Home » Exclusive » It Is Challenging To Congress To Rule In Telangana
Exclusive

Telangana Congress : గెలిచామని సంబురాలు చేసుకోవడం కాదు.. ముందుంది మొసళ్ల పండుగ.. కాంగ్రెస్‌కు తెలంగాణలో పాలన కత్తి మీద సామే..!

Authored By
aruna
The Telugu News | Updated on: December 3, 2023 8:07 pm
Advertisement

Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సింగిల్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం 40 సీట్లు కూడా సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలవగా, బీఆర్ఎస్ 40 లోపే స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ 8 స్థానాలు సాధించింది. ఎంఐఎం పార్టీ ఇక ఎప్పటిలాగే 7 సీట్లు గెలుచుకుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పారు. గెలిపించి తీరారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ గెలుపు సాధించింది అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ ను వాళ్ల హామీలు గెలిపించాయా? లేక బీఆర్ఎస్ పై వ్యతిరేకత గెలిపించిందా? ఏంటి అనేది పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసలు కథ మొదలవబోతోంది అనే విషయం చాలామందికి తెలియదు. అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోంది. ఇల్లు అలకగానే పండుగ కాదు.. ముందుంది మొసళ్ల పండుగ అన్నట్టుగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ గెలవడం పక్కన పెడితే..

Advertisement

రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తుంది అనేదే ఇప్పుడు పెద్ద చాలెంజింగ్ గా మారింది. ఎందుకంటే.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. చాలా సంక్షేమ పథకాలను ప్రారంభించింది. వాటిని కంటిన్యూ చేస్తోంది కూడా. అందులో రైతు బంధు, రుణ మాఫీ, దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలు ఉన్నాయి. నిజానికి రైతు బంధు మొన్న నవంబర్ 28నే విడుదల కావాలి కానీ.. ఎన్నికల కోడ్ వల్ల విడుదల కాలేదు. రుణ మాఫీ కూడా ఎన్నికల కోడ్ వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముందు చేయాల్సిన పని రుణ మాఫీ చేయడం. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు ప్రతి ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు డబ్బులు ఇవ్వడం. బీఆర్ఎస్ ప్రారంభించిన పథకాలు అన్నింటికీ నిధులు విడుదల చేయాలంటే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వేల కోట్లు కావాలి. ఇప్పుడు చూస్తే ప్రభుత్వ ఖజానాలో రూపాయి కూడా లేదు. అప్పులు కూడా కుప్పలుగా పడి ఉన్నాయి. రైతు రుణ మాఫీ కోసం నిధులు లేకనే బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలోనే ఆపేసింది. ఇంతలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. మరి.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీటన్నింటినీ ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది తెలియదు.

Telangana Congress : 6 గ్యారెంటీ హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకున్నా కాంగ్రెస్ కు దబిడి దిబిడే

తెలంగాణలో రెండు సార్లు అధికారం ఇచ్చాం బీఆర్ఎస్ కు. ఈ సారి ఒక్కసారి కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తాం. వాళ్లు ఏం చేస్తారో చూస్తాం.. అని మాత్రమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఒక చాన్స్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ కు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆచీతూచీ పాలన చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రకటించిన హామీలను కూడా అమలు చేయాలి. ముఖ్యంగా 6 గ్యారెంటీ హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అవి ఖచ్చితంగా కాంగ్రెస్ అమలు చేయాల్సిందే. మరి.. ఆ పథకాలను అమలు చేయాలంటే వేల కోట్ల నిధులు కావాలి. ఉన్నపళంగా అన్ని వేల కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది.. అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి