
A child who put a rod at the feet of a soldier video
Viral Video: ఒక దేశానికి రైతు, సైనికుడు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.. భారత రక్షణ వ్యవస్థలో ఒకటైన ఇండియన్ ఆర్మీ దేశ భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షింస్తుంది. ఇక మనదేశంలో ఆర్మీలో పనిచేయడానికి యువత ఎంతో ఆసక్తితో ఉంది. ఎంతోమంది ఆర్మీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. ఎంతో మంది ఇప్పటికే దేశ రక్షణలో భాగమై తమ వ్యక్తిగత లైఫ్ ని త్యాంగం చేస్తున్నారు. దేశాన్ని రక్షించే క్రమంలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి దేశ సేవ చేస్తున్నారు.
అలాగే మన దేశంలో సైనికులను ఎంతో గౌరవిస్తారు. వాళ్లని ప్రత్యేకంగా చూస్తారు. ఎలాంటి వాతావరణంలోనైనా దేశ రక్షణకు కట్టుబడి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పోరాడుతుంటారు. దేశంలో మనంతా ధైర్యంగా, స్వేచ్ఛగా జీవించగలగుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను కంటికి రెప్పలా కాపాడుతోన్న భారత సైనికులు, వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మంచు కొండల్లో, గడ్డ కట్టే చలి, ఏడారులు, లోయల్లో నిద్రాహారాలు మానుకుని భద్రత కల్పిస్తున్న మన సైనికులు, మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే గర్వంగా సెల్యూట్ చేయకుండా ఎవరూ ఉండలేరు.
A child who put a rod at the feet of a soldier video
తాజాగా ఓ చిన్నారి సైనికులకు పాదాభివందనం చేసి దేశభక్తని చాటుకుంది. తాజాగా చిన్నారి తన తండ్రి దేశ రక్షణ కోసం బయలుదేరి వెళ్తుండగా ఓ రైల్వే స్టేషన్ వరకు వచ్చి సెండాఫ్ ఇచ్చింది. అంతే కాకుండా అతడి కాళ్లకి తన చిట్టి చేతులతో మొక్కింది. దేశ సైనికులను చూస్తే వయసుతో సంబంధం లేకుండా గౌరవిస్తారని.. నిరూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి దేశ భక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
This website uses cookies.