలో పడతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు త్రిగుణ్ ఈ వారం నామినేషన్లలో లేకపోయినా, తనదైన వ్యూహాలతో హౌస్‌లో ప్రభావం చూపిస్తున్నాడు. గత వారాలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ సరళిలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ముకేష్ గౌడ తన అభిమానుల మద్దతుతో ఓటింగ్‌లో అందరికంటే ముందంజలో కొనసాగుతున్నారు. ఈ వారం హౌస్‌లో పలువురు ఆయనను టార్గెట్ చేయడం, ముఖ్యంగా దేబ్జానీ ప్రవర్తనకు సంబంధించిన పరిణామాలు ముకేష్‌కు మరింత సానుభూతి తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన విన్నర్ రేసులో బలమైన పోటీదారుగా మారుతున్నారనే చర్చ మొదలైంది.
సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న అనధికారిక ఓటింగ్ పోల్స్ ప్రకారం ముకేష్ గౌడ ఏకంగా 32 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఆయనకు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ టెంపర్ వంశీ 18 శాతం ఓటింగ్‌తో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. త్రిగుణ్, వంశీ మధ్య ఉన్న సాన్నిహిత్యం, వారి మధ్య కనిపిస్తున్న అనుబంధం వంశీకి ఓటింగ్ పరంగా కలిసి వస్తున్నట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు దేబ్జానీ 10 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత నరేష్, అమన్, ఆటో రాంప్రసాద్ వరుస స్థానాల్లో ఉన్నట్లు అనధికారిక పోల్స్ వెల్లడిస్తున్నాయి. అయితే ఈ గణాంకాలు అధికారిక బిగ్ బాస్ ఓటింగ్ ఫలితాలు కావు. ప్రేక్షకుల ఓటింగ్ సరళిపై సోషల్ మీడియాలో జరుగుతున్న అంచనాలుగా మాత్రమే చూడాలి.
Danger Zone: అతి తక్కువ ఓట్లతో సుధీర్.. ఈ వారం ఎలిమినేషన్ అతడికేనా?
ఇక మిగిలిన కంటెస్టెంట్ల పరిస్థితి చూస్తే నీతూ, వర్షిణి, శివ కుమార్, సుధీర్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు చివరి వరకు సేఫ్ అవుతారు? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.అన్నింటికంటే ముఖ్యంగా గతవారం ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న సుధీర్ ఈసారి తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అనధికారిక ఓటింగ్ వివరాల ప్రకారం ఆయనకు కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తొమ్మిదో వారం ఓటింగ్‌లో సుధీర్ చివరి స్థానానికి పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. గతవారం ఎలిమినేషన్ నుంచి బయటపడినప్పటికీ, ఈసారి మాత్రం ఆయనకు ప్రేక్షకుల మద్దతు తగ్గిందనే చర్చ నడుస్తోంది.
Also Read : Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు
మరోవైపు శివ కుమార్ కూడా ఓటింగ్‌లో వెనుకబడినట్లు సమాచారం. హౌస్‌లో గొడవలు, వివాదాలు, టాస్క్‌లలో తన వంతు ప్రయత్నం చేస్తూ కనిపిస్తున్నప్పటికీ, ఆ ప్రభావం ఓట్ల రూపంలో కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ఓటింగ్ పరంగా మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనధికారిక పోల్స్ ప్రకారం సుధీర్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే చివరి నిమిషంలో ఓటింగ్‌లో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. అధికారిక ఓటింగ్ ఫలితాలు, బిగ్ బాస్ హౌస్ నుంచి వెలువడే ఎలిమినేషన్ ప్రకటన వచ్చే వరకు ఎవరు బయటకు వెళ్తారన్నది ఖచ్చితంగా చెప్పలేం. మరి తొమ్మిదో వారం సుధీర్ ప్రయాణం ముగుస్తుందా? లేక చివరి నిమిషంలో ఓటింగ్ ట్విస్ట్‌తో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. Bigg Boss 10 Telugu, Bigg Boss 10 Voting Results, Mukesh Gowda, Temper Vamsi, Bigg Boss Telugu Elimination
