Guppedantha Manasu 6 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 6 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను లేట్ చేశానా అని వసుధారపై కోపంగా ఉంటాడు రిషి. అయ్యో.. అనవసరంగా మాట జారాను అని అనుకుంటుంది వసుధార. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నిజంగానే కాలేజీకి లేట్ అవుతుంది అని చెప్పి ఇద్దరూ కారులో బయలుదేరుతారు. ఏంటి సార్ మూడీగా ఉన్నారు అని అడుగుతుంది వసుధార. దీంతో లేట్ అయిందని ఇందాక నాతో అన్నావు కదా దాని గురించే నేను ఆలోచిస్తున్నా అంటాడు రిషి. ఇంతకీ అసలు మీకు ఎందుకు ఈరోజు రెడీ అవడం లేట్ అయింది అని అడుగుతుంది వసుధార. దీంతో ముందు టవల్ మరిచిపోయాను. ఆ తర్వాత సబ్బు మరిచిపోయాను. అందుకే లేట్ అయింది అంటాడు. నువ్వు అక్కడ ఉండి ఉంటే నేను త్వరగా రెడీ అయ్యే వాడిని. కానీ.. నువ్వు అక్కడ లేవు. నువ్వు ఉంటే నాకు స్నానం చేయించేదానివి కదా అంటాడు రిషి. దీంతో నేను ఎందుకు స్నానం చేయిస్తాను. మీరేమీ చిన్న పిల్లాడు కాదు కదా అంటుంది వసు. అదేంటి వసు.. భర్తకు భార్య స్నానం చేయించదా అంటాడు. దీంతో సరే.. ఇంకోసారి నాకు చెప్పండి నేను చేయిస్తా అంటుంది వసుధార. ఆ తర్వాత కాలేజీకి వెళ్లి రిషి క్లాసులు చెబుతాడు. కాలేజీలో అన్ని క్లాసులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి.
కాలేజీలో తన రూమ్ లో కూర్చొని ఉంటుంది వసుధార. ఇంతలో ఇద్దరు వచ్చి మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటారు. దీంతో కొత్త లెక్చరర్స్ ను ఎందుకు తీసుకున్నారు అని ఇతర లెక్చరర్స్ ప్రశ్నిస్తారు. దీంతో జీతం పెంచకపోతే పాఠాలు చెప్పం అన్నారు కదా అంటే.. అవును మేడమ్ ఏదో 10 రూపాయలు వస్తాయని ఆశించాం. అంతే కానీ.. ఇలా మీరు కొత్త వాళ్లను తీసుకుంటారని అనుకోలేదు అంటారు. మీకు నచ్చినట్టుగా మీరే బయటికి వెళ్లారు కదా అంటుంది వసు. దీంతో ఇప్పుడే మేము యూనియన్ లో ఫిర్యాదు చేస్తాం అంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి కంప్లయింట్ చేస్తారా అంటూ అడుగుతాడు. మీరు అంత సడెన్ గా వెళ్లిపోతే పాఠాలు ఆగిపోతాయి. ఇక జీతాలు ఎలాగైనా పెంచుతారు అని అనుకుంటున్నారా? మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు అంటాడు రిషి. దీంతో సారీ సార్.. మేము మళ్లీ జాబ్ లోకి వస్తాం. వాళ్లను పంపించేయండి సార్ అంటారు. దీంతో మీరు రావడం కరెక్టే కానీ.. వాళ్లను పంపించాలని చెప్పడమే కరెక్ట్ కాదు అంటాడు రిషి. వాళ్లను పంపించం. మీరు ఉండండి.. వాళ్లు ఉంటారు. మీ పని మీరు చేసుకోండి.. వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. మేము ఇప్పుడు జీతాలు పెంచం. ఎప్పుడు జీతాలు పెంచాలని అనుకుంటామో అప్పుడే పెంచుతాం అంటాడు రిషి.
దీంతో సరే సార్.. ఒకసారి ఎండీ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అంటే.. సార్ మాటే నా మాట. అసలు ఈ కంపెనీకి ఎవరు ఎండీ అని అనుకుంటున్నారు. ఈ కాలేజీకి ఎండీ రిషి సారే. అన్నింటికీ ఆయనే ఎండీ. ఇప్పటికీ ఎప్పటికీ రిషి సారే ఎండీ అంటుంది వసుధార. మిషన్ ఎడ్యుకేషన్ కూడా మనం పూర్తి చేయాలి కాబట్టి మీరు పాఠాలు చెప్పండి.. కొత్తగా వచ్చిన వాళ్లు మిషన్ ఎడ్యుకేషన్ చూసుకుంటారు అని చెబుతాడు రిషి.
దీంతో వాళ్లు వెళ్లిపోతారు. నా మాట మీద గౌరవం ఉంచి నువ్వు ఈ ఎండీ సీటులో కూర్చున్నావు. అందుకే నీ గౌరవం, ఈ కాలేజీ గౌరవం నిలబెట్టాలి అని అంటాడు రిషి. విద్య రంగంలో ఒక విప్లవం తెద్దాం. ఆ విప్లవం వల్ల యుద్ధాలు జరగకూడదు. ప్రతి ఇల్లు ఒక విద్యాలయంగా మారాలి వసుధార అంటాడు రిషి. దీంతో నేను ఏం చేసినా మీకోసమే చేస్తాను సార్ అంటుంది వసుధార. నువ్వు నేను వేరు కాదు. నువ్వు నేను ఒక్కటే. ఇద్దరం కలిసి ఏం చేసినా విద్య కోసం చేద్దాం అంటాడు రిషి. దీంతో సరే సార్ అంటుంది వసుధార.
మరోవైపు దేవయానికి శైలేంద్ర ఫోన్ చేసి రిషి అన్నంత పని చేశాడు. వచ్చి రాగానే రిటైర్ ఉద్యోగులతో పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నాడు అంటాడు శైలేంద్ర. దీంతో రిషి అంటే ఏమనుకున్నావు. తనను దెబ్బ కొట్టాలంటే మన దగ్గర పెద్ద ప్లాన్ ఉండాలి. రిషి చాలా మంచివాడు. తనను అదే మంచితనంతో దెబ్బ కొట్టాలి. అంతే కానీ.. కుట్రలు, కుతంత్రాలతో రిషిని ఏం చేయలేం అంటుంది దేవయాని. నాకు తెలియకుండా నువ్వు ఏం ప్లాన్ చేయకు. ఏం చేయాలి అనేది నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం అంటుంది దేవయాని.
మరోవైపు వేరే కాలేజీ వాళ్లు రిషి, వసుధార గురించి మాట్లాడుకుంటారు. వాళ్లిద్దరికీ మ్యారేజ్ అయింది కదా. వాళ్లను కాలేజీ తరుపున విష్ చేయడానికి పిలుద్దాం అని అనుకుంటారు. విశ్వనాథం, ఏంజెల్ మేడమ్ కూడా అప్పటి వరకు వస్తారు అని పాండ్యన్ కు చెబుతాడు సార్. దీంతో పాండ్యన్, తన ఫ్రెండ్స్ చాలా సంతోషిస్తారు.
మరోవైపు మీరు ఇదివరకు రిషి సార్ లా ఉండటం లేదు. మీరు ఇదివరకు రిషి సార్ లా ఉండాలి అని అంటుంది వసుధార. దీంతో అప్పుడు రిషి సార్ ఎలా ఉండేవాడు అంటే.. స్టైల్ గా ఉండేవాడు అంటుంది వసుధార. అప్పుడు నేను మీకోసం పరితపించేదాన్ని అంటుంది వసుధార.
మరి అంత డిస్టర్బ్ చేస్తే ఎందుకు నాకు నో చెప్పావు అని అంటాడు రిషి. అవన్నీ నాకు తెలియదు సార్. అవన్నీ నాకు గుర్తు చేయకండి.. బాగుండదు అంటుంది వసుధార. ఎందుకు మొహం పక్కకు తిప్పుకుంటున్నావు అంటే మీ కళ్లలోకి చూడలేకపోతున్నాను సార్ అంటుంది వసుధార. ఇంతలో అవునా.. నా కళ్లలోకి చూడలేకపోతున్నావా ఎందుకో తెలుసా అంటూ వసుధారకు ముద్దు పెట్టబోతుండగా ఇంతలో విష్ కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటాడు.
మీరిద్దరూ విష్ కాలేజీ రూపురేఖలు మార్చారు. మీలాంటి వాళ్లను మేము చాలా మిస్ అవుతున్నాం. మీరిద్దరూ రేపు విష్ కాలేజీకి రావాలి. మీకు వెల్ కమ్ చెప్పడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు కాదనకండి. మీరు రానంటే.. స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ ఫీల్ అవుతారు. మీరు ఖచ్చితంగా రావాలి అంటే.. సరే వస్తాను అంటాడు రిషి. తెల్లవారగానే రెడీ అయి విష్ కాలేజీకి బయలుదేరుతారు. డాడ్.. మేము విష్ కాలేజీకి వెళ్తున్నాం అంటారు. దీంతో మహీంద్రా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.