
gautham krishna decision for female contestants as captain in bigg boss 7
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగిన 6 సీజన్లు ఒక ఎత్తు అయితే.. ఈ సీజన్ మరో ఎత్తు. ఈ సీజన్ సూపర్ సక్సెస్ అయిందంటే దానికి కారణం.. ఉల్టా పుల్టా. అవును.. సీజన్ 7 గురించి ప్రస్తుతం దేశమంతా మాట్లాడుకుంటోంది. ఈసారి సీజన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఎలిమినేషన్, నామినేషన్ల ప్రక్రియ, టాస్కులు ఇలా అన్నీ రివర్స్ లో జరుగుతున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ కావచ్చు.. ఇంకోటి కావచ్చు. ఎలిమినేట్ అయిన వాళ్లను మళ్లీ తిరిగి హౌస్ లోకి తీసుకురావడం.. ఇలా ఏది చూసినా కూడా ఈసారి అంతా కొత్తగా, వింతగా ఉంది. ఇదంతా పక్కన పెడితే మొన్ననే బిగ్ బాస్ కెప్టెన్ అయిన గౌతమ్ కృష్ణ కెప్టెన్ కాగానే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. గౌతమ్ కృష్ణకు ఇప్పటికే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. హౌస్ కి వెళ్లేవరకు అసలు గౌతమ్ కృష్ణ గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ.. హౌస్ లోకి వెళ్లగానే గౌతమ్ కృష్ణ ప్రేక్షకుల మనసును గెలుచుకొని తన సత్తా చాటుతున్నాడు. రోజురోజుకూ ఫ్యాన్స్ ను పెంచుకుంటూ పోతున్నాడు. ఎన్నిసార్లు గౌతమ్ నామినేషన్లలోకి వచ్చినా తన ఫ్యాన్స్ ఆయన్ను కాపాడుతున్నారు. భారీగా ఓట్లు వేసి మరీ గెలిపిస్తున్నారు.
తాజాగా కెప్టెన్ కాగానే ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కెప్టెన్ తీసుకోని నిర్ణయాన్ని గౌతమ్ తీసుకున్నాడు. కెప్టెన్ అయ్యాక తన డిప్యూటీలుగా శోభ, రతికను ఎంచుకున్నాడు గౌతమ్. ఆ తర్వాత వంటలు వండటంలో కానీ.. ఇంటిని చక్కదిద్దడంలో కానీ ఎప్పుడైనా మహిళదే పై చేయిగా ఉంటుంది. అది నేను చెప్పడం కాదు.. అందరూ చెప్పేదే.. అందరికీ తెలిసిందే అంటూ గౌతమ్ కృష్ణ చెప్పుకొచ్చాడు. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మన లైఫ్ లో ఉన్న మహిళలందరికీ, ఈ షో చూస్తున్న మహిళా ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా ఒక గొప్ప నివాళి ఇవ్వాలని నేను భావిస్తున్నాను అంటూ గౌతమ్ కృష్ణ చెప్పుకొచ్చాడు. ఈ వారం అంతా ఉమెన్ వీక్ సెలబ్రేట్ చేసుకుందాం. ఈ వారం మొత్తం మనమే పని చేద్దాం. లేడీ హౌస్ మెంట్స్ కు అందరికీ కంప్లీట్ గా ఈ వారం మొత్తం హాలీడే అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్. దీంతో హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్లు అందరూ చప్పట్లు కొట్టి గౌతమ్ ను తెగ మెచ్చుకుంటారు.
గౌతమ్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడని గౌతమ్ అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ.. ఆయన్ను సీక్రెట్ రూమ్ కు పంపించాడు బిగ్ బాస్. గౌతమ్ మధ్యలో ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ కాదు.. బిగ్ బాస్ విన్నర్ అయ్యే చాన్స్ ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్. గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి అశ్వద్ధామ 2.0గా రీఎంట్రీ ఇచ్చి అందరికీ చుక్కలు చూపించాడు. మరింత స్ట్రాంగ్ గా, మెచ్యూర్డ్ గా వచ్చి గేమ్ ను తనదైన శైలిలో ఆడుతున్నాడు. ప్రతి వారం కూడా ఏమాత్రం తగ్గకుండా టాస్కులు ఆడుతూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు మహిళలకు సూపర్బ్ ట్రిబ్యూట్ ఇచ్చి శెభాష్ అనిపించుకున్నాడు గౌతమ్. తన నిర్ణయంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు గౌతమ్. మొదటి నిర్ణయం అది కాగా.. తన రెండో నిర్ణయంగా కష్ట జీవి, పని దొంగ పేరుతో మరో నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి రోజు లైట్స్ ఆఫ్ కాగానే.. ఆ రోజు ఎవరు ఎంత ఎక్కువ పని చేశారు.. ఎవరు తక్కువ పని చేశారు.. ఎక్కువ పని చేసిన వాళ్లకు కష్ట జీవి అని .. తక్కువ పని చేసిన వాళ్లకు పని దొంగ అని బిరుదు ఇద్దాం మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు గౌతమ్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.