Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 10 Nov Today Episode : తులసికి ప్రపోజ్ చేయడానికి నందు ప్లాన్.. విక్రమ్ పై కత్తితో దాడి చేసిన రౌడీలు.. బెడిసికొట్టిన బసవయ్య, జాను ప్లాన్

Intinti Gruhalakshmi 10 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 10 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1098 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జాను ఏదో ఆవేశపడి దివ్యను కిందపడేస్తుంది కానీ.. చివరకు దివ్యను ఎత్తుకొని మరీ తన రూమ్ లోకి తీసుకెళ్తాడు విక్రమ్. దీంతో ఇద్దరూ మరింత దగ్గరవుతారు. నువ్వు అసలు వాళ్లను దూరం చేయాలనుకుంటున్నావా? దగ్గర చేయాలనుకుంటున్నావా? ఇలా అయితే ఇంకో నెల రోజులు వాళ్లు ఇక్కడే ఉంటారు అని చెబుతాడు బసవయ్య. మరోవైపు రాజు.. లాస్య చెప్పిన పని మొదలు పెట్టేస్తాడు. నందు ఫైల్స్ అని చెక్ చేసి సంతకాలు పెడుతుంటాడు. మరోవైపు తులసి కూడా బిజీగా కంపెనీ కార్యక్రమాలు అన్నీ చూస్తుంటుంది. మేనేజర్ ను పిలుస్తుంది ఆ తర్వాత మరిచిపోతుంది. మీరు వచ్చినప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పని చేస్తున్నారు అంటాడు మేనేజర్. ధనంజయ్ గారు వచ్చినప్పటి నుంచి కంపెనీ గురించి వాళ్లు తీసుకున్న నిర్ణయాలు అన్నీ రివ్యూ చేయాలని అనుకుంటున్నా అంటే నంద గోపాల్ అవన్నీ చూశారు అంటాడు మేనేజర్. మన కంపెనీ తీసుకోవాల్సిన ప్రాజెక్ట్ పెండింగ్ ఫైల్స్ తీసుకురండి అంటే.. అవి కూడా నందగోపాల్ చూసుకుంటున్నారు. స్టాఫ్ అందరినీ పిలిచి ఆయన మాట్లాడుతున్నరు. ఆయన చాలా టాలెంటెడ్ మేడమ్. మీరిద్దరూ కంపెనీకి చాలా ప్లస్ అవుతారు మేడమ్ అని చెబుతాడు మేనేజర్. దీంతో తులసి చాలా సంతోషిస్తుంది.

మరోవైపు సాయంత్రం కాగానే తులసి, నందు ఇద్దరూ ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వస్తారు. వాళ్లను చూసి పరందామయ్య చాలా సంతోషిస్తాడు. వాళ్లను ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడతాడు. ఇంతలో అనసూయ దిష్టి తీయడానికి వస్తుంది. మిమ్మల్ని చూసి అందరూ కుళ్లుకుంటూ ఉంటారు. అందుకే దిష్టి అంటుంది అనసూయ. ముందు మీ అబ్బాయికి తీయండి అంటే అలా ఒక్కొక్కరికి తీయరు. ముందు మీరు ఇక్కడ నిలబడండి అని చెప్పి ఇద్దరికీ ఒకేసారి దిష్టి తీస్తుంది అనసూయ. ఇంటికి వెళ్లాక నందుకు మంచినీళ్లు ఇస్తుంది తులసి. ఎలా ఉంది అమ్మ మీ ఆఫీసు అంటే.. తెలిసిన ఆఫీసు, తెలిసిన స్టాఫే కదా అంటుంది తులసి. మీ అబ్బాయి నాకు సపోర్ట్ గా ఉన్నారు కదా. అన్నీ మీ అబ్బాయే చూసుకుంటున్నారు. పేరుకు మాత్రమే సీఈఓను అంటుంది తులసి. ఎప్పుడూ లేనిది ఎందుకు తులసి నన్ను పొగుడుతోంది. నేను దగ్గరవడానికి ఇదే కరెక్ట్ సమయం. మూడ్ చూసి నా మనసులో మాట చెప్పేయాలని అనుకుంటాడు నందు. మరోవైపు దివ్య, విక్రమ్ ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు మంచం దిగకు. కాలు బెణికింది అంటాడు విక్రమ్. నొప్పి లేదు అన్నా కూడా స్ప్రే చేస్తా అంటాడు విక్రమ్. మీరు మంచిగానే చాన్స్ తీసుకుంటున్నారు అంటుంది దివ్య.

Intinti Gruhalakshmi 10 Nov Today Episode : దివ్యకు ఫోన్ చేసి దీపావళి పండుగకు ఆహ్వానించిన తులసి

నీకు చాలా విషయాలు తెలుసు కదా అంటాడు విక్రమ్. ఇన్ని రోజులు కాపురం చేశాక ఆ మాత్రం తెలియకపోతే ఎలా అంటుంది దివ్య. ఆ తర్వాత తన కాలు తీసుకొని బెణికిన చోట మసాజ్ చేస్తాడు విక్రమ్. ఆ తర్వాత ఇద్దరూ ఫ్రూట్స్ తినిపించుకుంటారు. ఇక.. తులసి, నందు ఇద్దరూ సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేస్తుంటారు. దీంతో వాళ్లను చూసి అనసూయ, పరందామయ్య ఇద్దరూ తెగ సంతోషిస్తారు. వాళ్లను చూస్తుంటే ఏమనిపిస్తోంది నీకు అని అడుగుతాడు పరందామయ్య. దీంతో మళ్లీ మంచిరోజులు వస్తాయనిపిస్తోంది అంటుంది అనసూయ. హనీ వల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తాయనుకున్నాం కానీ.. ఆ హనీ వల్లనే ఇద్దరూ దగ్గరయ్యారు అంటాడు పరందామయ్య. త్వరలోనే ఇద్దరూ ఒక్కటవ్వాలని కోరుకుంటున్నా అంటాడు పరందామయ్య.

మరోవైపు నందు, తులసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎల్లుండి స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయండి అంటే ఆరోజు దీపావళి కదా అంటాడు నందు. అవును కదా మరిచిపోయా అంటుంది తులసి. ఇంతలో దివ్యకు కాల్ చేస్తుంది తులసి. దివ్య నీకు కాల్ వచ్చింది అంటే చూసి చెప్పొచ్చు కదా అంటుంది. ఇంతలో తులసి ఫోన్ అని చూసి వెంటనే లిఫ్ట్ చేస్తుంది. దీపావళికి రండి అని చెబుతుంది. తనను మాట్లాడనివ్వకుండా విక్రమ్ డిస్టర్బ్ చేస్తుంటాడు. మేము హనీమూన్ లో ఉన్నాం కదా అంటుంది దివ్య. హనీమూన్ ట్రిప్ లో ఉంటే ఎలా వస్తారు అని అనుకుంటుంది తులసి. ఫోన్ పెట్టేస్తుంది.

మరోవైపు విక్రమ్, దివ్యను విడదీయడం కోసం మరో ప్లాస్ వేస్తారు బసవయ్య, జాను. ఇద్దరు రౌడీలను పిలిచి వాళ్లను బెదిరించాలని చెబుతారు. ఇద్దరూ అప్పుడే జాగింగ్ కు వస్తారు. వాళ్లను బెదిరించి ఇంటికి పారిపోయేలా చేయాలని అంటారు బసవయ్య, జాను.

ఇక.. నందును రెచ్చగొడతారు పరందామయ్య, అనసూయ. వెంటనే నీ పని కానివ్వు. నీకు దగ్గర ఉన్నప్పుడే తులసికి నీ మనసులో మాట చెప్పు అంటాడు పరందామయ్య. దీంతో తన పుట్టింటి వాళ్లు వస్తేనో.. లేక తను పుట్టింటి వాళ్ల ఇంటికి వెళ్తేనో సంతోషంగా ఉంటుంది అంటాడు పరందామయ్య.

దీంతో నీ పుట్టింటి వాళ్లను పండుగకు పిలవొచ్చు కదా అంటాడు నందు. దీంతో తులసి సంతోషిస్తుంది. మరోవైపు జాగింగ్ కు వెళ్లిన దివ్య, విక్రమ్ పై ఆ రౌడీలు దాడి చేస్తారు. దివ్యను కామెంట్ చేస్తారు. ఆ తర్వాత విక్రమ్ వాళ్లను కొట్టడంతో ఆ రౌడీలు కత్తితో విక్రమ్ పై దాడి చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Etela Rajender : ప్రతి ఒక ఇంటిపై జాతీయ పతాకం ఎగరవేదం ఎంపీ ఈటల రాజేందర్

Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…

6 hours ago

Uppal : ఉప్పల్ తిప్పల్ తీరినట్టే.. ఫ‌లించిన పరమేశ్వర్ రెడ్డి కృషి

Uppal  : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…

7 hours ago

Gut Health : ఈ కడుపు నుంచి ఇలాంటి శబ్దాలు రావడం మీరు గమనించారా… ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా…?

Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…

7 hours ago

Snake : ఇదేం దారుణం.. కర్రీ ప‌ఫ్‌లో పాము పిల్ల క‌నిపించే స‌రికి..!

Snake  : మహబూబ్‌నగర్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్‌ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న…

8 hours ago

Oily Skin : మీ చర్మం జిడ్డు పట్టి ఉంటుందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మీల మీల మెరిసే తాజా చర్మం మీ సొంతం…?

Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…

17 hours ago

Pistachios Salmonella : మీరు పిస్తా పప్పు తింటున్నారా… శరీరంలో ఈ విషపూరిత బ్యాక్టీరియా… ప్రాణాలకే ముప్పు…?

Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…

18 hours ago

Early Puberty : ఈ రోజుల్లో పిల్లలు త్వరగా ఎదుగుతున్నారు… కారణం ఏమిటి తెలుసా…?

Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు…

19 hours ago

Children Wetting The Bed : రాత్రిపూట మీ పిల్లలు మాటిమాటికి బెడ్ తడుపుతున్నారా… అయితే, ఈ టిప్స్ ఫాలో అవ్వండి…?

Children Wetting The Bed : పసిపిల్లలు రాత్రిలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఫైవ్ ఇయర్స్ లోపు…

20 hours ago