Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 4 Dec Today Episode : అమ్మమ్మ కాబోతున్న తులసి.. ఈ విషయం తెలిసి తట్టుకోలేకపోయిన రాజ్యలక్ష్మి.. లాస్యతో కలిసి మరో మాస్టర్ ప్లాన్

Intinti Gruhalakshmi 4 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1118 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దీంతో తనను తీసుకెళ్లి రూమ్ లో పడుకోబెడతాడు. తర్వాత దివ్య స్పృహలోకి వస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్ కు వెళ్దాం అని అంటాడు విక్రమ్. దీంతో ఇప్పుడేం వద్దు ఇంకా టైమ్ ఉంది అని అంటుంది దివ్య. ఇంకా టైమ్ ఉండటం ఏంటి అంటుంది రాజ్యలక్ష్మి. అనవసరంగా మా బావను టెన్షన్ పెడుతున్నారు అంటుంది జాను. దీంతో నేను టెన్షన్ పెట్టడం కాదు.. మీ బావను టెన్షన్ పెట్టడానికి ఒకరు వస్తున్నారు అని చెబుతుంది దివ్య. ఎవరు ఎక్కడ ఉన్నారు అంటే.. ముసిముసిగా నవ్వుతుంది దివ్య. దీంతో అర్థం కాలేదా బావ గారు అక్క బొజ్జలో దాక్కున్నాడు. ఆ సిగ్గు చూస్తే తెలియడం లేదా అంటుంది ప్రియ. దివ్య నిజమా అంటాడు విక్రమ్. ఏయ్.. థాంక్యూ డియర్ అంటాడు. శుభవార్త చెప్పావు అంటాడు విక్రమ్. అమ్మ నువ్వు నానమ్మవు కాబోతున్నావు అంటే చాలా సంతోషంగా ఉంది బాబు అంటుంది రాజ్యలక్ష్మి. కానీ.. లోపల చాలా కోపంగా ఉంటుంది రాజ్యలక్ష్మి.

మరోవైపు అనసూయ దీనంగా కూర్చొని ఉంటుంది. దీంతో తులసి కూడా తన దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. సారీ అత్తయ్య కఠినంగా మాట్లాడాను. ఏం అనుకోవద్దు అంటుంది తులసి. ఇంతలో పరందామయ్య వస్తాడు. కఠినంగా మాట్లాడలేదు.. నిజాలే మాట్లాడావు. నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి అంటాడు పరందామయ్య. ఎదుటి వాళ్లు బాధపడతారని ఇన్నాళ్లు నా అభిప్రాయాలు నా దాంట్లోనే దాచుకునేదాన్ని. ఎందుకో ఈ మధ్య నాలో ఆ ఓపిక తగ్గిపోతోంది. అసహనం పెరిగిపోతోంది అంటుంది తులసి. దీంతో తప్పు నీది కాదమ్మా. నీ చుట్టూ ఉన్న పరిస్థితులది అంటాడు పరందామయ్య. ఆవేశం తగ్గించుకొని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు కదా. నందు గురించి ఇంకోసారి ఆలోచిస్తావా అంటే ఆలోచించడానికి ఏం లేదు అత్తయ్య. ఆ సమాధానానికే కట్టుబడి ఉన్నాను కానీ.. దాన్ని ఆవేశపడకుండా చెప్పి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తోంది అంతే అంటుంది తులసి. ఇంతలో దివ్య ఫోన్ చేస్తుంది తులసికి. తులసి మనసు మార్చుకుందేమో అని ఆశపడ్డాను అని ఇంతలో అనసూయ.. పరందామయ్యతో అంటుంది. దీంతో అది జరిగే పని కాదు అనసూయ అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi 4 Dec Today Episode : నువ్వు అమ్మమ్మవు కాబోతున్నావు అని తులసికి చెప్పిన దివ్య

ఇంతలో దివ్య ఫోన్ ఎత్తుతుంది తులసి. చెప్పమ్మా అంటుంది. దీంతో ఏంటి వాయిస్ ఇలా ఉంది. మళ్లీ ఇంట్లో ఏమైనా గొడవ అయిందా అంటే.. ఈ ఇంటి గొడవల గురించి నువ్వు ఆలోచించకు అంటుంది తులసి. ఫోన్ లో కూడా గొడవల గురించి ఎందుకు.. కాసేపు సరదాగా మాట్లాడు. నా మనసు తేలిపోతుంది అంటే.. నువ్వు గాలిలో తేలిపోయే విషయం కూడా చెబుతాను రెడీగా ఉండు అంటే ఏంటి ఊరిస్తున్నావు అని అంటుంది తులసి. కొన్ని వార్తలు ఊరిస్తేనే బాగుంటుంది అంటుంది అంటుంది దివ్య. దీంతో ఈ అమ్మను ఊరించకుండా అసలు విషయం ఏంటో చెప్పవా అంటుంది తులసి. దీంతో సరే అయితే వినండి అమ్మమ్మ గారు అంటుంది దివ్య. దీంతో ఏమన్నావు అంటుంది తులసి. వినండి అమ్మమ్మ గారు అన్నాను అంటుంది దివ్య. అంటే నువ్వు అంటే అవును.. మీ అల్లుడిగారిని నాన్నను చేయబోతున్నాను అంటుంది. నిన్ను అమ్మమ్మను చేయబోతున్నాను అంటుంది దివ్య. మనసు తేలికపడిందా అంటే.. కాదు నువ్వు అన్నట్టుగానే గాలిలో ఎగురుతోంది అంటుంది తులసి. ఎంత మంచి వార్త చెప్పావు దివ్య. కంగ్రాట్స్ అంటుంది తులసి. థాంక్యూ ఈ శుభవార్త నా తరుపున అందరికీ చెప్పు అని ఫోన్ పెట్టేస్తుంది దివ్య.

దీంతో అత్తయ్య, మామయ్య శుభవార్త. దివ్య కాల్ చేసింది అంటుంది తులసి. తల్లి కాబోతోందట అంటే సంతోషం తులసి అంటుంది అనసూయ. ఇప్పటి వరకు నువ్వు నానమ్మవే. ఇప్పుడు అమ్మమ్మవు కాబోతున్నావు అంటాడు పరందామయ్య. ఈ ఇంటి ఆడబిడ్డ కడుపుతో ఉందని తెలిస్తే సారె పెట్టడం మన సాంప్రదాయం అంటుంది అనసూయ. దీంతో సరే.. ఒక మంచి రోజు చూసుకొని దివ్యను ఇంటికి పిలుద్దాం అంటే.. అక్కడికే వెళ్లి పెట్టాలి అంటుంది. తులసి ఒక్కతే వెళ్లకూడదు అంటుంది అనసూయ. నీతో పాటు వాడు నందు కూడా ఉండాలి అంటుంది అనసూయ. దీంతో సారె ఇవ్వడం ఆడవాళ్ల పనే కదా అంటుంది తులసి. దీంతో నాన్న రాలేదని దివ్య కూడా బాధపడుతుంది అంటుంది అనసూయ.

ఇంతలో నందు వస్తాడు. దివ్య కాల్ చేసింది. దివ్య తల్లి కాబోతోందట అంటారు అనసూయ, పరందామయ్య. అయినా కూడా నందు ఏం మాట్లాడడు. దీంతో ఏంట్రా అంత శుభవార్త చెబితే కూడా ఏం మాట్లాడటం లేదు అంటే.. నేను ఈ విషయంలో ఏం మాట్లాడగలను. చెప్పే వాళ్లు చెబితే కదా అంటాడు నందు.

మరోవైపు రాజ్యలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో జాను వస్తుంది. నువ్వు నానమ్మవు కాబోతున్నావు కదా అంటే.. నాకు సంతోషంగా లేదు అంటుంది రాజ్యలక్ష్మి. నువ్వు మారాలి అత్తయ్య అంటుంది జాను. దీంతో ఎందుకు మారాలి అంటుంది రాజ్యలక్ష్మి.

మనిషి మారారు.. పశ్చాత్తాప పడటం అంటే ఇదేనా అంటుంది తులసి. నేను నిన్ను ఎప్పుడూ తప్పు పట్టలేదు కానీ.. నువ్వు అడిగి ఉంటే ఒప్పుకునే వాడేమో అని అన్నాను అంటుంది అనసూయ. దీంతో నాకు ఉంది ఒకే మనసు, ఒకే అంతరాత్మ అంటుంది తులసి. మారిన మనిషిని గుర్తిస్తే కొత్త జీవితం ప్రారంభిస్తాడు అంటుంది అనసూయ.

మరోవైపు తులసి.. దివ్య ఇంటికి వెళ్లి తనకు సారె పెడుతుంది. నీ వియ్యంకుడు మందు తాగి ఇంటికి వచ్చేలా చేశాను అని రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి చెబుతుంది లాస్య. దీంతో నందు ఫుల్లుగా మందు తాగి అక్కడికి వెళ్తాడు. ఈ పచ్చి తాగుబోతును ఎలా ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటాడు బసవయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

14 minutes ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

1 hour ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

2 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

3 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

4 hours ago

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…

5 hours ago

Viral Video : రాజన్న సిరిసిల్ల లో అరుదైన దృశ్యం.. శివలింగం ఆకారంలో చీమల పుట్ట..!

Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…

6 hours ago

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌‌ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…

7 hours ago