Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 31 Oct Today Episode : దివ్యను కాపాడుకున్న తులసి, విక్రమ్.. ఈ విషయం తెలియక హనీని లాస్యకు అప్పగించిన నందు.. హనీని వాళ్లు చంపేస్తారా?

Intinti Gruhalakshmi 31 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 అక్టోబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1089 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియోలో కనిపించిన స్కూల్ ను నేను ఎక్కడో చూశాను అని గుర్తుకు తెచ్చుకుంటుంది తులసి. ఇంతలో తనకు ఏదో గుర్తొచ్చి వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంది తులసి. మరోవైపు ఎస్ఐకి ఫోన్ చేస్తాడు విక్రమ్. కారు వివరాలు చెప్పాను కదా.. అవి పంపిస్తారా అంటే పంపిస్తాను అంటాడు ఎస్ఐ. ఈ మాత్రం క్లూ చాలు.. వాళ్ల పని చెప్తా అని అనుకుంటాడు విక్రమ్. మరోవైపు దివ్యను కట్టేసి ఉంచుతారు. తనకు తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. కింద రక్తపు మడుగు కనిపిస్తుంది. మరోవైపు లాస్య, రత్నప్రభకు ఏం చేయాలో అర్థం కాదు. తులసిది గుండెనా, రాయా? చావు బతుకుల మధ్య ఉన్న తన కూతురును చూసి కూడా చలించడం లేదేంటి. తను అసలు మనిషేనా అంటుంది. దీంతో నీకు ముందే చెప్పాను. తులసిని డీల్ చేయడం చాలా కష్టమని అంటుంది లాస్య. తన మొండితనం అన్ని ఫీలింగ్స్ ను కవర్ చేస్తుంది. పాతికేళ్లు కాపురం చేసిన మొగుడిని నాకు వదిలేసింది అంటుంది లాస్య. రివర్స్ లో మనమే టెన్షన్ పడేలా చేస్తుంది. టప్పటడులు వేసేలా చేస్తుంది. ఇప్పుడు ఆ బాల్ తులసి కోర్టులో ఉంది. మనం ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది లాస్య.

దివ్య ఎక్కడుందో తను కనిపెట్టేస్తే ఎలా అంటుంది రత్నప్రభ. దీంతో దివ్య వీడియో చూసినంత మాత్రాన దివ్య ఎక్కడుందో ఎలా గుర్తుపట్టేస్తుంది అంటుంది లాస్య. ఏదో అనుమానం వచ్చి అడిగాను అంటుంది రత్నప్రభ. కాల్ చేసి తులసికి ఫైనల్ వార్నింగ్ ఇద్దామా అంటే అసలు తులసి రెస్పాన్స్ ఇవ్వడం లేదు అంటుంది లాస్య. నందగోపాల్ కి చేయి అంటుంది రత్న ప్రభ. దీంతో నందుకు ఫోన్ చేస్తుంది లాస్య. హనీ కోసం నాకు కాల్ చేసి వేస్ట్ అని ఎన్నిసార్లు చెప్పాను అంటాడు నందు. దీంతో దివ్య ప్రాణాలను కూడా తులసి చేతుల్లోనే పెట్టావా అంటుంది లాస్య. ఉన్నచోట కూర్చొని అరవడం కాదు.. రోషం ఉంటే.. తులసిని ఎదిరించి హనీని అప్పగించి దివ్యను కాపాడు అంటుంది లాస్య. దివ్య ఎక్కడుంది అని అడుగుతాడు నందు. లాస్య.. దివ్యకు ఏమైనా అయితే మాత్రం నిన్ను వదిలిపెట్టను అంటాడు నందు. దీంతో వెంటనే హనీని తీసుకొచ్చి అప్పగించు అంటుంది లాస్య. నువ్వు ఎక్కడి మగాడివయ్యా.. తులసి నీ పక్కనే ఉందా అని అడుగుతుంది. దీంతో లేదు అంటాడు. హనీ నీ పక్కనే ఉందా అంటే ఉంది అంటాడు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు. దివ్యను రక్షించుకోవడం తులసి వల్ల కాదు. పనికిరాని ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆలస్యం అయ్యేకొద్దీ దివ్య ప్రాణాలకు ప్రమాదం. వెంటనే హనీని తెచ్చి ఇవ్వు. ఆ వెంటనే దివ్యను మీ ఇంటి ముందు వదిలేస్తాను. మాటంటే మాటే.. ఎక్కువ టైమ్ లేదు. దివ్యకు ఏదైనా అయితే నా పూచీ కాదు అంటుంది లాస్య. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు.

Intinti Gruhalakshmi 31 Oct Today Episode : కారు లొకేషన్ కు వెళ్లిన విక్రమ్

మరోవైపు కారులో ఆ లొకేషన్ కు వెళ్తాడు విక్రమ్. తులసి కూడా ఆ చోటుకు వెళ్తుంది. ఇక్కడ స్కూల్ ఉండాలి ఎక్కడ ఉంది అని కొందరిని అడుగుతుంది. దీంతో వాళ్లు లొకేషన్ చెబుతారు. తన లొకేషన్ తో విక్రమ్ కూడా వెళ్తాడు. ఇక్కడ స్కూల్ ఎక్కడుంది అని అందరినీ అడుగుతూ వస్తుంది తులసి.

మరోవైపు దివ్యను కిడ్నాప్ చేసిన కారును చూస్తాడు విక్రమ్. ఎవరండి లోపల అని పిలుస్తాడు. ఎవరు కావాలి మీకు.. అని అడుగుతుంది ఒక మహిళ వచ్చి. ఈ కారు ఓనర్ లేడా అంటే పని మీద బయటికి వెళ్లాడు అంటుంది. నాకు కొంచెం పని ఉంది.. డబ్బులు బాగా ఇస్తా అంటాడు. దీంతో అటు పక్కన ఓ స్కూల్ ఉంటుంది. అక్కడే ఓ పాత ఇల్లు ఉంటుంది అక్కడే ఉంటాడు అని చెబుతుంది. దీంతో విక్రమ్ అక్కడికి బయలుదేరుతాడు.

మరోవైపు పరందామయ్య, అనసూయ టెన్షన్  పడుతూ ఉంటారు. ఏం జరుగుతోందో ఏం అర్థం కావడం లేదు. ఎవ్వరూ ఏం చెప్పడం లేదు. దివ్య ఎక్కడుందో, ఏం చేస్తుందో అంటుంది అనసూయ. ఈ ఇంట్లో ఎవరి దారి వాళ్లదే అన్నట్టుగా ఉంది అనసూయ అంటాడు పరందామయ్య.

మరోవైపు నందు హనీ కోసం వెతుకుతూ ఉంటాడు. హనీని అప్పగించి దివ్యను కాపాడుకోవాలని అనుకుంటాడు నందు. హనీ రూమ్ లోకి వెళ్లి హనీదా అంటే.. ఎక్కడికి అంకుల్ అంటుంది హనీ. మొత్తం చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా అంటాడు నందు.

హనీని ఎందుకు తీసుకెళ్తున్నావు అంటారు పరందామయ్య, అనసూయ. వాళ్ల బెదిరింపు ఎంత సేపు తట్టుకోవాలి అంటాడు నందు. దివ్యను చంపేస్తారు అంటాడు నందు. దీంతో అక్కడికి వెళ్తే నా పరిస్థితి కూడా అంతే ప్లీజ్ అంకుల్. నన్ను అప్పజెప్పొద్దు ప్లీజ్. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను. ప్లీజ్ అంకుల్. నన్ను తీసుకెళ్లొద్దు అంకుల్. నన్ను ఇక్కడే ఉంచు అంకుల్ అంటుంది హనీ. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు.

మరోవైపు తులసి ఆ పాత ఇంటిని చూసి అక్కడికి వెళ్తుంది. ఖచ్చితంగా దివ్య ఇక్కడే ఉంటుంది అని అనుకుంటుంది తులసి. ఇంతలో తనను ఎవరో చూసినట్టు అనిపించడంతో వెళ్లి దాచుకుంటుంది. తులసిని చూసి తనపై దాడి చేయబోతారు. ఇంతలో అక్కడికి విక్రమ్ వచ్చి తనను కాపాడుతాడు. రౌడీలను కొడతాడు. అత్తయ్య మీరు లోపలికి వెళ్లండి అంటాడు.

లోపలికి వెళ్లి దివ్యను ఆ పరిస్థితిలో చూసి షాక్ అవుతుంది తులసి. దివ్య ముఖం మీద నీళ్లు కొడుతుంది తులసి. దీంతో దివ్యకు మెళుకువ వస్తుంది. నీకు ఏం కాదు అంటుంది తులసి. మరోవైపు రౌడీలను విక్రమ్ చితకబాదుతాడు. దీంతో రౌడీలంతా అక్కడి నుంచి పారిపోతారు.

దివ్య చాలా నీరసంగా ఉంటుంది. దీంతో వెంటనే డ్రైవర్ కు ఫోన్ చేసి కారును తీసుకురా అంటాడు. దీంతో అలాగే సార్.. అని డ్రైవర్ కారును తీసుకొస్తాడు. దీంతో దివ్యను ఎత్తుకొని బయటికి తీసుకొస్తాడు విక్రమ్.

మరోవైపు నందుకు ఏం చేయాలో అర్థం కాదు. నేను కూడా తులసిలా తయారవుతున్నాను. దివ్య గురించి టెన్షన్ పడుతూ ఎందుకు హనీ పట్ల జాలి పడుతున్నాను. దివ్య కంటే నాకు హనీ ఎక్కువేం కాదు. కూల్ గా తీసుకెళ్లి హనీని హాండ్ ఓవర్ చేస్తాను అని అనుకుంటాడు నందు.

వెంటనే హనీ దగ్గరికి వెళ్తాడు. ఈ అంకుల్ మీద కోపంగా ఉందా అంటే భయంగా ఉంది అంటుంది హనీ. దివ్యకు ఏమైనా అయితే నా బాధ్యత కాదు అంటూ నందుకు ఫోన్ చేస్తుంది లాస్య. దీంతో హనీని తీసుకొని లాస్య దగ్గరికి బయలుదేరుతాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

5 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

6 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

7 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

8 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

9 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

10 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

11 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

12 hours ago