Categories: NewsTV Shows

Guppedantha Manasu 27 Nov Today Episode : చిత్రను చంపేందుకు యత్నించిన తన లవర్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రిషి.. అసలు తప్పు ఎవరిదో చిత్ర చెబుతుందా?

Guppedantha Manasu 27 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 27 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 931 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధారకు బెయిల్ ఇవ్వడంతో తనను తీసుకొని ఇంటికి వస్తాడు రిషి. వసుధార ఎందుకు బాధపడుతున్నావు. నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసు అంటాడు రిషి. అవును వసుధార అంటాడు మహీంద్రా. నా వల్ల మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. నా వల్ల డీబీఎస్టీ కాలేజీ పేపర్లలోకి ఎక్కింది అంటుంది వసుధార. నువ్వేం బాధపడకు వసుధార. అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు రిషి. వాళ్లు చూపించిన వీడియోలో వాళ్లకు నువ్వు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. అసలు చిత్ర నీకెందుకు మెసేజ్ చేసింది. నువ్వెందుకు అక్కడికి వెళ్లావు. అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు రిషి. అసలు చిత్ర సూసైడ్ ఎందుకు చేసుకుందో తెలియడం లేదు సార్ అంటుంది వసుధార. రాత్రి నేను కిచెన్ లో ఉండగా చిత్ర నుంచి మెసేజ్ వచ్చింది అని అంటుంది వసుధార. చిత్ర ఏదో ఆపదలో ఉంది అనుకొని చిత్ర వాళ్ల ఇంటికి వెళ్తుంది వసుధార.

చిత్ర ఏంటి నాకు మెసేజ్ చేశావు అంటే.. నేను చేయలేదు మేడమ్ అంటుంది చిత్ర. మేడమ్ నేనే చేశాను మేడమ్ అంటాడు తన బాయ్ ఫ్రెండ్. చిత్ర అంటే నాకు ఇష్టం మేడమ్. మీరే ఎలాగైనా మమ్మల్ని కలపాలి. మా ప్రేమను నిలబెట్టాలి అంటాడు. వాళ్ల పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. వాళ్లకు కూడా ఇష్టమే అంటాడు. అవును అమ్మ.. తనను ఒక ఇంటి వాడికి ఇద్దామని అనుకున్నాం అంటారు. నాకు చిత్ర కావాలి అంటాడు. మీరు ఒప్పుకోకండి మేడమ్ అంటుంది చిత్ర. మీరు ఒప్పుకోండి మేడమ్ అని తన తల్లిదండ్రులు వేడుకుంటారు. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. వసుధార కాళ్ల మీద పడబోతాడు దీంతో నన్ను ఇబ్బంది పెట్టకండి. తనకు ఇష్టం లేదు అంటోంది కదా. ఎంత రిక్వెస్ట్ చేసినా ఉపయోగం ఉండదు అంటుంది వసుధార. మీరు ఇలాగే చేస్తే అందరినీ జైలులో వేయిస్తాను అని బెదిరిస్తుంది వసుధార.

Guppedantha Manasu 27 Nov Today Episode : ఇదంతా కావాలని ఎవరో చేయించారని అనుమానించిన రిషి

అయినా కూడా ఆ అబ్బాయి వినడు. దీంతో నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్లు. అసలు ఈ టైమ్ లో నీకు ఇక్కడేం పనిరా అంటూ అతడిని వెళ్లగొడుతుంది. చిత్రకు ధైర్యం చెబుతుంది. తన తల్లిదండ్రులకు వార్నింగ్ ఇస్తుంది. ఇది జరిగింది అని చెబుతుంది వసుధార. నువ్వు వెళ్ళేముందు నాకు ఒక్కసారి చెప్పి ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు నాకు చెప్పకుండా వెళ్లావు అంటాడు రిషి. దీంతో అప్పటికే మీరు అలిసిపోయారు సార్. అందుకే నేను మీకు చెప్పకుండా వెళ్లాను అంటుంది వసుధార. ఇందులో నుంచి మనం బయటపడాలంటే చిత్ర చెప్పే సాక్ష్యం మీదనే ఆధారపడి ఉంటుంది అంటాడు రిషి. వాళ్ల మనసులో ఏముందో.. అసలు వాళ్లు ఎందుకు ఇదంతా చేశారో మనకు తెలియదు. వాళ్లు ఎవరైనా సరే పట్టుకొని తీరతాను అంటాడు రిషి.

మరోవైపు శైలేంద్ర, దేవయాని ఫోన్ లో మాట్లాడుకుంటారు. వాళ్లు నన్ను పట్టుకోలేరు. ఈ మ్యాటర్ కు నాకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను అంటాడు శైలేంద్ర. నువ్వు అంత ఈజీగా దొరకవు నాన్న అంటుంది దేవయాని. ఇందులో మనకు ఏ ఆధారాలతో సంబంధం లేదు అంటాడు రిషి. దీని వెనుక ఎవరు ఉన్నా అస్సలు వదలను అంటాడు రిషి. మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అంటుంది వసు. దీంతో జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్లు.. రిషి కాదు అంటాడు మహీంద్రా. ముందు ఇప్పుడు ఇరుక్కొన కేసు నుంచి వసుధార బయట పడాలి కదా మామ్.. అప్పుడు నన్ను కొట్టడానికి అంటాడు శైలేంద్ర.

మరోవైపు రాత్రి అందరూ పడుకున్నాక రిషి.. తన బెడ్ మీద కనిపించడు వసుధారకు. రిషి సార్ ఎటు వెళ్లారు అని అనుకుంటుంది వసుధార. మామయ్య గదిలో ఉన్నారా అని మహీంద్రాను లేపుతుంది వసుధార. ఏమైంది అని అడుగుతాడు. రిషి గురించి అడుగుతుంది. నా గదిలో లేడు అంటాడు. సర్ కోసం ఇల్లు అంతా చూశాను కానీ ఎక్కడా లేరు. మీ గదిలో ఉన్నారేమో అని చూడటానికి వచ్చాను అంటుంది వసుధార.

ఇంత రాత్రి ఎక్కడికి వెళ్లి ఉంటారు అని అంటుంది. ఒకసారి ఫోన్ చేయి అంటే స్వీచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో చెప్పకుండా వెళ్లడం ఏంటి మామయ్య అంటుంది రిషి. నువ్వు తన గురించి భయపడకు. రిషిని ఎదిరించడం అంటే అడవిలో ఉన్న సింహంతో తలపడినట్టే. నా కొడుకు ఒక్కసారి అడుగు ముందుకు వేస్తే వెనక్కి తగ్గే అవకాశమే ఉండదు. తన పని పూర్తి చేసుకున్న తర్వాతే వస్తాడు. వెళ్లు అంటాడు మహీంద్రా.

మరోవైపు ఆసుపత్రిలో చిత్ర ఉన్న బెడ్ మీదికి తన ఫ్రెండ్స్ ను తీసుకొస్తాడు చిత్ర లవర్. చిత్రను చంపేయ్ రా. పొడిచిపడేయ్ రా అంటాడు. కానీ.. అక్కడ చిత్ర ఉండదు. దీంతో షాక్ అవుతాడు. సరిగ్గా పొడవడం లేదనుకుంటా అంటాడు రిషి. ఏంట్రా.. షాక్ అయ్యారా అంటాడు. నాకు ముందు నుంచీ నీ మీద డౌట్ ఉంది రా. అందుకే నా జాగ్రత్తల్లో నేను ఉన్నాను. పొడవండి.. పర్లేదు పొడవండి అంటాడు రిషి.

ఇక్కడ అమ్మాయి లేదని షాక్ అవుతున్నారా? ఎక్కడ ఉందా అని మీ మైండ్ లో తిరుగుతోందా? అటు చూడండి. దమ్ముంటే ఇప్పుడు టచ్ చేయండిరా అమ్మాయిని అనడంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు రిషి. చిత్ర లవర్ ను పట్టుకుంటాడు. ఎక్కడికి పారిపోతావురా లే అని పట్టుకుంటాడు.

ఆ తర్వాత ఉదయమే పోలీసులకు చెప్పి అసలు విషయం ఏం జరిగిందో క్లారిటీ ఇస్తాడు రిషి. ఏంటి సార్ ఇది. మేము ఏం పాపం చేశామని.. ఎందుకు మీరు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నారు అని చిత్ర పేరెంట్స్ అంటారు. మా ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం అంటారు. నా కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణం మీ భార్య. ఇప్పుడు తనను కిడ్నాప్ చేసింది కూడా మీరే అంటుంది చిత్ర తల్లి.

మా కూతురు కనబడటం లేదు. మా కూతురును ఎక్కడ దాచారో మీరు అడగండి సార్ అంటారు. దీంతో మేమే కిడ్నాప్ చేశామని మీ దగ్గర సాక్ష్యం ఉందా అంటే.. కిడ్నాప్ చేయాల్సిన అవసరం మీకు తప్ప ఇంకెవరికీ లేదు అంటారు పోలీసులు.

అసలు మా కూతురును ఉంచారా.. చంపేశారా అని అడుగుతారు చిత్ర పేరెంట్స్. మా కూతురు ఉందా లేదా అని అడుగుతారు. దీంతో ఉంది అంటాడు రిషి. ఉంటే ఎక్కడుందో చెప్పండి అంటే చూపిస్తాను అంటాడు రిషి. ఇదంతా వీడియోలో చూస్తూ ఉంటుంది దేవయాని. తనను వీల్ చైర్ లో మహీంద్రా తీసుకొస్తూ ఉంటాడు. చిత్రను చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏంజరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…

37 minutes ago

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

2 hours ago

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

3 hours ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

4 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

5 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

6 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

7 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

8 hours ago