Viral Video : చిన్నారి దేశ‌భ‌క్తికి అంద‌రూ ఫిదా.. సైనికుడి కాళ్ల‌కు దండం పెట్టి..

Authored By mallesh | The Telugu News | Updated on : 19 July 2022, 7:40 am

Viral Video: ఒక దేశానికి రైతు, సైనికుడు ఎంత ముఖ్య‌మో అంద‌రికీ తెలిసిందే.. భారత రక్షణ వ్యవస్థలో ఒక‌టైన ఇండియన్ ఆర్మీ దేశ భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షింస్తుంది. ఇక మ‌న‌దేశంలో ఆర్మీలో ప‌నిచేయ‌డానికి యువ‌త ఎంతో ఆస‌క్తితో ఉంది. ఎంతోమంది ఆర్మీలో చేర‌డానికి సిద్దంగా ఉన్నారు. ఎంతో మంది ఇప్ప‌టికే దేశ ర‌క్ష‌ణ‌లో భాగమై త‌మ వ్య‌క్తిగ‌త లైఫ్ ని త్యాంగం చేస్తున్నారు. దేశాన్ని ర‌క్షించే క్ర‌మంలో ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. దేశం కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి దేశ సేవ చేస్తున్నారు.

అలాగే మ‌న దేశంలో సైనికుల‌ను ఎంతో గౌర‌విస్తారు. వాళ్ల‌ని ప్ర‌త్యేకంగా చూస్తారు. ఎలాంటి వాతావ‌ర‌ణంలోనైనా దేశ ర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా పోరాడుతుంటారు. దేశంలో మనంతా ధైర్యంగా, స్వేచ్ఛగా జీవించగలగుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను కంటికి రెప్పలా కాపాడుతోన్న భారత సైనికులు, వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మంచు కొండల్లో, గడ్డ కట్టే చలి, ఏడారులు, లోయల్లో నిద్రాహారాలు మానుకుని భద్రత కల్పిస్తున్న మన సైనికులు, మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే గర్వంగా సెల్యూట్ చేయకుండా ఎవ‌రూ ఉండలేరు.

A child who put a rod at the feet of a soldier video

A child who put a rod at the feet of a soldier video

తాజాగా ఓ చిన్నారి సైనికుల‌కు పాదాభివంద‌నం చేసి దేశ‌భ‌క్త‌ని చాటుకుంది. తాజాగా చిన్నారి త‌న‌ తండ్రి దేశ ర‌క్ష‌ణ కోసం బయలుదేరి వెళ్తుండగా ఓ రైల్వే స్టేషన్ వ‌ర‌కు వ‌చ్చి సెండాఫ్ ఇచ్చింది. అంతే కాకుండా అత‌డి కాళ్ల‌కి త‌న చిట్టి చేతుల‌తో మొక్కింది. దేశ సైనికుల‌ను చూస్తే వ‌య‌సుతో సంబంధం లేకుండా గౌర‌విస్తార‌ని.. నిరూపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చిన్నారి దేశ భ‌క్తికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి