Categories: NewsTV Shows

Brahmamudi 31 Oct Today Episode : స్వప్న కడుపు అబద్ధం అని తేల్చేసిన రుద్రాణి.. కావ్య మీదికి నెట్టేసిన స్వప్న.. కావ్య, స్వప్న ఇద్దరినీ ఇంట్లో నుంచి పంపించేసిన దుగ్గిరాల ఫ్యామిలీ

Brahmamudi 31 Oct Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 అక్టోబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 241 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ డాక్టర్ సరిగ్గానే ట్యాబ్లెట్స్ ఇచ్చిందట అంటుంది రుద్రాణి. దీంతో కడుపు ఉంటేనే కదా అబార్షన్ అయ్యేది. లేకపోతే ఎలా అవుతుంది అంటుంది రుద్రాణి. కడుపు లేకపోవడం ఏంటి మమ్మి అంటాడు రాహుల్. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇంత పెద్ద అబద్ధాన్ని స్వప్న దాయలేదు. తనకంత సీన్ లేదు అంటాడు రాహుల్. ఆ కడుపును అడ్డుపెట్టకొని నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోకి వచ్చింది. ఎంత ధైర్యంగా నటిస్తోంది అంటాడు రాహుల్. అందుకే కదా ప్రూఫ్స్ కోసం చూస్తున్నాను. ఆ డాక్టర్ శ్రీదేవికి రిపోర్ట్స్ పంపించాను అంటుంది రుద్రాణి. అది ప్రూవ్ అయితే దాన్ని ఇంట్లో నుంచే గెంటేస్తాను అంటుంది రుద్రాణి. మరోవైపు నేను ముందు రెడీ అవుతా అంటే నేను ముందు రెడీ అవుతా అంటూ రాజ్, కావ్య ఇద్దరూ కొట్లాడుకుంటారు. చివరకు రాజ్ ను బయటికి నెట్టేసి రమ్ లోకి వెళ్తుంది కావ్య. నేను ఫాస్ట్ గా రెడీ అయి వస్తాను. మీరు కొంచెం ఓపిక పట్టండి. మా మంచి అబ్బాయి కదా అంటూ కావ్య చెప్పి వెంటనే రెడీ అవుతుంది కావ్య. మరోవైపు తన భర్త రాజ్ కోసం ఒక డ్రెస్ రూమ్ లో పెడుతుంది కావ్య. అపర్ణ తెచ్చిన డ్రెస్ కూడా అక్కడే ఉంటుంది. చూద్దాం.. ఏ డ్రెస్ వేసుకుంటాడో అని అనుకుంటుంది కావ్య.

రెడీ అయి బయటికి వస్తుంది. తనను చీరలో చూసి షాక్ అవుతాడు రాజ్. ఏంటి అలా చూస్తున్నారు అంటే.. ఏం లేదు అంటాడు రాజ్. మీది ఖరీదైన ఫోన్ కదా. ఒక ఫోటో తీస్తారా అంటే సరే తీసుకో అంటాడు రాజ్. వెంటనే ఒక్క ఫోటో తీస్తాడు రాజ్. ఏంటి అలా బిగుసుకుపోయావు.. ఫ్రీగా నిలుచో అంటాడు రాజ్. కొంచెం వెనక్కి వెళ్లు.. అంటాడు. తన ఫోటో తీస్తాడు. బాగొచ్చింది అంటాడు. చాలా బాగా తీశారు అంటుంది కావ్య. ఆ తర్వాత నేను వెళ్లి రెడీ అవుతా అంటాడు రాజ్. చిన్న బాకీ ఉండిపోయింది ఒకటి అంటాడు. ఆతర్వాత తనకు చెక్కిలిగింతలు పెడతాడు. నువ్వు ముందు నాకు ఇచ్చావు కదా. అందుకే నీకు ఇచ్చాను అంటాడు రాజ్. ఆ తర్వాత లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. అక్కడ రెండు డ్రెస్సులు కనిపిస్తాయి. ఇవేంటి రెండు డ్రెస్సులు కనిపిస్తున్నాయి అని అనుకుంటాడు. కావ్య తెచ్చిన డ్రెస్ వేసుకోవాలా? లేక అమ్మ తెచ్చిన డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తుంటాడు.

Brahmamudi 31 Oct Today Episode : ఒక్క ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్న రుద్రాణి

స్వప్న రెడీ అయి కిందికి వస్తుంది. మరోవైపు స్వప్న నాటకానికి ముగింపు ఎప్పుడు చెప్పాలి అని రుద్రాణిని అడుగుతాడు రాహుల్. ఒక్క ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా అంటుంది రుద్రాణి. వెయిట్ చేయి.. అసలు కథ త్వరలో మొదలవుతుంది అంటుంది రుద్రాణి. మరోవైపు రాజ్ ఏ డ్రెస్ వేసుకుంటున్నాడో అని బయట వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య. చూస్తే.. తను తెచ్చిన డ్రెస్ వేసుకుంటాడు రాజ్. దీంతో కావ్య సంతోషిస్తుంది.

కావ్య, రాజ్ కిందికి రావడం చూసి అటు చూడు మమ్మీ అంటాడు రాహుల్. ఓహో.. తన భార్య తెచ్చిన డ్రెస్ ను వేసుకుందా అని అనుకుంటుంది. మరోవైపు అపర్ణ.. రాజ్ ను చూసి నేను తెచ్చిన డ్రెస్ వేసుకోలేదా అని కోపం వస్తుంది. రాజ్ పై కోపంగా చూస్తుంది అపర్ణ.

చూడు వదిన.. బాగా చూడు. నువ్వు తెచ్చిన డ్రెస్ పక్కన పెట్టి భార్య తెచ్చిన డ్రెస్ వేసుకున్నాడు నీ కుమార రత్నం. పెళ్లాం బుట్టలో పడిపోయాడు వదిన అంటూ రెచ్చగొడుతుంది రుద్రాణి. హలో కావ్య గారు మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు అంటుంది అనామిక. దీంతో థాంక్యూ అనామిక అంటుంది. మీరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంది కావ్య. కళ్యాణ్ సిగ్గు పడుతుంటే హే ఆపు అంటుంది అనామిక.

మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అని అంటుంది కనకం. మరోవైపు స్వప్నకు సీమంతం స్టార్ట్ చేస్తారు. మరోవైపు ఇంత ఘనంగా సీమంతం చేస్తున్నారు. పుట్టబోయే బిడ్డ గురించి ఇంతలా ఎదురు చూస్తున్నారు. ఈ కడుపు నిజమైన కడుపు అయితే ఎంత బాగుండో అని మనసులో అనుకుంటుంది స్వప్న.

సీమంతం స్వప్నది అయినా ఈరోజు మనదే అంటుంది రుద్రాణి. మరోవైపు రుద్రాణికి కరెక్ట్ గా స్వప్నకు అక్షింతలు వేసే సమయంలోనే కాల్ వస్తుంది. దూరం వెళ్లి మాట్లాడుతుంది. డాక్టర్ శ్రీదేవి ఫోన్ చేస్తుంది. మీ అనుమానం నిజమే. ఆ డాక్టర్ ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చింది. కడుపు లేదు అంటుంది. దీంతో తెగ సంబురపడిపోతుంది రుద్రాణి.

వెంటనే రాహుల్ దగ్గరికి వెళ్లి స్వప్నను వదిలించుకుంటావా? లేక పెళ్లాంగా ఉంచుకుంటావా? అని అడుగుతుంది. అసలు ఏమైంది మమ్మీ అంటాడు. మరోవైపు రా రుద్రాణి అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. వస్తున్నా ధాన్యలక్ష్మి వస్తున్నా అంటుంది రుద్రాణి.

ఎంత నాటకం ఆడావే.. నన్ను నా కొడుకును ఫూల్స్ ను చేస్తావా? అని అనుకుంటుంది. అందరి ముందే నీకు అవమానం జరిగేలా చేస్తాను అని అనుకుంటుంది రుద్రాణి. అక్షింతలు వేస్తుంది రుద్రాణి. నువ్వు గిఫ్ట్ ఇవ్వవా అంటుంది ధాన్యలక్ష్మి. ఇస్తాను అని అనుకుంటుంది రుద్రాణి.

మరోవైపు కావ్య వెళ్లి స్వప్నకు అక్షింతలు వేస్తుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి ఇద్దరూ తమ రూమ్ లోకి వెళ్తారు. ఏమైంది మామ్ అంటే ఆ స్వప్నకు అసలు కడుపే లేదట అంటుంది. దీంతో రాహుల్ షాక్ అవుతాడు. ఇదే విషయాన్ని అందరి ముందు చెప్పి ఉండొచ్చు కదా అంటాడు రాహుల్. నేను ఇప్పుడే అందరి ముందు దానికి కడుపు లేదని చెబుతాను అంటే ఆ స్వప్న ఒప్పుకోదు. తనది నిజమైన కడుపు అంటూ వాదిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు. పైగా మనల్ని ఎవ్వరూ నమ్మరు కూడా. అదే చెప్పాల్సిన వాళ్లు చెబితే మనవాళ్లే ఆ స్వప్నను ఇంట్లో నుంచి తరిమేస్తారు.

అందుకే దానికి ట్రీట్ మెంట్ చేసిన దొంగ డాక్టర్ ప్రియతో చెప్పిద్దాం అంటుంది రుద్రాణి. వెంటనే ప్రియకు ఫోన్ చేస్తుంది. ఎవరు అంటే.. నా ఫ్రెండ్ అత్తగారును నేను అంటుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరికో కాల్ చేయబోయి ఎవరికో కాల్ చేసినట్టున్నారు అంటుంది ప్రియ. కానీ.. నువ్వు ఇచ్చిన రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవి ఫేక్ అని నాకు తెలుసు నీకు తెలుసు. ఇవి బయటికి వస్తే ఏమౌతుందో కూడా నీకు బాగా తెలుసు అంటుంది రుద్రాణి.

దీంతో ప్రియ అక్కడికి వస్తుంది. నువ్వు నిజం చెబుతావా? లేక నువ్వు చెబుతావా అని బెదిరిస్తుంది. తన చీరలో నుంచి పెట్టుకున్న క్లాత్ ను తీసేస్తుంది. దీంతో స్వప్న రివర్స్ అవుతుంది. నేను కడుపుతో ఉన్నట్టు అబద్ధం చెప్పమన్నదే ఈ కావ్య అంటూ.. అంత కావ్య మీదికి నెట్టేస్తుంది స్వప్న. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

4 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

6 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

8 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

9 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

12 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

15 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago