Guppedantha Manasu 12 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 12 డిసెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 944 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవయాని, శైలేంద్ర ఇద్దరూ మాట్లాడుతుండగా డోర్ కొడుతుంది ధరణి. ఇప్పుడు ఎవరై ఉంటారు అని అడుగుతుంది దేవయాని. ఇంకెవరు మామ్ ధరణి అయి ఉంటుంది అంటాడు. దీంతో దానికి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు అది రివర్స్ అయితే ఎలా అంటే భర్తగా నాలుగు మాటలు ప్రేమగా విసిరేస్తాను. అంతే అది ఒక మూలన పడి ఉంటుంది అంటాడు శైలేంద్ర. అంతేనా అంటే.. అంతే మామ్. ముందు వెళ్లి డోర్ తీయి. లేదంటే దానితో పాటు డాడ్ కూడా వస్తారు అంటాడు శైలేంద్ర. వెళ్లి డోర్ తీస్తుంది దేవయాని. ధరణి కోపంతో వాళ్లను చూస్తూ ఉంటుంది. ఏంటి ధరణి ఏమైంది.. ఎందుకు డోర్ ను అలా కొడుతున్నావు అంటే.. లోపలికి వచ్చి ఆ వాయిస్ మీదే కదా అని అడుగుతుంది ధరణి. చెప్పండి అంటుంది. నాదే అంటాడు శైలేంద్ర. అయినా ఇంటరాగేషన్ లో కూడా నాదే అని చెప్పాను కదా అంటాడు. నేనేం కాదనలేదు అంటాడు. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారు నేను మీ మాటలు నమ్మను అంటే.. ఏంటమ్మా ధరణి.. వాడు ఇప్పుడు మారిపోయాడు కదా అంటే.. ఆ వాయిస్ నేను గుర్తు పట్టాను. ఆరోజు మీరు ఆ రౌడీకి డబ్బులు ఇస్తుంటే నేను చూశాను. ఇప్పుడు ఎందుకు అలా చెప్పారు.
అది టెక్నాలజీ అని వాళ్లను నమ్మించారు. కానీ నేను నమ్మను. మీరు నిజాన్ని దాచారు. ఆ వాయిస్ మీది కాదన్నారు. అంటే దీని వెనుక మళ్లీ ఏదో కుట్ర ఉందని అనిపిస్తోంది అంటుంది ధరణి. దీంతో ప్లీజ్ ధరణి.. నేను అలా చేసింది నీకోసమే. ఇప్పుడు నాకు శిక్ష పడితే నువ్వు ఒంటరిదానివి అయిపోతావు అంటాడు శైలేంద్ర. దీంతో నాకోసమే ఇలా చేశాను అంటారు. నేను మారిపోయాను అంటారు అంతేనా అంటుంది ధరణి. నాకు నువ్వు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటే చాలు. ఆ ఎండీ సీటు వద్దు. ఇంకేం వద్దు. నువ్వు నేను కలిసి హ్యాపీగా బతికేస్తాం అని ఇప్పుడే మమ్మీతో చెబుతున్నాను. ఏం అంటావు మామ్ అంటే.. అవును.. ఇప్పుడే అదే చెబుతున్నా. నాకు కూడా బుద్ధి వచ్చింది. శైలేంద్రకు గాయాలయ్యాక ఇక కక్షలకు దూరం ఉండాలని అనుకున్నా. ఇక నుంచి మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. నాకు ఏ పదవులు వద్దు. నువ్వు నీ భర్తను అపార్థం చేసుకోకు. అయినా మీ మధ్యలో నేను ఎందుకు. నేను వెళ్తాను అంటే.. అత్తయ్య వెళ్లాల్సింది నేను.. మీరు కాదు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి. ఏంటి నాన్న అంత సీరియస్ గా ఉంది అంటే.. పర్లేదు మామ్.. తనను ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు అంటాడు శైలేంద్ర.
మరోవైపు అనుపమతో మాట్లాడుతాడు ముకుల్. అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. నేను జగతి మేడమ్ శిష్యుడిని. ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేసి మేడమ్ ఆత్మకు శాంతి చేకూరాలని అనుకున్నాను. కానీ.. అస్సలు ఏం దొరకడం లేదు అంటాడు. శైలేంద్రే దోషి అని మీరు ఫిక్స్ అయ్యారా అని అడుగుతుంది అనుపమ. దీంతో ఎస్ అంటాడు. వాయిస్ ఆయనదే అంటాడు. వాయిస్ ఆధారంగా ఎలా నిరూపిస్తారు అంటే అదంతా వాడి డ్రామా అంటాడు. సిమ్ కూడా వాడి పేరు మీద లేదు కదా అంటే నాకు వాడే దోషి అనిపిస్తోంది అంటాడు ముకుల్.
రిషి గురించి ఏమైనా తెలిసిందా అంటే.. రిషి సార్ ఫోన్ సిగ్నల్స్ ఒకచోట ఆగిపోయాయి అంటాడు ముకుల్. రిషి సార్ కారు సిటీ అవుట్ స్కర్ట్స్ లో దొరికింది. కానీ.. రిషి సార్ ఎక్కడున్నారో తెలియడం లేదు అంటాడు ముకుల్. అసలు రిషి సార్ ను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదంటే సార్ కు ఏదైనా ప్రమాదం జరిగిందా? అనేది ఏమీ తెలియడం లేదు. మేము చాలా ట్రై చేస్తున్నాం. కానీ.. ఒక్క చిన్న ఆనవాళ్లు కూడా దొరకడం లేదు అంటాడు ముకుల్. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే.. ఎవరో ప్రొఫెషనల్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటాడు ముకుల్.
మరోవైపు శైలేంద్ర కొందరు వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్లు అంతా హోటల్ రూమ్ లో శైలేంద్రను అటాక్ చేసిన వాళ్లు. ఎవరు వీళ్లు అని దగ్గరికి వెళ్లబోతూ ఉండగా.. మీరు బాగా యాక్ట్ చేశారు అంటాడు శైలేంద్ర. దీంతో యాక్ట్ ఏంటి సార్ నిజంగానే పొడిచాం కదా అంటారు. ఇదంతా విని షాక్ అవుతుంది ధరణి. ఏం చేయాలి.. ఇవన్నీ వెంటనే చిన్న మామయ్యకు, వసుధారకు చెప్తాను అని అనుకుంటుంది ధరణి. వెంటనే పరిగెత్తుకుంటూ మహీంద్రా ఇంటికి వస్తుంది.
ఆ వాయిస్ ఆయనదే. తనే జగతిని చంపాడు. ఒక రౌడీకి డబ్బులు ఇస్తుంటే కూడా నేను చూశాను అని మహీంద్రా, వసుధార ఇద్దరికీ చెబుతుంది. ఆయన ఈ మధ్య మారిపోయాడని అనుకున్నా కానీ.. ఆ దుర్మార్గుడు మారిపోలేదు. ఆయన పాపాత్ముడు. నాకు పూర్తిగా అర్థమయింది. నన్ను ప్రేమగా చూసుకుంటానని, ఎవరికీ చెడు చేయనని ఎన్నో మాటలు చెప్పాడు. పిచ్చి దాన్ని నిజంగానే నా భర్త మారాడని అనుకున్నాను. ఆ అటాక్ గురించి ఎవ్వరికీ తెలియదు అని అనుకున్నాడు కానీ.. ఇందాక రౌడీలతో మాట్లాడి డబ్బులు ఇవ్వడం చూశాను అంటుంది. అన్నింటికీ కారణం మా ఆయనే అని ధరణి చెబుతుండగా వింటుంది అనుపమ. నువ్వు చెప్పింది నిజమా అంటే.. నిజమే అంటుంది ధరణి. అసలు తనకు ఆ అవసరం ఏంటి అంటే.. ఎండీ పదవి కోసం అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.