Guppedantha Manasu 15 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 15 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 947 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా ఒకచోట ఉండటం చూసి అనుపమ తన కారును ఆపి అతడి దగ్గరికి వెళ్తుంది. మహీంద్రా ఇక్కడ ఉన్నావేంటి అంటుంది. శైలేంద్ర దుర్మార్గుడు అని తెలిసి కూడా వాడిని ఏం చేయలేకపోతున్నాం అంటాడు. శైలేంద్ర విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. వాడు నీచుడు. పదవి కోసం వాడు రిషిని చంపేయబోయాడని తెలిసినప్పుడే వాడిని చంపేయాల్సింది అంటాడు. వాడు ఎన్ని ఆటలు ఆడుతున్నా మేము వేసే ఎత్తుకు పై ఎత్తు వేసి మాదే తప్పు అన్నట్టుగా ఇరికిస్తున్నాడు. మేము వీటిని చూస్తూ మౌనంగా ఉన్నాం. వాడి ప్రవర్తన మితిమీరిపోతోంది. వాడు రాక్షసుడి కన్నా దారుణంగా తయారవుతున్నాడు. ఆ నీచుడు నా జగతిని చంపేశాడు. ఇప్పుడు రిషికి కూడా ప్రమాదం ఉంది అని అంటాడు మహీంద్రా. దీంతో నువ్వు దైర్యంగా ఉండు మహీంద్రా అంటుంది అనుపమ. వసుధారను నువ్వే కంటికి రెప్పలా చూసుకోవాలి అనుపమ. తన బాధ్యత నువ్వు తీసుకుంటావా అంటే.. మామయ్యవు నువ్వు ఉండగా తన బాధ్యత నాకు అప్పజెప్పడం ఏంటి అంటే.. ఏదో అలా అడగాలనిపించింది అంటాడు. నా మీద నీ ఒపీనియన్ ఏంటి. నా వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. నా దృష్టిలో నేను మంచివాడినా.. చెడ్డవాడినా అని అడుగుతాడు. దీంతో మహీంద్రా ఎప్పుడూ లేనిది ఇలా అడుగుతున్నావేంటి అంటే.. నువ్వు మంచివాడివే అంటుంది అనుపమ. ఏం చేసినా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావా అని అడుగుతాడు. దీంతో నువ్వు ఏం చేసినా ఎప్పుడూ నీ సపోర్ట్ నాకు ఉంటుంది అంటుంది అనుపమ.
సరే.. అనుపమ నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అంటే.. చిన్న పని ఉండి బయటికి వెళ్తున్నాను. ఇంట్లో వసుధార ఒంటరిగా ఉంది. ముందు ఇంటికి వెళ్లు అంటుంది. నువ్వు నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా వసుధారకు మాత్రం నువ్వు తోడుగా ఉండాలి అంటాడు మహీంద్రా. దీంతో సరే మహీంద్రా ఉంటాను కానీ నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి అని అడుగుతుంది. వసుధార జాగ్రత్త అంటాడు మహీంద్రా. ఎందుకు అలా అంటున్నావు అంటుంది. ఏం లేదు అని చెప్పి మహీంద్రా అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు డీబీఎస్టీ కాలేజీకి నేనే ఎండీ కాబోతున్నా అని కలలు కంటూ ఉంటాడు శైలేంద్ర. వెంటనే ధరణి.. కాఫీ తీసుకురా అంటాడు శైలేంద్ర. ఒకసారి ఎండీ పగ్గాలు నా చేతుల్లోకి వచ్చాక నేను ఆడిందే ఆట.. పాడిందే పాట అనుకుంటాడు. ఇంతలో మహీంద్రా అక్కడికి వస్తాడు. బాబాయి మీరు ఎప్పుడు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. దీంతో నీకోసం అంటాడు. ఎందుకు అంటే.. నా మైండ్ లో మెదులుతున్న ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలు ఉన్నాయి అంటే.. అవునా. ఇంతకీ కాఫీ తీసుకుంటారా? లేక టీ తీసుకుంటారా? అని అడుగుతాడు. రేయ్ నా దగ్గర నాటకాలు ఆడకు అంటాడు. గది డోర్ మూసేస్తాడు మహీంద్రా. దీంతో శైలేంద్రకు ఏం చేయాలో అర్థం కాదు.
ఎందుకు డోర్ క్లోజ్ చేశారు బాబాయి అంటే.. నీకు ఎవ్వరూ అడ్డు రాకూడదు కదా అంటాడు. నా ముందు మంచివాడిగా మాట్లాడేందుకు ట్రై చేయకు అంటాడు మహీంద్రా. రిషి ఎక్కడ చెప్పు అంటాడు మహీంద్రా. దీంతో నాకేం తెలుసు బాబాయి అంటాడు. చెప్పరా అంటూ చేయి చేసుకుంటాడు మహీంద్రా. కోపాన్ని కంట్రోల్ చేసుకొని మర్యాదగా అడుగుతున్నాను శైలేంద్ర. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు అంటే.. నాకు తెలియదు అంటాడు శైలేంద్ర. దీంతో రిషి ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అంటాడు. నా మీద చేయి చేసుకోకండి. ఏ అధికారంతో నా మీద చేయి చేసుకుంటున్నారు అంటాడు. నిన్ను ఇలా కాదురా అని గన్ బయటికి తీసి గురి పెడతాడు. దీంతో మమ్మీ, ధరణి అంటూ గట్టిగా అరుస్తాడు. ఏమైంది నాన్న అంటూ అక్కడికి వస్తారు ధరణి, దేవయాని. బాబాయి నన్ను చంపేస్తున్నాడు అంటాడు. వద్దు మహీంద్రా. వాడిని వదిలేసేయ్ అంటుంది దేవయాని. నీకు ఎండీ సీటును అప్పగించి రిషిని తీసుకెళ్లమంటావా వసుధారతో. అబద్ధం ఆడితే కాల్చిపడేస్తా. మనిషిలా ఆలోచిస్తున్నావా నువ్వు.. అంటూ సీరియస్ అవుతాడు.
నువ్వు ఏ రోజు అయితే ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే ఈ ఇంట్లో శని దాపురించింది. ఆరోజే నిన్ను నేను చంపేయాల్సింది కానీ.. నేను అలా చేయకుండా తప్పు చేశాను. మా అన్నయ్య మొహం చూసి వదిలేశాను. పదవి దక్కించుకోవాలనే స్వార్థంతో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు అంటాడు మహీంద్రా. మీరు, మీ కొడుకు మారిపోయారంటే ఈ సృష్టి అల్లకల్లోలం అవుతుంది. మీకు నేను ఏం పాపం చేశానురా. ఎందుకురా ఇలా నన్ను వేధిస్తున్నారు. 20 ఏళ్లు నాకు జగతి దూరంగా ఉండేలా చేసింది మీ అమ్మ అంటాడు. నా కొడుకు ఈరోజు కనిపించకుండా పోవడానికి కారణం నువ్వే. నిన్ను చంపేస్తా అంటాడు. దీంతో నాకు ఏం తెలియదు బాబాయి అంటాడు.
ధరణి.. నువ్వయినా చెప్పు ధరణి. మహీంద్రాను ఆగమని చెప్పు ధరణి అంటే.. రిషి ఎక్కడున్నాడో చెప్పమనండి. అప్పుడు నేనే చెప్తాను అంటుంది ధరణి. నాకు తెలియదు అంటుంది దేవయాని. రిషి కనిపించకపోవడానికి, మాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంది దేవయాని. నన్ను క్షమించండి అత్తయ్య. ఈ విషయంలో నేను ఏం చేయలేను అంటుంది ధరణి.
ఇదే నీకు చివరి అవకాశం. నేను 10 లెక్కబెట్టేలోగా రిషి ఎక్కడున్నాడో చెబితే నువ్వు బతికిపోతావు. లేదేంటే అంటూ సీరియస్ అవుతాడు. వసుధారకు ఫోన్ చేసి ఈ ఘోరాన్ని ఆపమని చెప్పు అని ధరణితో అంటుంది దేవయాని. దీంతో వెంటనే వెళ్లి వసుధారకు ఫోన్ చేస్తుంది ధరణి. చిన్నమామయ్య ఇక్కడికి వచ్చి చాలా గొడవ చేస్తున్నారు. చిన్న మామయ్య ఆయన్ను చంపేస్తా అంటున్నారు. మేము వద్దని చెప్పినా అస్సలు వినడం లేదు. నువ్వయినా వచ్చి చెప్పు అంటుంది.
ఇంతలో వసుధార ఫోన్ చేస్తుంది. అక్కడ గొడవ జరుగుతోందట కదా అంటే గొడవ కాదు.. శైలేంద్రను చంపుతున్నాను అంటాడు శైలేంద్ర. వద్దు అంటే నీ మాటే కాదు ఎవ్వరి మాట వినను. వీడిని కాల్చి పడేస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయి అంటాడు శైలేంద్ర. నీ వల్ల నీ పాపం వల్ల నేను క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను. నా జగతిని చంపి నా జీవితాన్ని శూన్యం చేశావు. ఇప్పుడు రిషిని నాకు కాకుండా చేశావు. రిషిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా చేతుల్లో నీ ప్రాణాలు పోవాలని ఆ దేవుడు రాసిపెట్టాడురా. అందుకే ఇప్పటి వరకు నీ నిజస్వరూపం బయటపడలేదు. చావరా.. అంటూ కాల్చబోగా.. గన్ లాక్కొని కింద పడేసి బయటికి వస్తాడు. దీంతో ఆ గన్ పట్టుకొని కింది వస్తాడు మహీంద్రా. వీడిని వదలను అంటాడు. మళ్లీ కాల్చబోతాడు. అడ్డు వచ్చిన దేవయాని, ధరణిని గెంటేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.