
jonathan the oldest tortoise living animal on earth jonathan turns 190 years
Viral Turtle : తాబేళ్లు సాధారణంగా వందేళ్లకు పైగా జీవించగలవు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల తాబేళ్లు ఉన్నాయి. తాబేళ్లు సరిసృపాల కిందికి వస్తాయి. తాబేళ్ల శరీరాకృతి ప్రత్యేకంగా నిర్మితమై ఉంటుంది. నాలుగు కాళ్లు, పొడవాటా తల కలిగి ఉంటుంది. ప్రమాదాలనుంచి తనను తాను కాపాడుకోవటానికి అవయవాలన్నింటనీ ఒక్కసారిగా లోపల దాచుకుంటుంది. పైన ఉన్న చిప్ప వంటి ఆకారం షెల్ అత్యంత దృడంగా నిర్మితమై ఉండటంతో శత్రువల దాడి నుంచి కాపాడుకోగలుగుతుంది.కాగా కొన్ని రకాల తాబేళ్లు 200 సంవత్సరాలకు పైగా బతుకుతాయిని చెబుతున్నారు. జంతువుల అన్నింటిలో తాబేలు ఎక్కువ కాలం జీవించగలవని నిరూపతమైంది.
ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతనమైన తాబేలు వయసు 190 ఏళ్లు. జోనాథన్ గా పిలవబడే ఈ తాబేలు ఈ ఏడాది 190 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ తాబేలు నేలపై అత్యధిక కాలం జీవించి ఉన్న జీవిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.ఈ తాబేలు అల్డబ్రా జాతికి చెందనది. అట్లాంటిక్ మహా సముద్రంలోని హెలెనా ద్వాపంలో ఈ తాబేలు ఉంది. 1832లో మొట్టమొదటిసారిగా ఈ జోనాథన్ తాబేలును గుర్తించారు. అక్కడి నుంచి ఈ తాబేలును 1882లో బ్రిటిష్ విదేశీ భూభాగమైనా సెయింట్ హెలెనా దీవికి తీసుకొచ్చారు. ఇక్కడే దీనికి జోనాథన్ గా నామకరణం చేశారు.
jonathan the oldest tortoise living animal on earth jonathan turns 190 years
సాధారణంగా ఈ జాతికి చెందిన తాబేళ్లు 150 సంవత్సరాలు జీవిస్తాయి. జోనాథన్ తాబేలు ప్రస్తుతం 190 లో అడుగుపెట్టడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సెయింట్ హెలెనా ద్వీపంలో వైద్యులు, జంతు సంరక్షకుల పర్యవేక్షణలో ఉంది. క్యాబేజీ, దోసకాయ, క్యారెట్, ఆపిల్ మరియు ఇతర కాలానుగుణ పండ్లను ఇష్టంగా తింటుంది. ఇక వృద్ధాప్యంలో వచ్చే అన్ని సమస్యలు జోనాథన్ ను చుట్టుముట్టాయని అయినా జీవిస్తుండటంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది. ప్రస్తుతం జోనాథన్ ఫొటోలు వైరల్ గా మారాయి. గతంలో టుయ మలీలా తాబేలు 189 సంవత్సరాల రికార్డును జోనాథన్ తాబేలు బ్రేక్ చేసి రికార్డు సృష్టించింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.