Categories: NewsTV Shows

Guppedantha Manasu 13 Dec Today Episode : రిషిని శైలేంద్ర చంపేశాడా? వసుధార అందుకే శైలేంద్ర దగ్గరికి వెళ్లిందా? అప్పుడు జగతి.. ఇప్పుడు రిషి.. శైలేంద్రకు శిక్ష వేసేవాళ్లే లేరా?

Guppedantha Manasu 13 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 13 డిసెంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 945 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు చెప్పేది నిజమేనా ధరణి. అబద్ధం చెబుతున్నావు కదా అంటే ఒట్టు మేడమ్. మా ఆయన దుర్మార్గం గురించి మీకు తెలియదు. ముందు నుంచి రిషిని చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటుంది ధరణి. ఎందుకు అంటే.. ఎండీ పదవి కోసం అంటుంది ధరణి. ఆయన ఫారెన్ నుంచి వచ్చాక ఎండీ పదవి మీద ఆశ పడ్డాడు అని చెబుతుంది ధరణి. ఫస్ట్ నుంచి రిషికి ఎలా ప్రమాదాలు వచ్చాయో అన్నీ అనుపమకు చెబుతుంది ధరణి. అవన్నీ విని షాక్ అవుతుంది అనుపమ. రిషిని చంపే టైమ్ లోనే జగతి అడ్డు రావడంతో జగతి చనిపోయిందని చెబుతుంది. ఇది మేడమ్ జరిగింది అంటుంది. దీంతో అనుపమకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. వసుధార దగ్గరికి వెళ్లి సారీ వసుధార అంటుంది అనుపమ. జగతి విషయంలో నీ మీద చాలా అనుమానపడిపోయాను అంటుంది అనుపమ. వీళ్లు నీ గురించి చెబుతున్నా కానీ నేను మూర్ఖంగా నమ్మలేదు అంటుంది. కానీ నీ గొప్పదనం ఈరోజు అర్థం అయింది అంటుంది. అంటే ఇన్నాళ్లు నేరస్తుడిని మీ ఇంట్లోనే పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నారు అన్నమాట. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టుగా మీరు మాత్రం ఏం చేస్తారు. తన భార్యే అతడి గురించి ఇంత నీచంగా చెబుతోంది అంటే.. శైలేంద్ర ఎంత దుర్మార్గుడో అర్థం అవుతోంది. ఇందాక శైలేంద్రను ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది కానీ.. మళ్లీ ఎందుకో ఆయన మాటలు విని నేను నమ్మలేదు అంటుంది అనుపమ.

ఇప్పటికైనా నిజం బయటికి రావాలి వసుధార అంటుంది ధరణి. మామయ్యకు ఇప్పుడు ఏం చెప్పినా నమ్ముతారా? రిషి సార్ కు కూడా ఈ విషయం చెప్పాలి. ఆయన కూడా సాక్ష్యాధారాలు చూపిస్తేనే నమ్ముతారు అంటుంది వసుధార. కానీ.. ఇప్పుడు అసలు రిషి ఎక్కడున్నాడో తెలియదు. ముందు రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఇందాక ముకుల్ చెప్పాడు. సిటీ అవుట్ స్కర్ట్ లో రిషి కారు కనిపించిందని చెప్పాడు అంటుంది. ఏంటో అసలు రిషి సార్ ఎక్కడున్నారో ముందు తెలుసుకోవాలి అంటుంది. ఆ తర్వాత ధరణి ఇంటికి వెళ్తుంది. మరోవైపు ధరణి.. ధరణి అని పిలుస్తుంటాడు శైలేంద్ర. ఇంతలో దేవయాని వస్తుంది. ఏం నాన్న ఏం కావాలి అంటే ధరణి ఏది కనిపించడం లేదు అంటే.. ఇక్కడే ఎక్కడో ఒక మూల కూర్చొని ఉంటుందిలే. ఈ మధ్య ధరణి జపం చేస్తున్నావు అంటే.. చేయాలి కదా తప్పదు. నా నాటకం బయటపడకుండా ఉండాలంటే సూత్రధారి, పాత్రధారి తనే. ఈ విషయం డాడికి చెప్పేస్తే.. అందుకే తను ఒక్క క్షణం కనిపించకపోయినా నా మనసు కుదురుగా ఉండదు అంటాడు శైలేంద్ర. నా డౌట్ ఒకటి ఉంది. రిషిని కనపడకుండా చేసింది నువ్వేనా అని అడుగుతుంది దేవయాని. దీంతో నవ్వుతాడు శైలేంద్ర.

Guppedantha Manasu 13 Dec Today Episode : రిషిని నువ్వే చంపావా అని శైలేంద్రను అడిగిన దేవయాని

రిషి కనపడకపోవడానికి కారణం నువ్వేనా అంటే.. దానికి కారణం ఎవరైతే మనకెందుకు. కొన్ని విషయాలు మనకు అనుకూలంగా జరిగినప్పుడు మనం వాటిని పట్టించుకోకూడదు మమ్మీ అంటాడు శైలేంద్ర. వాడిని నువ్వు కిడ్నాప్ మాత్రమే చేశావా లేక చంపేశావా అని అడుగుతుంది. దీంతో నన్ను అడుగుతావు ఏంటి మమ్మీ. అయినా వాడు ప్రాణాలతో ఉన్నాడో.. లేక అనంత లోకాల్లో కలిసిపోయాడో తెలియాలంటే అందరితో పాటు మనం కూడా ఎదురు చూద్దాం. అంతా భగవంతుడి లీల. మనకు ఏం సంబంధం లేదు మమ్మీ. ఒకవేళ వాడు ప్రాణాలతో ఉన్నాడని అనుకుంటే ఉన్నాడు. లేడు అనుకుంటే లేడు అంటాడు శైలేంద్ర. ఈ మధ్య నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు అంటుంది దేవయాని. నేను చెప్పేది జాగ్రత్తగా విను. రిషి వల్ల మనకు ఏ ప్రమాదం లేదు అంటాడు శైలేంద్ర.

మరోవైపు ధరణి ఎక్కడుంది అని అడుగుతుంటే ఇక్కడే ఉన్నానండి అని అక్కడికి వస్తుంది. ఇంతలో అక్కడికి వసుధార కూడా వస్తుంది. వసుధారను చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది దేవయాని. దీంతో ఏం రాకూడదా అంటే అలా అని కాదు సడెన్ గా అలా ఎలా వచ్చావు అంటే రావాల్సి వచ్చింది అంటుంది వసుధార. సర్ కు ఇప్పుడు కాఫీ అవసరం ఉంటుందేమో కాఫీ ప్రిపేర్ చేయమని ధరణికి చెప్పి దేవయానిని కూడా బయటికి వెళ్లమంటుంది వసుధార. మీ కొడుకుతో మాత్రమే మాట్లాడాలి అంటుంది వసుధార.

మరోవైపు మహీంద్రాకు సారీ చెబుతుంది అనుపమ. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. జగతి విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు అని అంటుంది. ఆ తర్వాత విషయం ఏంటో చెప్పు అని వసుధారతో అంటాడు శైలేంద్ర. రిషి సార్ ఎక్కడ అని అడుగుతుంది. దీంతో నాకు అదే అర్థం కావడం లేదు. రిషి ఎక్కడ అని అడుగుతాడు. నాకు గాయాలయ్యాయి అని తెలిసినా రాలేదు అని బాధపడ్డా కానీ.. ఎవ్వరికీ తెలియదు అనే సరికి ఆనందం వేసింది. నాకు ఎక్కడున్నాడో తెలియదు అంటాడు.

రిషి సార్ ను ఏదైనా చేస్తే అస్సలు బాగుండదు అంటుంది వసుధార. నన్ను చంపేస్తావా అంటే అవును అందులో ఏం గ్యారెంటీ లేదు అంటుంది. నన్ను చంపేస్తే రిషి పరిస్థితి ఏంటి అంటాడు. అంటే.. రిషి సార్ ఎక్కుడున్నాడో తెలుసు కదా. చెప్పు అంటే నేను చెప్పను. నువ్వు అడిగే తీరు నాకు నచ్చలేదు. నువ్వు అలా అడిగితే అస్సలు చెప్పను అంటాడు శైలేంద్ర.

నా దగ్గర పొగరు చూపిస్తే నాకు అస్సలు నచ్చదు అంటాడు. దీంతో ప్లీజ్ రిషి సార్ ఎక్కడ ఉన్నారు శైలేంద్ర గారు అని అడుగుతుంది. ప్లీజ్ సార్ అని అడుగుతుంది. నాకు సరిపోలేదు. నేను సాటిస్ఫై అవ్వడం లేదు. నా మైండ్ కు తెలుస్తోంది. ఎదుటి వాళ్లు ఏ లేవల్ లో అడుగుతున్నారు అని అంటాడు. దీంతో ప్లీజ్ సార్ అంటూ చేతులు జోడించి అడుగుతుంది వసుధార. నా మైండ్ కు ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తోంది అంటాడు శైలేంద్ర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

5 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

6 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

7 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

9 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

10 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

11 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

12 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

13 hours ago