Home » News » Brahmamudi February 12th 2026 Thursday Latest Episode
News

Brahmamudi February 12th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 12 ఎపిసోడ్: రుద్రాణిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అప్పూ.. ఆస్తి కోసం ధాన్యలక్ష్మి గొడవ!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 12, 2026, 9:05 am
Advertisement

Brahmamudi February 12th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ ‘బ్రహ్మముడి’ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠగా సాగుతోంది. ఫిబ్రవరి 12న ప్రసారమైన 954వ ఎపిసోడ్ (Episode 954) లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిడ్డను మార్చిన వెనుక ఉన్న అసలు సూత్రధారిని కనిపెట్టే పనిలో అప్పూ పడగా.. ఇంట్లో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. అసలు ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Advertisement

Brahmamudi February 12th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 12 ఎపిసోడ్: రుద్రాణిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అప్పూ.. ఆస్తి కోసం ధాన్యలక్ష్మి గొడవ!

Brahmamudi February 12th Episode : రాజ్ పశ్చాత్తాపం.. కావ్య ఓదార్పు

తన కన్నబిడ్డనే పరాయి బిడ్డగా చూశానని, ఆ పాపను దూరం పెట్టానని రాజ్ కుమిలిపోతాడు. “నువ్వు ఎంత మొత్తుకుంటున్నా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించాను” అని కావ్య దగ్గర బాధపడతాడు. దానికి కావ్య.. “గతం గురించి ఆలోచించి బాధపడొద్దు, ఇప్పుడు మన పాప మన దగ్గరే ఉంది కదా” అని భర్తకు ధైర్యం చెబుతుంది. మరోవైపు పనిమనిషి శాంత తన కూతురి ఆపరేషన్ కోసం డబ్బులు అడగడంతో, కావ్య వెంటనే సాయం చేస్తుంది. ఈ సంఘటనతో పేదవారిని ఆదుకోవడానికి ఒక ట్రస్ట్ పెడితే బాగుంటుందని కావ్య ఆలోచిస్తుంది.

Advertisement

Brahmamudi February 12th Episode : మినిస్టర్ ఇంట్లో రుద్రాణి.. అప్పూ చేతికి అడ్డంగా దొరికినట్టేనా?

తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని భయంతో రుద్రాణి, మినిస్టర్ ధర్మేంద్ర ఇంటికి వెళ్తుంది. “బిడ్డను మార్చింది నేనే అని రాజ్, కావ్యలకు తెలిస్తే నన్ను చంపేస్తారు.. నన్ను కాపాడండి” అని వేడుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి అప్పూ, కళ్యాణ్ అక్కడికి వస్తారు. వాళ్ళను చూసి రుద్రాణి దాక్కుంటుంది.

అప్పూ సూటిగా మినిస్టర్‌ని నిలదీస్తుంది. “మీరు ఒక మంత్రి అయ్యుండి పసిబిడ్డను ఎందుకు మార్చారు? మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? లేక మీరే చేశారా?” అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ధర్మేంద్ర కవర్ చేస్తూ.. “అదంతా నా సొంత ఆలోచనే, ఎవరి ప్రమేయం లేదు” అని అబద్ధం చెబుతాడు. కానీ అప్పూకి అనుమానం తీరదు. వాళ్లు బయటకు రాగానే.. రుద్రాణి ఆ ఇంటి నుంచి రహస్యంగా వెళ్లడాన్ని అప్పూ చూసేస్తుంది. “మినిస్టర్ ఇంట్లో ఈవిడకేం పని?” అని కళ్యాణ్ తో కలిసి ఆమెను ఫాలో అవుతుంది.

Advertisement

దుగ్గిరాల ఛారిటబుల్ ట్రస్ట్.. ఇంటికి నిప్పు పెట్టిన ధాన్యలక్ష్మి

ఇంటికి వచ్చాక కావ్య తన ఆలోచనను అందరితో పంచుకుంటుంది. “మనకు ఇంత ఆస్తి, పేరు ఉన్నాయి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ‘దుగ్గిరాల ఛారిటబుల్ ట్రస్ట్’ పెడదాం” అని ప్రతిపాదిస్తుంది. దీనికి సీతారామయ్య, ఇందిరాదేవి, రాజ్ అందరూ సంతోషంగా ఒప్పుకుంటారు. రాజ్ ఒక అడుగు ముందుకేసి “మన లాభాల్లో, ఆస్తిలో 50 శాతం ట్రస్ట్ కి రాద్దాం” అని అంటాడు.

ఆస్తి పంపకాల గొడవ

రాజ్ మాటలతో ధాన్యలక్ష్మి భగ్గుమంటుంది. “ట్రస్ట్ పెడితే పెట్టుకోండి.. కానీ ఆస్తులు రాసివ్వడం కుదరదు. ఇప్పటికే ఆస్తి మొత్తం కావ్య పేరు మీదే ఉంది. రేపు నా కొడుకు కళ్యాణ్ పరిస్థితి ఏంటి? వాడికి పుట్టబోయే పిల్లల గతి ఏంటి?” అని నిలదీస్తుంది. ఉమ్మడి ఆస్తిని దానం చేయడానికి వీల్లేదని, తన కొడుకు వాటా తన కొడుక్కి కావాలని తేల్చి చెబుతుంది. దీంతో ఇల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది.

రుద్రాణి గుట్టు అప్పూ కనిపెడుతుందా? ధాన్యలక్ష్మి రేపిన ఆస్తి చిచ్చు ఎక్కడికి దారితీస్తుంది? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

 

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి