Guppedantha Manasu 01 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 01 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 935 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదంతా అబద్ధమని కొట్టి పారేయ్ అని అంటుంది దేవయాని. దీంతో రిషికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇప్పుడు శైలేంద్ర ఎక్కడున్నారు అని అడుగుతాడు ఆఫీసర్. దీంతో రిసార్ట్ కి వెళ్లాడు అని చెబుతాడు రవీంద్ర. దీంతో ఫోన్ చేయి అంటాడు. ఫోన్ చేస్తాడు కానీ.. ఫోన్ లిఫ్ట్ చేయడు శైలేంద్ర. ఇంతలో దేవయాని కూడా పక్కకు వెళ్లి ఫోన్ చేస్తుంది కానీ.. ఫోన్ లిఫ్ట్ చేయడు శైలేంద్ర. దీంతో ఆఫీసర్ ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. కొత్త నెంబర్ నుంచి వస్తుంది అంటే ఇది ఖచ్చితంగా ముకుల్ దే అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా.. ఏం చేయాలి అని అనుకుంటాడు ముకుల్. దీంతో మీరు ఒకసారి ట్రై చేయండి అని మహీంద్రాకు చెబుతాడు. ఏంటి.. వీళ్లంతా వరుస పెట్టి చేస్తున్నారు అని అనుకుంటాడు శైలేంద్ర. మరోసారి దేవయాని ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఏ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేను అని అనుకుంటాడు శైలేంద్ర. వీడు ఫోన్ ఎత్తడం లేదు.. ఇక్కడ నా ప్రాణం పోయేలా ఉంది అని అనుకుంటుంది దేవయాని. ఇంతలో ధరణి.. మీరు చెప్పిన స్వీట్స్ తీసుకొచ్చాను అంటుంది. ఏమైందండి అంటుంది. దీంతో ఏం లేదు ధరణి అంటాడు. ఎందుకండి టెన్షన్ పడుతున్నారు. ఆ చెమటలు ఎందుకు పడుతున్నాయి.. ఏమైనా ప్రాబ్లమా అంటే అలాంటిదేమీ లేదు ధరణి అంటాడు శైలేంద్ర.
మరోవైపు రిషికి ఏ చేయాలో అర్థం కాదు. వసుధార వస్తుంది. ఏంటి వసుధార ఇది. అది అన్నయ్య వాయిసే కదా అంటే.. అవును సార్. అది శైలేంద్ర సార్ వాయిసే అంటుంది వసుధార. దీంతో రిషికి ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఇదంతా అన్నయ్యే చేశాడా అంటాడు రిషి. నేను నమ్మలేకపోతున్నాను వసుధార. నిజంగా అన్నయ్యే చేశాడా అంటాడు. ఇక్కడ జరుగుతున్నది, మనం విన్నది అంతా నిజమేనా? నాకు అంతా షాకింగ్ గా ఉంది అంటాడు. దీంతో మీ అన్నయ్య గురించి తెలిస్తే మీరు నమ్మలేరు సార్ అని మనసులో అనుకుంటుంది. నీకు కూడడా షాకింగ్ గా ఉంది కదా. అయినా అన్నయ్య వాయిస్ రావడం ఏంటి. అన్నయ్య నాతో ఎంత మంచిగా ఉండేవాడు. నన్ను సొంత తమ్ముడిగా చూసుకునేవాడు. అమ్మను కూడా చాలా గౌరవిస్తూ ఉండేవాడు కదా. గతంతో అమ్మను మేడమ్ అని పిలుస్తుంటే పిన్నిని అమ్మ అని పిలువు రిషి అని అన్నయ్య ఆరోజు చాలా బాధపడ్డాడు కదా అంటాడు రిషి. అన్నయ్య అలా చేశాడా.. అమ్మ అలా కావడానికి కారణం అన్నయ్యనా? నా కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తోంది. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక నాకు పిచ్చెక్కిపోతోంది వసుధార. నువ్వు చెప్పు. అదంతా అన్నయ్య చేశాడా అంటే.. వసుధార ఏం మాట్లాడదు.
చెప్పు వసుధార. నువ్వు చెప్పు. అది నిజమా కాదా.. అంటే మీ అన్నయ్య అంటూ ఏదో చెప్పబోతుండగా ముకుల్ పిలుస్తాడు. దేవయాని త్వరగా రా అని రవీంద్ర పిలుస్తాడు. శైలేంద్ర గారి నెంబర్ కలిసిందా అంటే నేను ఫోన్ చేయలేదు అంటాడు. ఫణీంద్రా నెంబర్ నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అంటాడు. దీంతో మేడమ్ మీరు ఒకసారి చేయండి అంటాడు ముకుల్. మీ ఫోన్ ఇవ్వండి ఒకసారి అంటే.. నా ఫోన్ ఎందుకు అంటుంది దేవయాని. కానీ.. తన ఫోన్ తీసుకుంటాడు ముకుల్. మీరు కూడా చాలా సార్లు చేశారు కదా అంటే.. అవును చేశాను అంటుంది దేవయాని. కానీ.. లిఫ్ట్ చేయలేదు అంటుంది దేవయాని. మీరంతా మీ ఫోన్లను ఇక్కడ పెట్టండి అని చెబుతాడు ముకుల్.
శైలేంద్ర ఇదంతా చేశాడు అంటే.. నేను నమ్మలేకపోతున్నాను మహీంద్రా అంటాడు రవీంద్ర. అసలు వాడు ఈ పని చేశాడని రుజువు అయితే నేనే గొయ్యి తీసి పాతిపెడతా అంటాడు ఫణీంద్రా. కళ్ల ముందు ఉన్న సాక్ష్యాలను మనం కాదనలేం కదా అంటుంది వసుధార. ఇందుకోసమే ఇన్నాళ్లు ఆగింది. శైలేంద్ర ఈ పని చేశాడని తెలిసినా.. సాక్ష్యాధారాల కోసమే కదా ఆగింది అని అనుకుంటాడు మహీంద్రా.
ఇంతలో దేవయాని ఫోన్ మోగుతుంది. శైలేంద్ర నుంచి ఫోన్ వస్తుంది. దీంతో దేవయానికి టెన్షన్ అవుతుంది. వెంటనే ఫోన్ తీసుకొని ఎత్తుతుంది దేవయాని. స్పీకర్ ఆన్ చేయండి అంటాడు. దీంతో అవతలి నుంచి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ఉన్న వ్యక్తి హాస్పిటల్ లో ఉన్నాడు. ఇద్దరికీ గాయాలు అయ్యాయి అంటాడు. దీంతో ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు అంటే.. ట్రీట్ మెంట్ జరుగుతోంది.. త్వరగా రండి అంటాడు.
వెంటనే హాస్పిటల్ కు బయలుదేరుతారు రవీంద్ర, దేవయాని. హాస్పిటల్ లో ధరణి ఏడ్చుకుంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉంటే శైలేంద్ర ఏడి.. అసలు ఏమైంది అని అడుగుతుంది దేవయాని. చెప్పు ధరణి అంటుంది. నా కొడుకు ఏడి అంటే.. లోపల ట్రీట్ మెంట్ జరుగుతూ ఉంటుంది శైలేంద్రకు.
ఎవరో మా మీద అటాక్ చేశారు మామయ్య అంటుంది ధరణి. అటాకా అని అందరూ షాక్ అవుతారు. నేను ఆయన రూమ్ లో ఉండగా సడెన్ గా డోర్ సౌండ్ వినిపించింది. నేను డోర్ ఓపెన్ చేయగానే ముగ్గురు రౌడీలు నన్ను పక్కకు నెట్టేసి లోపలికి వచ్చారు. నా కళ్ల ముందే నేను చూస్తుండగానే ఆయన్ను పొడిచేశారు అంటుంది ధరణి. దీంతో దేవయాని వెక్కి వెక్కి ఏడుస్తుంది.
ఏంటి ఇలా జరగడం.. అని అనుకుంటాడు మహీంద్రా. ఇంతలో రిషి ఏడి అని అడుగుతాడు మహీంద్రా. ఇక్కడే ఉండాలి.. వెళ్లి నేను చూస్తాను అంటుంది వసుధార. కానీ.. రిషి కనిపించడు. ఎక్కడికి వెళ్లాడు అని అనుకుంటుంది వసుధార. ఇంతలో రిషి మెసేజ్ చేస్తాడు. నాకు చిన్న పని ఉంది. పూర్తి చేసుకొని వస్తాను. నువ్వేం కంగారు పడకు అని రాసి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.