
intinti gruhalakshmi 13 december 2023 wednesday full episode
Intinti Gruhalakshmi 13 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 13 డిసెంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1126 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పుణ్యం కావాల్సిన వాళ్లు ఎవ్వరూ ఎండిపోయిన తులసి మొక్కకు పూజలు చేయరు కదా. నన్ను ఎందుకు చేయమంటున్నారు అని అడుగుతుంది దివ్య. అసలు మీ మనసులో ఏముంది అని అంటుంది దివ్య. ఎండిపోయిన తులసి మొక్కా అది ఎక్కడ అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. దీంతో ఇదేంటి అంటే మాకు సరిగ్గా కళ్లు కనిపించడం లేదా? నువ్వు పొరపాటు పడుతున్నావో అర్థం కావడం లేదు అంటారు బసవయ్య, ఆయన భార్య. పచ్చటి తులసి మొక్కకు పూజ చేయమని పిలిస్తే అది ఎండింది అని అనడం విచిత్రంగా ఉంది అంటారు. ప్రతి దాన్ని గుడ్డిగా సమర్థించను అంటుంది దివ్య. మీ అత్తయ్యను నిందించడం తప్పు. పచ్చటి తులసి మొక్కను పట్టుకొని ఎండిన మొక్క అంటున్నావు అంటాడు బసవయ్య. ఇంతలో అక్కడికి విక్రమ్ వస్తాడు. అతడి దగ్గరికి వెళ్తుంది. మీకు అక్కడ ఎండిన తులసి మొక్క కనిపిస్తుందా.. లేక పచ్చని తులసి మొక్క కనిపిస్తుందా చెప్పండి అని అంటుంది. అందరికీ కనబడుతుంది కదా. అందులో ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది అని అంటాడు. అందరూ నన్ను పచ్చని తులసి మొక్కలా రెచ్చగొడుతున్నారు. కాదని చెప్పినా వినడం లేదు అంటుంది దివ్య. ఏమైంది దివ్య నీకు పచ్చని తులసి మొక్కను పట్టుకొని ఎండిన తులసి మొక్క అంటావేంటి అంటాడు విక్రమ్.
నేను కూడా అదే చెప్పాను బాబు. ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావడం లేదు అంటారు బసవయ్య, ఆయన భార్య. ఈయన కూడా ఏంటి.. వాళ్లతో కలిసిపోయాడా.. నువ్వు కూడా వాళ్లలా కళ్లు మూసుకొని చెప్పకు. అది ఎండిన తులసి మొక్క. దానికి నన్ను వాళ్లు పూజ చేయమంటున్నారు అంటే.. నీకేమైనా పిచ్చెక్కిందా? అది పచ్చని తులసి మొక్క. అమ్మ చెప్పినట్టు విను. ఎందుకు ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు విక్రమ్. దీంతో దివ్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఎండిన తులసి మొక్కను పరీక్షించి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా.. పూజ చేయి అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో ఏం చేయాలో తెలియక అలాగే పూజ చేస్తుంది దివ్య. దీపం ముట్టిస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను వెళ్లగానే తులసి మొక్కను మార్చేస్తారు. హారతి తీసుకొని తాత దగ్గరికి వెళ్లి అడిగితే ఆయన కూడా పచ్చని తులసి మొక్కే అంటాడు. దీంతో దివ్యకు అసలు ఏం జరుగుతోందో అర్థం కాదు.
అత్తయ్య ముఖ్యమైన మీటింగ్ ఉంది. నేను ఆఫీసుకు వెళ్లాలి తప్పదు అంటుంది తులసి. కట్టుకున్న దాన్ని నాకు తప్పదు. నువ్వు ఎందుకు ఆయన గురించి టెన్షన్ పడుతున్నావు. నువ్వు వెళ్లి ఆఫీసు పనులు చూసుకో అని అంటుంది అనసూయ. నందు కూడా ఆఫీసుకు బయలుదేరుతాడు. మీరు ఆఫీసుకు రానవసరం లేదు. నేను ఆఫీసులో ప్రశాంతంగా పని చేసుకోవాలంటే మీరు రాకూడదు అంటుంది తులసి. మామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ తో మాట్లాడండి అంటుంది తులసి. ఆఫీసుకు రావద్దని అన్నదని బాధగా ఉందా అంటుంది అనసూయ.
మరోవైపు దివ్య వంట చేస్తుంది. నా వంట అదిరిపోయింది. కమ్మటి వాసన వస్తోంది అని అనుకుంటుంది దివ్య. ఇంతలో ప్రియ వస్తుంది. ఏంటక్కా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అంటే.. నేను వంట చేశా.. వెళ్లి అందరినీ పిలుచుకురా అంటుంది దివ్య. నేను పిలుస్తాలే అందరినీ అంటుంది. నేను విక్రమ్ ను పిలుస్తా అంటుంది దివ్య. దివ్య అటు వెళ్లగానే వెంటనే బసవయ్య ఆయన భార్య వచ్చి వేరే గిన్నలు పెట్టి దివ్య వండిన గిన్నెలను అక్కడి నుంచి తీసేస్తారు.
విక్రమ్ ను పిలిచి వచ్చి వండిన వంటలు మూతలు తీసి చూసేసరికి అందులో కూరగాయలు ఉంటాయి. దీంతో నేను వంట చేయలేదా.. చేశానని భ్రమలో ఉన్నానా.. నాకు ఏదో అయింది. ఇప్పుడు ఎలా.. అందరినీ భోజనాలకు పిలిచాను. వచ్చేస్తూ ఉంటారు. ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటుంది దివ్య. మళ్లీ అటువైపు వెళ్లే సరికి మళ్లీ గిన్నెలు మార్చేస్తారు.
విక్రమ్ అంటూ కంగారు పడుతుంది. ఏమైంది అంటే.. అదేం లేదు. నా మాట విను విక్రమ్ ప్లీజ్ అంటుంది దివ్య. నాకు ఆకలేస్తోంది నేను ఆగలేను అంటాడు తాతయ్య. విక్రమ్ కూడా అదే అంటాడు. నేను వండిన మాట నిజం. వండినవి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన మాట నిజం. నా కళ్లతో కూడా నేను చూశాను. ఇప్పుడు చూస్తే నేను వండినవి ఏవీ కనబడటం లేదు. వాటి బదులు పచ్చి కూరగాయలు ఉన్నాయి అంటుంది దివ్య. దీంతో విక్రమ్ షాక్ అవుతాడు.
ఆ గిన్నెల్లో ఏమున్నాయో మనమే చూద్దాం పదండి అని అందరూ ఆ గిన్నెలను చూస్తారు. అందులో వండిన కూరలే ఉంటాయి. వాటిని చూసి విక్రమ్ షాక్ అవుతాడు. విక్రమ్ నేను నిజమే చెబుతున్నాను. నేను ఇప్పుడే చూశాను. వండిన వంటలకు బదులు కూరగాయలు కనిపించాయి అంటుంది దివ్య. దీంతో విక్రమ్ కు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఈ మధ్య నువ్వు ఎందుకో ప్రతి విషయానికి తెగ భయపడుతున్నావు. కారణం చెప్పకుండా దాటేస్తున్నావు అంటాడు విక్రమ్.
మరోవైపు పరందామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తాడు నందు. పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తి అనుకొని పరందామయ్యను హాస్పిటల్ నుంచి బయటికి గెంటేస్తాడు సెక్యూరిటీ. దీంతో బయట రోడ్డు మీద తిరుగుతూ వెళ్తుంటాడు. దారి తప్పుతాడు. పరందామయ్య కోసం నందు, తులసి గాలిస్తారు. ఇంతలో రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.