Home » News » Karthika Deepam 2 February 17th 2026 Episode Tuesday Highlights
News

Karthika Deepam 2 February 17th 2026 Episode: కార్తీక్‌కి నిజం చెప్పిన దాసు.. దీపను చంపేందుకు జ్యోత్స్న ప్లాన్.. శ్రీధర్ వార్నింగ్..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 17, 2026, 8:30 am
Advertisement

Karthika Deepam 2 February 17th 2026 Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠగా సాగుతోంది. ఫిబ్రవరి 17వ తేదీన ప్రసారమైన 596వ ఎపిసోడ్ లో హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యంగా దాసు, కార్తీక్ మధ్య జరిగిన సంభాషణ కథను మలుపు తిప్పింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Advertisement

Karthika Deepam 2 February 17th 2026 Episode: కార్తీక్‌కి నిజం చెప్పిన దాసు.. దీపను చంపేందుకు జ్యోత్స్న ప్లాన్.. శ్రీధర్ వార్నింగ్..!

Karthika Deepam 2 February 17th 2026 Episode : దీపకు శ్రీధర్ వార్నింగ్.. అత్త ప్రాణం నీ చేతుల్లోనే!

ఎపిసోడ్ ప్రారంభంలో శ్రీధర్, దీపతో సీరియస్ గా మాట్లాడతాడు. “నీ విషయంలో మా అమ్మ (కాంచన) గురించి కార్తీక్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడు? ఏదో పెద్ద సమస్యే ఉంది” అని శ్రీధర్ అనుమానం వ్యక్తం చేస్తాడు. అయితే దీప మాత్రం ఏమీ లేదని దాచేస్తుంది. దీనిపై స్పందించిన శ్రీధర్.. “కాంచన చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకుంది. తన ఆరోగ్యం బాగోలేదు. నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా జరిగితే అది కాంచన ప్రాణానికే ముప్పు. కార్తీక్ లాంటి భర్తను ఇచ్చిన అత్తకు నువ్వు ఆ బిడ్డను క్షేమంగా ఇస్తే రుణం తీర్చుకున్నట్లే. పొరపాటున బిడ్డకు ఏమైనా అయితే అత్తను నువ్వే చంపినట్లు” అని దీపను హెచ్చరిస్తాడు.

Advertisement

Karthika Deepam 2 February 17th 2026 Episode : కార్తీక్ కు షాకింగ్ నిజం చెప్పిన దాసు

మరోవైపు దాసు, కార్తీక్ దగ్గరకు ఆవేశంగా వస్తాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు మామయ్య అని కార్తీక్ అడగగా.. “నన్ను కిడ్నాప్ చేయించింది నా కూతురే అల్లుడు” అని బాంబ్ పేలుస్తాడు. అది విని కార్తీక్ షాక్ అవుతాడు. “జ్యోత్స్ననే రౌడీలతో నన్ను కిడ్నాప్ చేయించింది. అంతేకాదు, కడుపుతో ఉన్న దీపను చంపడానికి కూడా జ్యోత్స్ననే ప్లాన్ చేసింది. రౌడీలను పంపించింది తనే” అని దాసు అసలు నిజాన్ని కార్తీక్ ముందు ఉంచుతాడు. జ్యోత్స్న నా కూతురు అనే నిజాన్ని అందరికీ చెప్పేస్తానని దాసు ఆవేశపడతాడు. కానీ, అత్త ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడు ఈ విషయం బయటపెట్టొద్దని కార్తీక్ అతన్ని ఆపుతాడు.

జ్యోత్స్న అబద్ధం.. దశరథ అనుమానం

ఇంటికి వచ్చిన జ్యోత్స్న, తాను డాక్టర్ హారికను కలిసిన విషయం ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేయాలని చూస్తుంది. కానీ దశరథ ఆమెను నిలదీస్తాడు. ఎందుకు హాస్పిటల్ కు వెళ్లావని అడగగా.. ఆపరేషన్ డేట్ గురించి అడగడానికి వెళ్లానని జ్యోత్స్న అబద్ధం చెబుతుంది. అయితే దశరథకు అనుమానం వచ్చి, ఇప్పుడే డాక్టర్ కు కాల్ చేస్తానని అంటాడు. దీంతో జ్యోత్స్న, పారిజాతం కంగారుపడతారు. శివనారాయణ కల్పించుకుని జ్యోత్స్నకు సపోర్ట్ చేయడంతో ఆ గొడవ సద్దుమణుగుతుంది.

Advertisement

డాక్టర్ హారికను ఇరికించిన దశరథ

జ్యోత్స్న మాటలపై నమ్మకం కుదరని దశరథ, నేరుగా డాక్టర్ హారిక దగ్గరకు వెళ్తాడు. “నాకు జ్యోత్స్న మెడికల్ రిపోర్ట్స్ కావాలి. శాంపిల్స్ మ్యాచ్ అయినవి, కానివి రెండూ ఇవ్వండి. నేను సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను” అని గట్టిగా అడుగుతాడు. దీంతో డాక్టర్ హారిక భయపడుతుంది. ఆపరేషన్ ఉందని సాకు చెప్పి, రిపోర్ట్స్ మెయిల్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది.

మొత్తానికి జ్యోత్స్న పాపాలు ఒక్కొక్కటిగా కార్తీక్ కు తెలుస్తున్నాయి. మరి దశరథకు డాక్టర్ రిపోర్ట్స్ అందితే జ్యోత్స్న, పారిజాతం పరిస్థితి ఏంటి? అనేది తర్వాతి ఎపిసోడ్ లో చూడాలి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి