Categories: NewsTV Shows

Guppedantha Manasu 24 Nov Today Episode : చిక్కుల్లో వసుధార.. చిత్ర ఆత్మహత్యాయత్నం.. కారణం వసుధారే అని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈవిషయం తెలిసి వసును రిషి వదిలేస్తాడా?

Guppedantha Manasu 24 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 24 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 929 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆడపిల్లలకు ఎన్నో కోరికలు ఉంటాయి. వాళ్లకు చిన్న చిన్న ఆశలు ఉంటాయి. జైలులో ఖైదీల్లా ఈ నాలుగు గోడల మధ్య ఎన్నాళ్లని ఉంచుతావు చెప్పు. నీలో మార్పు వచ్చింది. ధరణిని అర్థం చేసుకుంటున్నావు. ఇప్పుడు ధరణిని బయటికి తీసుకెళ్లి ఏకాంతంగా కొన్ని రోజులు గడిపితే మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. అప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ధరణికి ఈ ఇల్లు తప్ప బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. అందుకే తనకు బయటి ప్రపంచం చూపించు. ప్రకృతి అందాలు పరిచయం చేయి.. ఏమంటావు శైలేంద్ర అని అడుగుతాడు ఫణీంద్ర. దీంతో నేను కూడా ఇదే అనుకుంటున్నా డాడ్. ఇంతలోనే అదే పని మీరు చేశారు అంటాడు శైలేంద్ర. థాంక్యూ డాడ్ అంటాడు. నాకు కావాల్సింది థాంక్స్ కాదు.. మీరిద్దరూ సంతోషంగా ఉండటం. ఈరోజు రాత్రికే మీ ప్రయాణం.. అంటాడు ఫణీంద్రా. దీంతో సరే డాడ్ అంటాడు శైలేంద్ర.

మరోవైపు వసుధార.. చిత్ర గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రిషి వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు సార్.. చిత్ర విషయం గురించి ఆలోచిస్తున్నా అంటుంది. వసుధార ఒకవేళ ఆ అబ్బాయి చిత్రను నిజంగానే ప్రేమించినా కానీ అలా ఎలా ప్రవర్తిస్తాడు అని అంటాడు. ఈరోజు ప్రేమను అంగీకరించిన వాళ్లు రేపు పొద్దున వదిలేయొచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా మనం ఎదుటి వాళ్ల అభిప్రాయాలను గౌరవించాలి. అప్పుడే మనం ఆ ప్రేమకు విలువ ఇచ్చినట్టు అంటాడు రిషి. మరి నేను మీ లవ్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసినప్పుడు బాధపడ్డారా అంటే బాధపడకుండా ఎలా ఉంటాను వసుధార అంటాడు రిషి. ఒక మనిషి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చిందంటే తను ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా తన మెమోరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అంటాడు రిషి. అవి జీవితాంతం బాధపెడుతూ ఉంటాయి అంటాడు రిషి. ఆరోజు నేను మీకు ప్రపోజ్ చేసే రోజు చాలా భయం వేసింది సార్ అంటుంది. ఎందుకంటే మీరు ప్రపోజ్ చేసినప్పుడు నేను రిజెక్ట్ చేశాను. అది మీరు మనసులో పెట్టకొని నా లవ్ రిజెక్ట్ చేస్తారేమో అని అనుకున్నా. కానీ.. మీరు అలా చేయలేదు అంటుంది వసుధార. ప్రేమలో పంతం, అసూయ అలాంటివేమీ ఉండవు. ప్రేమ మాత్రమే ఉంటుంది అంటాడు రిషి. అవును.. సార్ ప్రేమ మాత్రమే ఉంటుంది అంటుంది వసుధార. బాగా చలిగా ఉంది కదా సార్ అంటే అవును చాలా అంటాడు రిషి. నీ చలి పోగొట్టాలా అంటే ఎలా సార్ అంటుంది వసుధార. దీంతో తనను కౌగిలించుకొని ఇలా అంటాడు రిషి. దీంతో వసుధార కూడా చాలా సంతోషిస్తుంది.

Guppedantha Manasu 24 Nov Today Episode : రిషికి ఫోన్ చేసి చిత్ర ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పిన ఎస్ఐ

కట్ చేస్తే తెల్లవారుతుంది. మహీంద్రా, రిషి టిఫిన్ చేస్తుంటారు. వసుధార నిన్న రాత్రి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు రిషి. తను ఏదో చెప్పబోతుండగా ఇంతలో ఎస్ఐ రిషికి ఫోన్ చేస్తాడు. మీకాలేజీలో చదివే చిత్ర అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మీరు వెంటనే ఆసుపత్రికి రావాలి అంటాడు. దీంతో ఓకే అని చెప్పి బయలుదేరుతారు.

అసలు ఏం జరిగింది అని అడుగుతాడు రిషి ఆసుపత్రికి వెళ్లి. చిత్ర లవర్ అక్కడే ఉండి మీవల్లే నా చిత్రకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని రిషి మీద సీరియస్ అవుతాడు. పాయిజన్ తీసుకున్న చిత్రకు దాన్ని కక్కిస్తుంటారు డాక్టర్లు. ఫస్ట్ స్టేజ్ ట్రీట్ మెంట్ జరుగుతోంది అని చెబుతుంది నర్సు. రిషికి ఏం చేయాలో అర్థం కాదు. ఎంత డబ్బు అయినా తనను కాపాడండి. తనను మాత్రం ఎలాగైనా కాపాడండి అంటే సరే అంటుంది కానీ.. మీడియా వాళ్లకు తెలిసిపోయినట్టుంది. వాళ్లు ఇందాకా ఫోన్ చేసి డీబీఎస్టీ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం చేసుకుందా అని అడిగారు అని చెబుతుంది డాక్టర్.

ఇంతలో పోలీసులు ఆసుపత్రికి వస్తారు. చిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వసుధార, రిషిలే. వీళ్లనే అరెస్ట్ చేయండి అంటాడు చిత్ర లవర్. దీంతో వసుధారను మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని అడుగుతాడు రిషి. దీంతో ఆధారాలు ఉన్నాయి అంటాడు ఎస్ఐ. ఆ అమ్మాయి సూసైడ్ నోట్ రాసింది.. అని అది చూపిస్తాడు ఎస్ఐ. తన ప్రేమను బయటపెడతానని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకుండా వసుధార మేడమ్ అడ్డుకోవడం వల్లే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసింది సార్ అని చెబుతాడు. దీంతో ఏం మాట్లాడుతున్నారు మీరు.. దీన్ని ఎవరో క్రియేట్ చేశారు.. ఇదంతా అబద్ధం అంటాడు రిషి.

ఇదంతా ఓకే.. మరి వీడియోను ఎవ్వరూ క్రియేట్ చేయలేరు కదా అని వీడియో కూడా చూపిస్తాడు పోలీసు. ఆ వీడియోలో వసుధార ఉంటుంది. ఏంటి వసుధార ఇది. ఇది నిజమా అని అడుగుతాడు. ఈ వీడియోలో ఉన్నది నువ్వేనా. నాకు తెలియకుండా నువ్వు చిత్రను కలిశావా అంటే కలిశా సార్ అంటుంది వసుధార. దీంతో రిషికి ఏం చెప్పాలో అర్థం కాదు.

మా ప్రేమను బయటపెడతానని.. న్యూస్ చానెల్స్ కు ఎక్కిస్తానని ఈ మేడమ్ భయపెట్టారు సార్ అంటాడు చిత్ర లవర్. చిత్ర డీబీఎస్టీ కాలేజీలో చదువుతోంది కదా.. వాళ్ల కాలేజీ స్టూడెంట్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుందని తను భయపడి ఇలా చేశారు అంటాడు చిత్ర లవర్. మీడియా కూడా అక్కడికి వచ్చి అవన్నీ వీడియో తీస్తారు. నేను అక్కడికి వెళ్లింది వాస్తవమే కానీ.. అక్కడ జరిగింది వేరు.. నేను చెప్పింది వేరు.. అంటుంది వసుధార.

చిత్ర వాళ్ల పేరెంట్స్ ను అడగండి.. తన మాట వినకపోతే చిత్రను పరీక్షల్లో ఫెయిల్ చేస్తా అని కూడా బెదిరించింది అంటాడు. దీంతో అవును సార్ అని చిత్ర పేరెంట్స్ కూడా చెబుతారు. దీంతో ఏం చేయాలో రిషికి అర్థం కాదు. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago