Intinti Gruhalakshmi 25 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 25 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1111 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అత్తయ్య ఆరోగ్యం కోసం నేను ఏమైనా చేస్తా అని అంటుంది దివ్య. విక్రమ్ కూడా అదే అంటాడు. నేను ట్యాబ్లెట్ల పేరు కూడా మరిచిపోతున్నా అన్నయ్య అంటాడు. ఇంతలో ఒక గేమ్ ఆడుదామంటే ఇద్దరూ చెస్ ఆడుతారు. ఒక్క స్టెప్పుకే చెక్ పెడుతుంది దివ్య. మరోవైపు తులసి ఆఫీసుకు వెళ్తుంది. అందరూ లేచి నిలబడి తనకు నమస్తే పెడతారు. మరోవైపు నందు కూడా ఆఫీసుకు వస్తాడు కానీ.. స్టాఫ్ మాత్రం ఎవ్వరూ లేచి నిలబడరు. దీంతో నందు షాక్ అవుతాడు. అసలు ఏమైంది వీళ్లకు. ఎందుకు తనను చూసి పైకి లేవడం లేదు అని అనుకుంటాడు. తన క్యాబిల్ లోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రాజు వస్తాడు. ఆఫీసులో మీ గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు. తులసి తల్లి చనిపోవడానికి కారణం మీరే అని అందరూ అనుకుంటున్నారు. ఆ విషయం తులసే వెళ్లి మేనేజర్ కు చెప్పిందట. ఆ తర్వాత మేనేజర్ స్టాఫ్ కు అందరికీ చెప్పాడట అంటాడు రాజు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. తులసి ఎందుకు ఇలా చేస్తోంది. తను శత్రువుగా మారింది. ఆఫీసులో స్టాఫ్ ను కూడా శత్రువులుగా మార్చేస్తోంది. తులసిది అలా చేసే మనస్తత్వం కాదే అని అనుకుంటాడు నందు.
మరోవైపు బసవయ్య…తన భార్యను పిలిచి గదిలోకి తీసుకెళ్లి డోర్ వేస్తాడు. ఏంటండి ఈ టైమ్ లో అంటుంది తన భార్య. ఇదిగో చూడు అంటూ షర్ట్ విప్పి చూపిస్తాడు. ఆ షర్ట్ చుట్టూ డబ్బుల కట్టలు ఉంటాయి. అమ్మో.. ఇన్ని నోట్ల కట్టలా అంటుంది. దీంతో మరేమనుకుంటున్నావు నీ మొగుడు అంటే.. అల్లాటప్పా మొగుడు కాదు.. కలెక్షన్ రాజా అంటాడు. ఇదంతా బయటి నుంచి దివ్య వింటూ ఉంటుంది. తన తోటి కోడలు వస్తుంటే పిలుస్తుంది. ఇద్దరూ కలిసి వాళ్లు మాట్లాడుకుంటున్న విషయాలు వింటారు. అక్కయ్యకు తెలియకుండా దొంగ లెక్కలు రాసి నొక్కేసిన డబ్బు ఇది అంటాడు. పాపపు సొమ్ము అంటారు అంతే కదా అంటుంది. దీంతో గంగా నదితో పవిత్రం చేశా అంటాడు. తనకు ఇస్తాడు. తీసుకోపో.. పండుగ చేసుకో అంటాడు. ఆ డబ్బులు తీసుకొని కప్ బోర్డ్ లో పెడుతుంది బసవయ్య భార్య. ఇంతలో జాను వెళ్తూ.. అక్కడ నిలబడి ఉన్న దివ్య, తన తోటి కోడలును చూస్తుంది. ఏంటి మా నాన్న రూమ్ పక్కన నిలబడి చూస్తున్నారు అంటే.. ఏం లేదు.. మీ అమ్మా నాన్న చెమ్మ చెక్క ఆడుకుంటున్నారు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు దివ్య, తన తోటి కోడలు. నిజంగానే వాళ్లు చెమ్మచెక్క ఆడుకోవడం చూసి షాక్ అవుతుంది జాను.
మరోవైపు నందు.. తులసి దగ్గరికి వెళ్లి కొత్త ప్రాజెక్టుకు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రెడీ చేశాను అంటాడు. దీంతో మేనేజర్ కు ఫోన్ చేసి ఒకసారి రండి అంటుంది తులసి. దీంతో మేనేజర్ వెళ్తాడు. ఈ ఆఫీసులో పద్దతులు, పాడు ఉండవా? అన్నీ నేర్పించాలా అంటూ మేనేజర్ మీద సీరియస్ అవుతుంది. సీఈవో క్యాబిన్ లోకి ఎవరు పడితే వాళ్లు.. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడమేనా? నా పర్మిషన్ తో పని లేదా? తప్పు నాదే. అలసు ఇచ్చాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటుంది తులసి.
నా పీఏకు క్లియర్ గా చెప్పండి. నా పర్మిషన్ లేకుండా ఎవ్వరినీ లోపలికి తీసుకురావద్దని. ఆఫీసుకు సంబంధించిన ఏ ఇష్యూ అయినా.. ఏ ఫైల్ అయినా కేవలం మీరు మాత్రమే తీసుకొని లోపలికి రావాలి. మీరే డిస్కస్ చేయాలి. వేరే ఎవ్వరూ నా క్యాబిన్ లోకి రావడానికి వీలు లేదు అంటుంది తులసి. అది కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రపోజల్. మీరు స్టడీ చేయండి అంటే.. అది జీఎం గారికి సంబంధించిన ప్రపోజల్. నేను స్టడీ చేయాల్సిన అవసరం లేదు కదా అంటే.. చేయాల్సిందే. ఆయన ఏమైనా పై నుంచి ఊడి పడ్డారా? తప్పు చేయరా? నమ్మించి మోసం చేస్తే మనిషినే కాదు.. దేవుడిని కూడా నమ్మను అంటుంది తులసి.
మరోవైపు భాగ్య, లాస్య.. ఇద్దరూ కాఫీ తాగుతూ ఉంటారు. ఏంటి ఈ మధ్య ఏ ప్లాన్స్ వేయడం లేదు అంటే.. రిమోట్ తో కథ నడిపిస్తున్నా అందుకే రిలాక్స్ గా ఉన్నా అంటుంది లాస్య. ఇంతలో రాజు ఫోన్ చేస్తాడు. తన ప్లాన్ వర్కవుట్ అయిందని చెబుతాడు. నందు కళ్లలో కన్నీళ్లు ఒక్కటే తక్కువ మేడమ్ అంటాడు. అనుకున్న వన్నీ జరగాలి అంటుంది. తులసి మేడమ్ నందును తన క్యాబిన్ లోకి రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టింది అంటాడు.
మరోవైపు దివ్య ఒక వ్యక్తిని పిలిచి దొంగతనం చేయాలని చెబుతుంది. అంటే నిజం దొంగతనం కాదు.. ఉట్టుట్టి దొంగతనం అంటాడు. ఈరోజు రాత్రికి వచ్చి బసవయ్య దాచిన డబ్బులు దొంగలించాలని చెబుతుంది. సాయంత్రం అవుతుంది. తులసి ఇంటికి తిరిగి వస్తుంది. కానీ.. నందు రాడు.
రావడం రావడమే.. కోపంతో వచ్చి పరందామయ్య, అనసూయతో మాట్లాడుతుంది. మీ అబ్బాయి వచ్చారా అని అడుగుతుంది. రాలేదు అంటారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు అంటుంది. చివరకు నందు బార్ కు వెళ్లి ఫుల్లుగా మందు తాగి అక్కడ గొడవ పెట్టుకుంటాడు. లాస్య చూసి నందును తీసుకొని ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.