Brahmamudi 11 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి సీరియల్ 11 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 251 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్యామిలీ గురించి నీకు ఆలోచన లేకపోయినా నేను ఆలోచించాలి కదా. అది నా బాధ్యత అంటాడు రాజ్. మన గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ.. ముందు ఇది తినండి అంటే.. నేను తినను అని చెబుతున్నాను కదా. నువ్వు కోపంగా చూస్తే బెదిరిపోవడానికి నేనేమీ మీ షాపులో పని చేసే వాడిని కాదు. వెళ్లు.. నేను తినను అని చెప్పడంతో భోజనం అక్కడ పెట్టి బయటికి వెళ్లబోతుంది కావ్య. దీంతో తీసుకెళ్లు అని ప్లేట్ ఇచ్చి పంపిస్తాడు రాజ్. మీచేతే అన్నం తినిపిస్తాను.. ఎలాగో మీరే చూడండి అని మనసులో అనుకొని బయటికి వెళ్తుంది కావ్య. చిన్నఅత్తయ్య రెడీనా అంటుంది. నేను ఇందాక చెప్పిన విషయం గుర్తుంది కదా అంటే.. గుర్తుంది అంటుంది. ఏంటి చిన్నత్తయ్య మీరు అనేది.. మీరు ఈ పని చేయగలరా అంటుంది కావ్య. ఏం ఎందుకు చేయలేను.. చిన్నప్పటి నుంచి నేను వాడిని దగ్గర్నుంచి చూశా అంటుంది ధాన్యలక్ష్మి. దీంతో మీ మాటే కాదు.. అపర్ణ అత్తయ్య మాట కూడా వినడు అంటుంది కావ్య. అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న అపర్ణ.. అన్ని మాటలు విని.. ఏమైంది.. ఏం జరిగింది అని ధాన్యలక్ష్మిని అడుగుతుంది.
దీంతో ఏం లేదు అక్కయ్య.. రాజ్ భోజనం చేయనన్నాడట. తన మాట వినడం లేదు కదా అంటే.. నీ మాట కాకపోతే నా మాట వింటాడు అని చెప్పా అంటుంది ధాన్యలక్ష్మి. కానీ.. నా మాట కాదు.. మీ మాట కూడా వినడు అని కావ్య చెబుతోంది అంటుంది. కానీ.. రాజ్ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు చెప్పినా వినడు అని చాలెంజ్ చేస్తోంది అంటే.. నేను రాజ్ కు భోజనం తీసుకెళ్లి తినిపిస్తాను అంటుంది అపర్ణ. ఒకరి కోసం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నా బిడ్డ ఆకలితో పడుకోకూడదు అని తీసుకెళ్తున్నా అని రాజ్ కు భోజనం తీసుకెళ్తుంది అపర్ణ. మరోవైపు రాజ్ కు బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. లేదు.. తినకూడదు. అది చేసింది నేను తినడం ఏంటి అని అనుకుంటాడు. మంచినీళ్లు తాగుతూ ఉంటాడు. భోజనం తీసుకొని అపర్ణ వెళ్తుంది. ఆ కళావతి తినిపిస్తే తినలేదని.. నిన్ను పంపించిందా అంటే.. 25 ఏళ్ల నుంచి నీకే కదా నేను భోజనం తీసుకొచ్చేది అంటుంది. నీకోసం నేనే కష్టపడి భోజనం చేశాను అంటుంది అపర్ణ. దీంతో అపర్ణ తినిపిస్తుంటే తింటాడు రాజ్. దీంతో ధాన్యలక్ష్మి.. కావ్యను మెచ్చుకుంటుంది. రాజ్ భోజనం తినిపించి బయటికి వచ్చి కావ్య, ధాన్యలక్ష్మి కనిపించగానే ఒక మనిషిని గెలిపించాలంటే సాధించడం కాదు.. ప్రేమించాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అపర్ణ.
ఆ తర్వాత బెడ్ రూమ్ లోకి వచ్చి పడుకుంటుంది కావ్య. నవ్వుతూ ఉండటం చూసి ఎందుకు నవ్వుతున్నావు నువ్వు. నువ్వు చెబితే తినలేదని.. మా అమ్మతో పంపించావు కదా. నువ్వే మా అమ్మకు చెప్పి పంపించావు అని నాకు తెలుసు అంటాడు రాజ్. నేను వండలేదండి.. మీ అమ్మ గారే వండారు అంటే.. ఎవరి చేతి వంట ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది నువ్వే చేశావని నాకు తెలుసు అంటాడు రాజ్.
కట్ చేస్తే తెల్లవారుతుంది. అందరినీ హాల్ లోకి పిలుస్తాడు సీతారామయ్య. ఇంతలో లాయర్ వస్తాడు. లాయర్ గారు అంతా నేను చెప్పిన విధంగా వీలునామా రాసుకొచ్చారా అంటే.. మీరు చెప్పినట్టుగానే పొందుపరిచాను అంటాడు లాయర్. అసలు ఇప్పుడు ఈ వీలునామా అవసరమా నాన్న అంటాడు సుభాష్. రుద్రాణి మాత్రం తెగ సంతోషిస్తుంది.
ఒకసారి అందులో ఏముందో చదవనివ్వండి అంటుంది రుద్రాణి. దీంతో నీకు మాత్రమే అంత తొందరగా ఉన్నట్టుంది అంటుంది ధాన్యలక్ష్మి. దీంతో రుద్రాణికే కాదు.. అందరికీ నా మీద అనుమానం ఉంది. అందుకే నేను అందరికీ కొన్ని విషయాలు క్లారిఫై చేయాలి అంటాడు సీతారామయ్య.
నా వైపు నుంచి ఆరోగ్య సమస్య ఎదురైంది. ఎవరి అంతర్మధనం బయటపడుతుందో అన్న పిరికితనం నన్ను ఆవహించింది. ఎవరూ వారి ఆంతర్యాలు బయట పెట్టకముందే నేను ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను. అదే వీలునామా అంటాడు సీతారామయ్య.
నేను ఇప్పటికే ఆలస్యం చేశాను.. నా మనసులో ఏముందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. దయచేసి ఎవ్వరూ అడ్డుపడకండి. లాయర్ గారు మీరు చదవండి అంటాడు సీతారామయ్య. లాయర్ చదవబోతుండగా రాజ్ వచ్చి ఆ లెటర్ ను లాక్కుంటాడు. లాయర్ గారు క్షమించాలి.. ఇప్పుడు ఇంటి సభ్యులకు ఈ వీలునామాతో అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరు వెళ్లిరండి అంటాడు రాజ్.
అదికాదు సార్ అంటే.. వెంటనే ఆ వీలునామాను చింపేస్తాడు రాజ్. దీంతో రుద్రాణి, రాహుల్ కు కోపం వస్తుంది. రాజ్.. అంటాడు సీతారామయ్య. నేను మీ నిర్ణయాన్ని దిక్కరించి ఈ మాట అనడం లేదు. దయచేసి ఈ విషయంలో మీరు ఏం మాట్లాడకండి అంటే.. రాజ్ నువ్వు చేసిందేంటి అని అడుగుతాడు సీతారామయ్య. మీ గురించి వదిలేసి ఎవరికి ఎంత వాటా వస్తుంది. ఆ వాటాకు ఎంత ఆస్తులు వస్తాయి. ఆ వాటాలో ఎవరికి ఎక్కువ.. ఎవరికి తక్కువ అని లెక్కలు వేసుకుంటూ కూర్చోవడానికి మేము మనుషులం తాతయ్య.. బండరాళ్లం కాదు అంటాడు రాజ్.
రుద్రాణి అవాక్కు అయినట్టుంది అంటుంది ధాన్యలక్ష్మి. మనమందరం అలాగే ఉందాం. నేను కోరుకున్నది కూడా అదే కదా అంటుంది రుద్రాణి. మరోవైపు మన సమస్యకు మనమే పరిష్కారం చూసుకొని సంతోషంగా ఉంటేనే అది నిజంగా తాతయ్యకే హ్యాపీగా ఉంటుంది అని రాజ్ తో అంటుంది కావ్య.
ఇక నుంచి నేను రెచ్చిపోతాను. నేను ఎలా మిమ్మల్ని కాపురం చేసేలా చేస్తానో మీరే మున్ముందు చూస్తారు అని చెబుతుంది కావ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.