Guppedantha Manasu 25 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 25 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 930 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిత్ర అంటే నాకు ప్రాణం సార్. తన వల్లే చిత్ర సూసైడ్ అటెంప్ట్ చేసింది. కావాలంటే చిత్ర తల్లిదండ్రులను అడగండి అంటే.. అవును సార్.. తను చెప్పినట్టు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా అని బెదిరించింది అంటారు. దీంతో ఈ ఆధారాలు చాలు అని తనను అరెస్ట్ చేస్తారు పోలీసులు. తనను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా అనుపమ వస్తుంది. ఇది నీకు కరెక్ట్ గా అనిపిస్తోందా? ఒక అమ్మాయి ఆత్మహత్యయత్నం చేసుకునేలా చేశావు అంటూ ప్రశ్నిస్తుంది అనుపమ. ఆ టైమ్ కు వసుధార వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లింది అంటే.. ప్లీజ్ హెల్ప్ మీ అని నాకు మెసేజ్ చేసింది కాబట్టే నేను వెళ్లాను అంటుంది వసుధార. మరి మేసేజ్ చూపించు అంటే.. మెసేజ్ డిలీటెడ్ అని వచ్చింది అని చెబుతుంది వసుధార. ఇదంతా మీరే క్రియేట్ చేశారు. తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి నువ్వే కారణం అంటుంది అనుపమ. సార్ ఇంకా ఆలోచిస్తున్నారేంటి ఒక పక్క ప్రేమించిన అబ్బాయి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు సాక్ష్యం చెబుతున్నారు.. అరెస్ట్ చేయండి అంటుంది అనుపమ. దీంతో వసుధారను అరెస్ట్ చేసి పోలీసు జీపులో తీసుకెళ్తారు. రిషి వద్దు అన్నా కూడా పోలీసులు వినరు. చివరకు తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు.
ఆ తర్వాత స్టేషన్ కు వెళ్దాం రండి అంటాడు మహీంద్రా. ఇంతలో నేను అస్సలు ఊహించలేదు. వసుధార ఇలా చేస్తుందని అంటుంది అనుపమ. ఎండీ స్థానానికి వెళ్లిందంటే గొప్పగొప్ప ఆలోచనలు ఉంటాయని అనుకున్నా కానీ.. ఒక కాలేజీకి ఎండీ స్థానంలో ఉండి ఇలా ఒక స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి కారణం అవుతుందా? ఛీ… ఛీ.. అంటుంది అనుపమ. దీంతో మేడమ్ అలా మాట్లాడొద్దు అంటాడు రిషి. చూడండి మేడమ్ మనం చూసిందే సత్యం. మనం తెలిసిందే సర్వం అనుకోవడం మూర్ఖత్వం. వసుధార గురించి మాకు తెలుసు. వసుధార మా కాలేజీలో ఒక స్టూడెంట్ స్థాయి నుంచి ఎండీ స్థాయికి ఎదిగింది. తన కెరీర్ గ్రాఫ్ చూస్తే తను ఎలా ఎదిగిందో తెలుస్తుంది. మీరు మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోలా మాట్లాడకండి అంటాడు రిషి. ఏమన్నారు.. ఒక ఆడపిల్ల అయి ఉండి సాటి ఆడపిల్ల చావుకు ఎలా కారణం అవుతారని వసుధారను ప్రశ్నించారు కదా. అసలు ఆ మాట ఎలా మాట్లాడగలిగారు. తను ఎందరు ఆడపిల్లలకు లైఫ్ ఇచ్చిందో మీకు తెలుసా? మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా చాలామంది ఆడపిల్లలకు జీవితాన్ని ఇచ్చింది అంటాడు. దీంతో ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నమ్మలేం అంటుంది అనుపమ. మరి నువ్వు చెప్పేటివి అన్ని నిజాలా? నా కోడలు గురించి నాకు తెలుసు. తను తప్పు చేయదు అంటాడు మహీంద్రా.
దీంతో మరి ఎందుకు అందరి ముందు తను తల దించుకోవాల్సి వచ్చింది అంటే.. తల ఎత్తుకునే పరిస్థితి త్వరలోనే వస్తుంది. నువ్వు తనను అవమానిస్తే జగతిని అవమానించినట్టే. తను జగతి శిష్యురాలు. నువ్వు తన మీద నింద వేస్తే జగతిని అవమానించినట్టే అని అనుపమకు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు మహీంద్రా. అనంతరం కారులో బయలుదేరుతూ డీఐజీకి కాల్ చేస్తాడు రిషి. వసుధారకు బెయిల్ వచ్చేలా చేయండి అంటే నా వల్ల కాదు. న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అంటాడు. దీంతో ఏసీపీకి కాల్ చేసినా అదే మాట చెబుతాడు. దీంతో రిషికి ఏం చేయాలో అర్థం కాదు. డాడ్.. ఏదో ఒకటి చేయండి అంటాడు రిషి. మహీంద్రా కూడా చాలామందికి కాల్ చేస్తాడు కానీ.. ఉపయోగం ఉండదు.
పోలీస్ స్టేషన్ కు చేరుకుంటారు రిషి, మహీంద్రా. అక్కడ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది వసుధార. వసుధార దగ్గరికి వెళ్తారు. వసుధార ఏం కాదు. నువ్వేం తప్పు చేయలేదు. ధైర్యంగా ఉండు అంటాడు రిషి. మాకు తెలిసిన వాళ్లందరితో మాట్లాడుతున్నా. నీకు ఖచ్చితంగా బెయిల్ వచ్చేలా చేస్తా అంటాడు. రిషి నువ్వు తన దగ్గర ఉండు. నేను మాట్లాడి వస్తాను అంటాడు మహీంద్రా. ఇంతలో పోలీసు ఎఫ్ఐఆర్ కాఫీ పంపిస్తాను అంటాడు పోలీస్. జరిగిన దాంట్లో వసుధార తప్పు లేదు సార్ అంటాడు మహీంద్రా. మా డ్యూటీ మేము చేశాం అంటాడు పోలీస్.
కరెక్టే కానీ.. తను కాలేజీకి ఎండీ. టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంది. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తే ఎలా? మీరు తనను వదిలేస్తే నేను బెయిల్ వచ్చే ఏర్పాటు చేస్తాను అంటాడు. దీంతో బెయిల్ తీసుకురండి.. అప్పుడు వదిలేస్తాం అంటాడు పోలీస్.
సర్… చిత్ర కండిషన్ ఎలా ఉంది అని అడుగుతుంది వసుధార. ఈ పరిస్థితుల్లో కూడా తన గురించే ఆలోచిస్తున్నావా? ట్రీట్ మెంట్ జరుగుతోంది. తను త్వరలోనే మాట్లాడాలని కోరుకుంటున్నా అంటాడు. చేయని తప్పుకు నింద మోయడం చాలా కష్టంగా, బాధగా ఉంటుంది సార్. ఆరోజు మీమీద కాలేజీలో నింద పడిన రోజు మీరు ఎంత బాధపడి ఉంటారో అర్థం అవుతోంది సార్ అంటుంది వసుధార.
ఇంతలో లాయర్ వచ్చి వసుధారకు బెయిల్ ఇస్తాడు. దీంతో మేడమ్ అని పిలుస్తాడు పోలీసు. దీని మీద ఒక సంతకం చేసి వెళ్లొచ్చు మీరు అంటాడు. దీంతో వసుధార సంతకం చేస్తుంది. మీరు ఎవరు అని అడుగుతాడు రిషి. దీంతో నేను లాయర్ కృష్ణకాంత్ ను. అనుపమ మేడమ్ పంపించారు అంటాడు. కేసు వివరాలు చెప్పి మేడమ్ బెయిల్ కు అప్లయి చేయించారు అంటాడు.
బయటికి వచ్చాక అక్కడ అనుపమ ఉంటుంది. థాంక్స్ అని చెబుతాడు మహీంద్రా. ఎందుకు అంటే.. ఇక బెయిల్ రాదేమో అని అనుకున్నం కానీ.. నువ్వు సరైన సమయానికి వచ్చి ఆదుకున్నావు అంటాడు మహీంద్రా. దీంతో నేను సానుభూతితో ఇప్పించలేదు. తను జగతికి శిష్యురాలు కాబట్టి ఇప్పించాను అంటుంది. జగతి ప్రతిరూపమే వసుధార అన్నారు కదా. వసుధారను అనుమానిస్తే.. జగతిని అవమానించినట్టే అన్నారు కదా. అందుకే బెయిల్ ఇప్పించాను. వసుధార తప్పు చేయదని చాలా నమ్మకంగా చెప్పారు కదా అంటుంది అనుపమ.
ఇది సాయం కాదు. ఎంత పెద్ద క్రిమినల్ కు అయినా తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. మీరు చిత్ర దేవుడి దగ్గరకు వెళ్లకూడదని కోరుకోండి. తను ఇచ్చే స్టేట్ మెంట్ మీదే వసుధార జీవితం ఆధార పడి ఉంటుంది. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.