Intinti Gruhalakshmi 6 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 6 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1094 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య నీకు అస్సలు టెన్షన్ లేదా? రేపు బోర్డ్ మీటింగ్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ నాకు ఫేవర్ గా ఉంటేనే నేను సీఈవో అవుతాను. లేకపోతే కష్టం అని ధనుంజయ్ అంటుంటే లాస్య మాత్రం సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఇంతలో ఆ కంపెనీ మేనేజర్ వస్తాడు. ఏమైంది నేను చెప్పిన విషయం అంటే.. సక్సెస్ మేడమ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కంపెనీ సీఈవోగా ఉండేందుకు ధనుంజయ్ కే ఓటేస్తామన్నారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని అంటాడు. దీంతో ధనుంజయ్, రత్నప్రభ ఇద్దరూ సంతోషిస్తారు. లాస్యకు థాంక్స్ చెబుతారు. మరోవైపు పులి మాస్క్ వేసుకొని తులసిని భయపెడుతుంది హనీ. నువ్వు ఏం చెప్పినా చేస్తాను అంటే.. నాకు ఈ రోజు మూడ్ లేదు హోమ్ వర్క్ చేసి పెట్టు అంటుంది. దీంతో హోం వర్క్ ఎగ్గొట్టేందుకు దొంగ వేషాలు వేస్తున్నావా? అంటే.. ప్లీజ్ ఆంటీ.. ఈ ఒక్క రోజు చేసి పెట్టు అంటుంది. దీంతో సరే అని చెప్పి హనీ సంతోషంగా ఉండేలా చేస్తుంది.
ఓ పక్క హనీ విషయంలో కోర్టు నోటీసు వచ్చింది. మరోవైపు సామ్రాట్ కంపెనీని రత్న వాళ్లు కబ్జా చేయబోతున్నారు. రేపే బోర్డ్ మీటింగ్. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. అని నందు అనసూయ, పరందామయ్యతో అంటాడు. తప్పు మనవైపు ఉన్నప్పుడు గొడవ కోర్టు దాకా వెళ్లినప్పుడు ఎవరైనా రెండు అడుగులు వెనక్కి వేస్తారు. కానీ.. తులసి మాత్రం నాలుగు అడుగులు ముందుకు వేస్తుంది అంటాడు పరందామయ్య. మనకు హనీ క్షేమం మాత్రమే కాదు. తులసి క్షేమం కూడా ముఖ్యమే అంటాడు పరందామయ్య. మరోవైపు కోర్టు గురించి తులసిని ప్రశ్నిస్తుంది హనీ. కోర్టు అంటే అందరి కంటే గొప్పదా అంటుంది హనీ. అవును.. నీకన్నా.. నాకన్నా గొప్పది అంటుంది తులసి. ఒకవేళ కోర్టు చెప్పినట్టు వినకపోతే ఏమౌతుంది అంటే జైలుకు వెళ్లాలి అంటుంది తులసి. దీంతో హనీ భయపడుతుంది. మీకు కోర్టు నోటీసులు వచ్చాయి కదా అంటుంది. అవేవీ పట్టించుకోకు నువ్వు. హాయిగా పడుకో అంటుంది తులసి.
మరోవైపు దివ్య, విక్రమ్ ఇద్దరూ హనీమూన్ కు రెడీ అవుతారు. కానీ.. విక్రమ్ డల్ గా కనిపించడంతో ఏమైంది మొహం ఏంటి అలా పెట్టావు అంటే అమ్మకు చెప్పకుండా ఇప్పటి వరకు నేను ఎక్కడికీ వెళ్లలేదు. గిల్టీగా అనిపిస్తోంది అంటాడు విక్రమ్. దీంతో ఒక వీడియో తీసి అత్తయ్య గారికి పెడతాను. అలాగే ఉండు అంటుంది దివ్య. వద్దు అంటాడు. ఈ గేట్ దాటి వెళ్లాక.. ఈ ఇంటి గురించి కానీ.. ఇంట్లో వాళ్ల గురించి కానీ మనం ఆలోచించకూడదు. మనం వేరే లోకానికి వెళ్తున్నాం. అక్కడ నువ్వు, నేను తప్ప ఇంకెవరూ ఉండరు.. ఉండకూడదు కూడా అంటుంది దివ్య. ఇంతలో అక్కడికి బసవయ్య, జాను ఇద్దరూ వస్తారు.
సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నావు. నీకు చెప్పేంత పెద్దరికం నాకు ఎక్కడ ఉంది అంటాడు బసవయ్య. మరి.. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే.. బయటికి వెళ్తున్నావు కదా.. నీకు వీడ్కోలు చెప్పడానికి వచ్చాను అంటాడు. శుభకార్యం మీద వెళ్తున్నావు. నీ మరదలును ఎదురు రమ్మంటావా అంటే వద్దులే అంటుంది దివ్య. ఆ తర్వాత బసవయ్యకు పంచ్ ఇచ్చి కారులో వెళ్తారు. వాళ్లు హనీమూన్ కు వెళ్తారు. నేను ఎక్కడికి వెళ్లాలి నాన్న అంటుంది జాను. వాళ్లను ఆపడం ఎలాగూ మనవల్ల కాలేదు. మనం కూడా వాళ్ల వెనుక వెళ్దాం అంటుంది జాను. వాళ్లను హనీమూన్ చేసుకోనీయకుండా చేద్దాం అంటుంది జాను.
హనీమూన్ ఎక్కువైతే వాళ్ల మధ్య ప్రేమ ఇంకా ఎక్కువవుతుంది. అప్పుడు వాళ్లను విడదీయడం కష్టం అంటుంది జాను. అత్తయ్య వచ్చే లోపు బావ వాళ్ల హనీమూన్ ప్లాఫ్ చేయాలి. వాళ్లు వెనక్కి వచ్చేలా చేయాలి. అత్తయ్య ముందు నా పరువు నిలబెట్టుకోవాలి అంటుంది జాను. దీంతో ఈ విషయం అక్కకు చెబితే హనీమూన్ క్యాన్సిల్ అవుతుంది కదా అంటే.. బావ వినే మూడ్ లో లేడు అంటుంది జాను. వాళ్ల కంటే ముందే మనం అక్కడికి వెళ్లి వాళ్ల హనీమూన్ ను క్యాన్సిల్ చేయాలి అంటుంది జాను.
మరోవైపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తారు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు కదా. ధనుంజయ్ గారు సామ్రాట్ గారి కజిన్. తమ్ముడి గురించి తెలియగానే సామ్రాట్ గారి ఫ్యామిలీకి అండగా ఉండేందుకు యూఎస్ నుంచి వచ్చేశారు అని చెబుతుంది లాస్య.
ఆయన లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు కానీ.. ఎవరో ఒకరు సామ్రాట్ లక్ష్యాన్ని తీసుకెళ్లాలి కదా. అది ధనుంజయ్ ఎందుకు కాకూడదు అని అంటుంది లాస్య. ప్రస్తుతం మా ఆయన ధనుంజయ్ ని కంపెనీ సీఈవోగా నియమించేందుకు అందరూ ఒప్పుకున్నందుకు థాంక్స్. అయినా కూడా ఫార్మాలిటీ కోసం రిజల్యూషన్ పాస్ చేయడం ముఖ్యం ఏమంటారు అంటుంది లాస్య.
దీంతో ఇంకో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రావాలి అంటారు. ఇంతలో అక్కడికి తులసి, నందు ఇద్దరూ వస్తారు. వాళ్లను చూసి లాస్య, రత్నప్రభ, ధనుంజయ్ షాక్ అవుతారు. తులసి రాగానే.. ధనుంజయ్ చైర్ లో నుంచి కొంచెం లేస్తారా అని అడుగుతాడు మేనేజర్. ఆ తర్వాత ఆ ప్లేస్ లో ఆమెను కూర్చోబెడతాడు మేనేజర్. మీటింగ్ స్టార్ట్ అయి ఎంత సేపు అయింది అని అడుగుతుంది తులసి. దీంతో ఇప్పుడే మేడమ్ అంటారు.
అయితే.. అంతకుముందే మేనేజర్ తులసికి ఫోన్ చేసి అసలు విషయం చెబుతాడు. ఆ మేనేజర్ తులసికి అన్ని విషయాలు చెబుతాడు. లాస్యకు అన్ని విషయాలు చెప్పాను మేడమ్. సామ్రాట్ గారు నా దేవుడు. సామ్రాట్ గారు ఎంతగా తన కంపెనీని ప్రేమిస్తారో.. తన కూతురును కూడా అంతే ప్రేమిస్తారు. మిమ్మల్ని కూడా చాలా అభిమానిస్తారు. ఆ కంపెనీని కాపాడుకోవడానికి నేను ఎంత దూరం అయినా వెళ్తాను అంటాడు మేనేజర్.
రేపు మీరు ఆఫీసుకు రండి.. మీటింగ్ సమయంలో రండి అంటాడు మేనేజర్. దీంతో రేపు నేను వస్తాను అని చెబుతుంది తులసి. నందుకు కూడా అసలు విషయం చెబుతుంది. రేపు మనం బోర్డ్ మీటింగ్ కు వెళ్లాలి అని చెబుతుంది తులసి.
హనీ మన దగ్గరే ఉంది కదా.. మళ్లీ నిప్పుతో చెలగాటం ఎందుకు తులసి అంటే.. వాళ్లు చెలగాటం ఆడాలని అనుకుంటే నేను ఏం చేయను. చేతులు ముడుచుకొని కూర్చోలేను కదా. రేపు మనం కంపెనీ బోర్డ్ మీటింగ్ కు అటెండ్ అవుతున్నాం. ధైర్యంగా ఉండండి అని చెబుతుంది తులసి.
ఈరోజు బోర్డ్ మీటింగ్ అజెండా ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. దీంతో అసలు అది అడగడానికి నువ్వు ఎవరు.. చెప్పడానికి వాళ్లు ఎవరు అని అడుగుతుంది లాస్య. ధనుంజయ్ గారికి ఈ కంపెనీ సీఈవోగా డైరెక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు అని అంటుంది లాస్య.
దీంతో ఆ డాక్యుమెంట్స్ లో ఏముందో అందరూ చదవండి అని చెబుతుంది తులసి. కంపెనీ సీఈవోగా తులసి ఉండాలని మేమంతా ఏకగ్రీవంగా రిజల్యూషన్ పాస్ చేస్తున్నాం అని అందులో రాసి ఉంటుంది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి రత్నప్రభ, లాస్య, ధనుంజయ్ వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.