Categories: NewsTV Shows

Brahmamudi 15 Nov Today Episode : రాజ్ ను అడ్డంగా ఇరికించిన కావ్య.. అప్పు తనను లవ్ చేస్తుందనే విషయం కళ్యాణ్ కు తెలుస్తుందా? అనామికతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడా?

Brahmamudi 15 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి సీరియల్ 15 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 254 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఇంట్లో పెళ్లికి డేట్ ఫిక్స్ చేస్తున్నారు అంటూ అవంతికకు చెబుతాడు కళ్యాణ్. దీంతో అవంతిక చాలా సంతోషిస్తుంది. ఆ వార్త విన్న అప్పు బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కళ్యాణ్ ఎంత చెప్పినా కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పు. మరోవైపు రాహుల్.. స్వప్న కాలేజీ ఫ్రెండ్ ను పిలుస్తాడు. నీకు, నా వైఫ్ కు ఏంట్రా సంబంధం అని అడుగుతాడు. దీంతో తను నా కాలేజీ ఫ్రెండ్ అని చెబుతాడు. మరి నువ్వు కాలేజీలో తనకు ప్రపోజ్ చేయలేదా అని అడుగుతాడు. నేను, స్వప్న లేచిపోయాం అని తెలిసినా కూడా తన వెంట ఎందుకు పడ్డావు.. అంటూ అతడిపై మండిపడ్డ రాహుల్.. ఆ తర్వాత నవ్వుతూ భయపడ్డావా అంటాడు. ఊరికే అన్నాను. ఇక నుంచి నువ్వు స్వప్నతో సంబంధం పెట్టుకో. అంటే ఉత్తుత్తి సంబంధం. పెట్టుకున్నట్టుగా నటించాలి. దానికి బదులుగా నీకు ఆసుపత్రి పర్మిషన్ వచ్చేలా చేస్తా అని అంటాడు రాహుల్. దీంతో డీల్ కుదుర్చుకొని వెళ్లిపోతాడు స్వప్న ఫ్రెండ్.

మరోవైపు ధాన్యలక్ష్మి, అపర్ణ, ఇంట్లో వాళ్లంతా.. సారీ కళావతి అని రాసి ఉన్న బోర్డును చూస్తారు. షాక్ అవుతారు. ఇంట్లో వాళ్లంతా వరుసగా వచ్చి ఆ బోర్డు ముందే నిలబడతారు. నటించాలి అన్నారు కదా శ్రీవారు. ఈరోజు నుంచి ఎంత బాగా నటిస్తానో నువ్వే చూస్తావు కదా అని మనసులో అనుకుంటుంది కళావతి. ఇంత జరిగినా సారీ చెప్తున్నాడా అని రుద్రాణి అంటుంది. దీంతో నలుగురిలో ఎవ్వరైనా అరుస్తారు. నలుగురిలో క్షమాపణ చెప్పాలని అనుకోవడం గొప్ప మనసు అంటుంది ఇంద్రాదేవి. మరోవైపు జాగింగ్ కు వెళ్లిన మా శ్రీవారు ఇంకా రాలేదు ఏంటి. సరే.. మనం ముందు వెళ్లి యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటుంది కావ్య. కిందికి వచ్చి ఏంటి అందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు అని అడుగుతుంది. అక్కడ బోర్డు మీద రాసి ఉన్న దాన్ని చదివి షాక్ అయినట్టు నటిస్తుంది. ఎవరు పెట్టారు ఈ బోర్డ్ అని అడుగుతుంది. ఈ ఇంట్లో నిన్ను ప్రేమతో కళావతి అని పిలిచేది ఎవరు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. మా ఆయనే కదా అంటుంది కళావతి.

Brahmamudi 15 Nov Today Episode : అప్పుతో మాట్లాడేందుకు తన ఇంటికి వెళ్లిన కళ్యాణ్

నువ్వే ఈ బోర్డు పెట్టించావా అంటుంది రుద్రాణి. నాకేం అవసరం అంటుంది కావ్య. ఇంత పని చేసిన మా రాజ్ ఎక్కడ కావ్య అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో రాజ్ వస్తాడు. నువ్వు చేసిన పనికి మేమంతా షాక్ లో ఉన్నాం అంటారు అందరూ. నేను ఎప్పుడూ ఏ పని చేసినా అలాగే ఉంటుంది. మా అమ్మ సపోర్ట్ లేకుండా నేను ఏ పని చేయను అంటాడు రాజ్.

అసలు మేము దేని గురించి మాట్లాడుతున్నానో అర్థం అవుతుందా రాజ్ అంటుంది ధాన్యలక్ష్మి. ఒకసారి ఆ బోర్డు చూడు అంటారు అందరూ. సారీ కళావతి.. ఏముంది ఇందులో అంటాడు. మరోసారి చదివి షాక్ అవుతాడు. ఏంటండి ఇది నాకు సారీ చెప్పడం ఏంటి.. అందరి ముందు అంటుంది కావ్య. ఎలా ఉంది యాక్టింగ్ బాగుందా అని మెల్లగా అడుగుతుంది కావ్య. దీంతో రాజ్ కు ఏం చేయాలో అర్థం కాదు.

నువ్వు ఏం తప్పు చేశావని ఇలా సారీ చెప్పావు రాజ్ అంటుంది ఇంద్రాదేవి. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు రాజ్ కి. చెప్పు అంటుంది కావ్య. దీంతో నువ్వే ఏదో ప్లాన్ చేసి ఉంటావు కదా. ఏదో ఒకటి చెప్పి ఏడువు అంటాడు రాజ్. ఏం లేదు అమ్మమ్మ గారు. గత వారం రోజుల నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా. దాని గురించి సారీ చెప్పాడు అంటుంది కావ్య.

దీంతో గోడల మీద రాయడం అవసరమా? డైరెక్ట్ గా చెప్పేయొచ్చు కదా అంటుంది ధాన్యలక్ష్మి. పై నుంచి సీతారామయ్య చూస్తుంటాడు. దీంతో ఈ ఇంట్లో ఇప్పటి దాకా జరిగిన వాటన్నంటికి అంటూ రాజ్ చెప్పబోతుండగా అయ్యయ్యో అంటూ నోర్మూస్తుంది కావ్య. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. అలాంటి దైవం నాకు సారీ చెప్పడం ఏంటి. ఏమండి మీరు నా మీద చూపించే ప్రేమతో పోల్చితే ఇవన్నీ ఎన్నయినా నేను భరిస్తానండి అంటుంది కావ్య.

మీరు నన్ను అర్థం చేసుకున్నారు. అది చాలండి నాకు. నా కడుపు నిండిపోయింది అంటుంది కావ్య. మా కడుపు నిండాలంటే కడుపులో టిఫిన్ పడాలి. కాస్త ఆ పని చూస్తావా అంటుంది రుద్రాణి. సరే అంటుంది కావ్య. ఏమండి.. మీరు ప్రెష్ అప్ అయి రండి.. టిఫిన్ వడ్డిస్తాను అంటుంది కావ్య. వెళ్తూ వెళ్తూ రాజ్ కు కన్ను కొడుతుంది కావ్య. ఏంట్రా ఏం జరుగుతోంది అని రాహుల్ ను అడుగుతుంది. దీంతో ఏమో నాకేం తెలుసు అంటాడు రాహుల్.

మరోవైపు కళ్యాణ్.. అప్పు కోసం తన ఇంటికి వెళ్తాడు. బాబు రండి బాబు అంటుంది కనకం. అప్పు ఉందా అంటే.. ఉంది. మీరు కూర్చోండి అంటుంది కనకం. అప్పు.. కళ్యాణ్ బాబు వచ్చాడు అంటే.. నేను లేను అని చెప్పు పెద్దమ్మ అంటుంది. బాగోదు రా అంటుంది.

కాఫీ కావాలా టీ కావాలా అంటే అప్పు కావాలి అంటాడు. ఇంతలో అప్పు వస్తుంది. బ్రో నువ్వు ఇలా చేస్తావనుకోలేదు అంటాడు. గుడ్ న్యూస్ చెబితే కంగ్రాట్స్ కూడా చెప్పకుండా వచ్చేసింది అంటాడు కళ్యాణ్. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి బాబు అని అడుగుతుంది. దీంతో నాకు అనామికతో పెళ్లి ఫిక్స్ అయింది అంటాడు కళ్యాణ్. నిజంగానే అది గుడ్ న్యూస్ బాబు అంటుంది కనకం. తనకు ఏం మాట్లాడాలో తెలియక కోపంతో మళ్లీ తన రూమ్ లోకి వెళ్లిపోతుంది అప్పు. తను ఇదివరకు అప్పులా లేదు అని చెప్పి వెళ్లిపోతాడు కళ్యాణ్.

ఆ తర్వాత తన బీరువాలో ఉన్న కళ్యాణ్ ఫోటోను చూస్తూ ఉంటుంది అప్పు. ఆ ఫోటో మీద ఐలవ్యూ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత కావ్య రూమ్ లోకి వస్తుంది. ఆగు అంటాడు రాజ్. ఏంటి నువ్వు చేసిన పని అంటే.. ఉల్లిపాయలు దంచి సాంబారులో వేశాను. ఇదే నేను చేసిన పని అంటుంది కావ్య. స్మార్ట్ గా మాట్లాడుకు అంటాడు రాజ్. దీంతో నేను స్మార్ట్ గా ఉంటానని అందరూ అంటారు.. అంటుంది కావ్య.

మరోవైపు దుగ్గిరాల ఇంటికి కోరియర్ వస్తుంది. అందులో స్వప్న, తన ఫ్రెండ్ ఫోటోలు ఉంటాయి. దాన్ని ఇంద్రాదేవి చూస్తుంది. ఆ ఫోటోలు చేసి స్వప్న దగ్గరికి వెళ్లి ఈ అబ్బాయితో నీకు పరిచయం ఉందా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

3 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

4 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

5 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

7 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

8 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

9 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

10 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

11 hours ago