Home » News » Karthika Deepam 2 Serial Today Episode 602 February 24th 2026 Tuesday
News

Karthika Deepam 2 Today Episode Feb 24th 2026 : జ్యోత్స్న కన్నకూతురు కాదన్న దాసు.. కాంచనకు నిజం చెప్పేసిన దశరథ!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 24, 2026, 8:30 am
Advertisement

Karthika Deepam 2 Today Episode Feb 24th 2026 స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ రోజుకో సరికొత్త మలుపుతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈరోజు ఫిబ్రవరి 24, 2026 మంగళవారం ప్రసారం కానున్న 602వ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఒకవైపు కడుపులో ఉన్న బిడ్డను వదులుకోవాల్సి వస్తుందని దీప, కార్తీక్ కన్నీరుమున్నీరు కావడం.. మరోవైపు జ్యోత్స్న, పారిజాతాలకు దాసు ఊహించని షాక్ ఇవ్వడం.. ఇక చివరికి కాంచనకు దశరథ అసలు నిజం చెప్పేయడం ఈ ఎపిసోడ్ లో హైలైట్‌గా నిలిచాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Advertisement

Karthika Deepam 2 Today Episode Feb 24th 2026 : జ్యోత్స్న కన్నకూతురు కాదన్న దాసు.. కాంచనకు నిజం చెప్పేసిన దశరథ!

Karthika Deepam 2 Today Episode Feb 24th 2026 కన్నీరుమున్నీరైన దీప – కార్తీక్ ఎమోషనల్

అమ్మ బతకాలి.. అత్తయ్య, మావయ్యలు నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. వారి కోసం మన బిడ్డను త్యాగం చేస్తున్నామన్న నిజం ఎప్పటికీ బయటకు తెలియకూడదని కార్తీక్ తో దీప చెబుతూ ఏడుస్తుంది. ఆపరేషన్ సమయంలో తన గుండె రాయిలా మారిపోవాలని దేవుడిని కోరుకున్నట్లు దీప అంటుంది. ఇదంతా వింటున్న కార్తీక్ తీవ్ర భావోద్వేగానికి లోనవుతాడు. గుడి గంటల్లో, దీపాల వెలుగులో నా బిడ్డ ప్రాణాలు వదులుతున్న దృశ్యమే కనిపిస్తుందంటూ కార్తీక్ కంటతడి పెట్టుకుంటాడు. నీకు నేను ఏ ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను, నన్ను క్షమించు బావ అని దీప ఏడుస్తుంటే.. ఇకపై నీ భారాన్నంతా నేనే మోస్తానని కార్తీక్ ఆమెకు ధైర్యం చెబుతాడు.

Advertisement

Karthika Deepam 2 Today Episode Feb 24th 2026 జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన దాసు.. నువ్వు నా కూతురివి కాదు

మరోవైపు ఇంట్లో దాసు కోసం పారిజాతం, జ్యోత్స్న తీవ్ర టెన్షన్ పడుతుంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన దాసుపై జ్యోత్స్న ఎప్పటిలాగే దొంగ ప్రేమ ఒలకబోస్తూ నాన్న ఎక్కడికి వెళ్లావ్ అని డ్రామా స్టార్ట్ చేస్తుంది. దానికి దాసు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తాడు. నన్ను నాన్న అని పిలవద్దు.. చిన్నాన్న అని పిలవాలని బాంబ్ పేలుస్తాడు. దశరథ కూతురివే అని రిపోర్ట్స్ లో ఉంది కదా అని పారిజాతం బుకాయించే ప్రయత్నం చేస్తుంది. ఆ రిపోర్ట్స్ ఫేక్ అని నాకు తెలుసు.. నన్ను కిడ్నాప్ చేసి దాచిపెట్టాల్సిన అవసరం నీకు ఇక లేదు. ఇప్పటివరకు నాకే తెలియని నిజం ఏమిటంటే.. ‘నువ్వు నా కూతురివి కాదు’ అని దాసు తేల్చి చెప్పేస్తాడు. ఇకపై నీకు ఎలాంటి భయాలు అవసరం లేదని, కన్నతల్లిని జాగ్రత్తగా చూసుకోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాసు. ఈ కురుక్షేత్రాన్ని నడిపించేది తన అల్లుడు కార్తీక్ మాత్రమే అని దాసు మనసులో అనుకుంటాడు.

దీప నిజం జ్యోత్స్నకు తెలిసిపోయిందా?

దశరథ ప్రవర్తన, గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఆయన చేస్తున్న హడావిడి చూసి జ్యోత్స్నకు అనుమానం మొదలవుతుంది. ఈ విషయాన్నే పారిజాతం దగ్గర ప్రస్తావిస్తుంది. దీప ఎవరి కూతురో నీకు తెలుసా? మా డాడీ ఆమెకు ఎందుకు అంత మర్యాదలు చేస్తున్నాడో తెలుసా? అని జ్యోత్స్న అడుగుతుంది. దీప దశరథ సొంత కూతురేమో అని జ్యోత్స్న అనుమానిస్తుంది. కానీ పారిజాతం మాత్రం అది నమ్మదు. దీపలో తన లక్షణాలు లేవని, అయినా దశరథ ప్రవర్తనలో ఏదో కొత్త మార్పు కనిపిస్తోందని పారిజాతం కూడా ఆలోచనలో పడుతుంది.

Advertisement

కాంచన ముందు అసలు నిజం బయటపెట్టిన దశరథ

దీప, కార్తీక్ ల కోసం కాంచన కంగారు పడుతుంటుంది. అప్పటికే ఆమె ఎడమ కన్ను అదురుతుండటంతో అనసూయ, శివనారాయణ అది శుభసూచకం అని చెబుతారు. ఇంతలో దీప, కార్తీక్ లను తీసుకుని దశరథ ఇంట్లోకి అడుగుపెడతాడు. శివనారాయణ.. దశరథను చూసి “గుడిలో ఏం జరిగింది? నీ ఆనందానికి కారణం ఏంటి?” అని ప్రశ్నిస్తాడు. దానికి దశరథ బదులిస్తూ.. “అమ్మ చనిపోయే ముందు మన పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాక కూడా కలిసి ఉండాలని మాట తీసుకుంది. అందుకే నీకు అందుబాటులో ఉండేలా శ్రీధర్ బావతో పెళ్లి జరిపించింది. నీ కూతురిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నావు కదా” అని కాంచనతో అంటాడు.

దశరథ ఆనందం పట్టలేక కాంచనతో ఇలా అంటాడు.. “ఆ మాట మట్టిలో కలిసిపోలేదమ్మా.. ఆ మాట నిజమైంది. నీ కోరిక తీరింది. నువ్వు కోరుకున్నట్లు నా కన్నకూతురే నీ ఇంటి కోడలైంది” అని అసలు నిజం చెప్పేస్తాడు. ఇదంతా వింటున్న దీప, కార్తీక్ లు షాక్ అవుతారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన జ్యోత్స్న.. “ఏంటి డాడీ.. నీ కూతురు ఈ ఇంటి కోడలు అయిందా?” అని ప్రశ్నిస్తుంది. జ్యోత్స్నను చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

దీంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ (Karthika Deepam 2 Today Episode) ముగుస్తుంది. దశరథ మాటలకు జ్యోత్స్న ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది? దీపనే తన కన్నకూతురు అని దశరథ అందరి ముందు ప్రకటిస్తాడా? తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి