Guppedantha Manasu 10 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 10 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 917 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంజెల్ మన మీద చాలా కోపంగా ఉంది అని కారులో వెళ్తూ వసుధారకు చెబుతాడు రిషి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు వసుధార. జగతి మేడమ్ చనిపోయిన విషయం ఎందుకు ఏంజెల్ కు చెప్పలేదని ఆలోచిస్తున్నావు కదా అంటాడు. మీరు చెప్పలేదని నేను కూడా చెప్పలేదు సార్ అంటుంది వసుధార. మీరు ఆ విషయం చెబితే ఏంజెల్ మన పరిస్థితిని అర్థం చేసుకునేదేమో సార్.. ఎందుకు చెప్పలేదు అంటే.. మనం ఏం చెప్పినా ఏంజెల్ వినడం లేదు అంటాడు రిషి. మనం చెప్పింది అంతా అబద్ధం అని ఏంజెల్ అంటే నేను తట్టుకోలేను. తర్వాత తనకు నిజం తెలిస్తే చాలా బాధపడుతుంది. అమ్మ లేదనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. తను ఎప్పుడూ మనతోనే ఉంటుంది.. నాతోనే ఉంది. మా అమ్మ చనిపోయిందనే విషయం ఎవ్వరికీ చెప్పే అవసరం నాకు లేదు వసుధార. అమ్మ ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది అని అంటాడు రిషి. ఇంతలో ఒక బైక్ రిషి కారుకు అడ్డంగా పెడతాడు. దీంతో సడెన్ గా కారు ఆపుతాడు రిషి. కోపంతో ఏంటి ఇలా రోడ్డుకు అడ్డంగా అంటూ తిడతాడు. హెల్మెట్ తీయగానే.. పాండ్యన్ ను చూసి షాక్ అవుతాడు రిషి. పాండ్యన్ నువ్వా అంటే.. ఈ లెటర్స్ ఇవ్వడానికి వచ్చాను సార్ అంటాడు పాండ్యన్.
ఈ లెటర్స్ వచ్చి చాలా రోజులు అయింది. ప్రిన్సిపల్ సార్ ఇచ్చారు అంటాడు పాండ్యన్. సరే పాండ్యన్ థాంక్యూ అంటాడు రిషి. ఇంతకీ ఈ లెటర్స్ ఎవరు పంపించారు అని అనుకుంటాడు. వసుధారను అడుగుతాడు రిషి. సరే.. తర్వాత చూద్దాంలే. డ్యాష్ బోర్డ్ లో పెట్టు అంటాడు రిషి. దీంతో వాటిని డ్యాష్ బోర్డ్ లో పెడుతుంది వసుధార. ఇంటికి వచ్చి మహీంద్రాను చూస్తారు. మహీంద్రా డ్రింక్ చేశారా అని అనుకుంటాడు రిషి. డాడ్ అని పిలుస్తాడు. దీంతో రిషి వచ్చావా అంటాడు. ఏంటి నాన్న నేను డ్రింక్ చేశానని భయపడ్డావా? నేను నీకు తాగనని మాటిచ్చాను కదా అందుకే తాగలేదు అంటాడు మహీంద్రా. రిషి.. మీరు వెళ్లాక మీ పెదనాన్న, శైలేంద్ర, పెద్దమ్మ వచ్చారు. అందరం కలిసి లంచ్ చేశాం. ఆ తర్వాత వాళ్లు వెళ్లిపోయారు అంటాడు మహీంద్రా. సరే మామయ్య.. రండి భోం చేద్దాం అంటే.. నేను అక్కడికి రాలేనమ్మా.. నువ్వే ఇక్కడికి తీసుకురా అంటే సరే అంటుంది వసుధార. నేను నీకు ఎప్పుడూ ఏ విషయాలు చెప్పలేదు కానీ.. నీకు ఇప్పుడు చెప్పాలని అనిపిస్తోంది అని అంటాడు మహీంద్రా. నా లైఫ్ లోకి జగన్ వచ్చినప్పుడు ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకపోయినా 20 ఏళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది ఆ 20 ఏళ్లలో నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. చిన్నప్పుడు నువ్వు.. మా అమ్మెక్కడ అని అడిగేవాడివి కదా. నా గుండె పగిలిపోయేది అని అంటాడు మహీంద్రా. ప్రేమ గొప్పదనం తెలిసిన వాడిగా చెబుతున్నాను. నీ జీవితం నా జీవితంలా కాకూడదు. వసుధార చాలా మంచిపిల్ల. చిన్న వయసులోనే ప్రేమ కోసం చాలా చిత్రవధ అనుభవించింది అంటాడు మహీంద్రా.
నీ ప్రేమ కోసం వాళ్ల నాన్నతో గొడవ పడింది. దెబ్బలాడింది. తన బావతో పెళ్లి తప్పించుకోవడం కోసం ఈ లోకంలో ఏ ఆడపిల్ల చేయని సాహసం చేసింది అని అంటాడు మహీంద్రా. నువ్వే తాళి కట్టినట్టు ఊహించుకొని తన మెడలో తానే తాళి వేసుకున్న మహానుభావురాలు అంటాడు మహీంద్రా. దీంతో అవును డాడ్.. అప్పుడు తనకు పెళ్లి అయిందని భ్రమ పడి తనను ఎంత బాధపెట్టినా కూడా భరించింది కానీ.. ఏనాడూ తన కష్టం ఏంటో చెప్పుకోలేదు అంటాడు రిషి.
మీ మధ్య ఏర్పడిన దూరం చెరిగిపోయింది అంటాడు మహీంద్రా. మీ ప్రాణం కాపాడటం కోసం తన మనసును చంపుకొని నీ మీద అబద్ధం సాక్ష్యం చెప్పింది అంటాడు మహీంద్రా. వసుధార నిన్ను మోసం చేసిందని నువ్వు మళ్లీ భ్రమ పడ్డావు. అందరికీ దూరమయ్యావు. ఈసారి నీ మంచితనమూ.. వసుధార ప్రేమ గొప్పదనమూ తెలియదు కానీ.. వసుధారకు నువ్వు కనిపించావు.
అప్పుడు కూడా తనను నువ్వు అనరాని మాటలు అంటుంటే తను భరించింది తప్పితే ఒక్కమాట కూడా నిన్ను అనలేదు అంటాడు మహీంద్రా. నాకు గతం లేదు. నువ్వు నాకు దూరంగా వెళ్లు అని ఎన్నిసార్లు చెప్పినా ఏనాడూ తను నీకు దూరంగా వెళ్లలేదు. తను నిన్ను మరిచిపోవాలని చివరకు నీ రూపాన్నే మార్చుకున్నావు. తనకోసం అలా చేసినందుకు లోలోపల కుమిలిపోయింది అంతే కానీ.. నీ తోడు విడవలేదు నాన్న అంటాడు మహీంద్రా.
తనను తాను ఓదార్చుకుంది. వసుధార ప్రాణం నువ్వేరా అంటాడు మహీంద్రా. అంత మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావడం మన భూషణ్ ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం. తను నీకోసం, మన ఫ్యామిలీ కోసం చాలా కష్టాలు అనుభవించింది.
నాకు జగతి దొరకడం ఎంత అదృష్టమూ.. నీకు వసుధార దొరకడం ఎంతో అదృష్టం. కానీ.. జగతి మనకు దూరంగా అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. నా కలలు, కోరికలు అన్నీ తనతోనే తీసుకెళ్లింది అంటాడు. వసుధారకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎప్పుడూ నీ చేయి వదలదు అని తెలుసు. కానీ.. నువ్వు మాత్రం తన చేయి వదలొద్దురా. పాపంరా. నువ్వే తన సర్వస్వం అని బతుకుతున్న పిచ్చి పిల్ల. అలాంటి అమ్మాయి మనసు నొప్పించకు అంటాడు మహీంద్రా.
దీంతో సారీ డాడ్. నేను వసుధారను చాలా బాధపెట్టాను అంటాడు రిషి. మన మనసు స్తిమితంగా ఉండదు. ఒక్కోసారి నిజాలను గుర్తించలేదు. అందుకే చెబుతున్నా. వసుధార విషయంలో ఇక ముందు ఎప్పుడూ పొరపాటు పడకు అంటాడు మహీంద్రా. ఇక మీదట అలా జరగదు డాడ్ అంటాడు రిషి. వసుధారను చాలా సంతోషంగా చూసుకో రిషి అంటాడు మహీంద్రా. మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండాలి అంటాడు మహీంద్రా.
ఇంతలో మామయ్య అంటూ భోజనం తీసుకొస్తుంది వసుధార. భోం చేయండి అంటుంది. రిషితో మహీంద్రా చెప్పిన విషయాలు అన్నీ వింటుంది వసుధార. మహీంద్రాను చూసి తనకు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. కిచెన్ లోకి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మహీంద్రా అక్కడికి వచ్చి ఏంటి ఇది.. ఎందుకు ఏడుస్తున్నావు అంటే.. ఏం లేదు సార్ అంటుంది వసుధార.
సరే.. ఒకసారి కళ్లు మూసుకో అంటాడు రిషి. తనకు జుంకాలు గిఫ్ట్ గా ఇస్తాడు. ఇవి నీకు నచ్చాయా అని అడుగుతాడు. దీంతో చాలా బాగున్నాయి సార్ అంటుంది వసుధార. నిజంగానే బాగున్నాయి అని చెబుతున్నావా? లేక నేను ఫీల్ అవుతా అని చెబుతున్నావా అంటాడు రిషి. లేదు సార్.. నిజంగానే బాగున్నాయి అంటుంది వసుధార. వాటిని వేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.