auto carries 27 passengers in uttar pradesh video viral
Viral Video : సాధారణంగా ఒక చిన్న ఆటోలో ఎంత మంది కూర్చొంటారు చెప్పండి. మా అంటే ముగ్గురు కూర్చొంటారు అంతే. అంతకుమించి ఓ నలుగురు అంతే కదా. ఓ 10 మంది కూర్చోవడానికి అయితే వీలు పడదు. 7 సీటర్ ఆటోలో అయితే ఓ 10 మంది వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ.. ఈ చిన్న ఆటోలో ఎంతమంది కూర్చున్నారో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఒకే ఆటోలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆటో ఆపారు. ఆటో ఆపి.. ఒక్కొక్కరిని కిందికి దింపి..
ఎంత మంది ఆటోలో ప్రయాణించారో తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ లో చోటు చేసుకుంది. ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న ఆటోను పోలీసులు ఆపారు.అందులో నుంచి దిగిన ప్రయాణికులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతమంది ఆ ఆటోలో ఎలా పట్టారా అని షాక్ అయ్యారు. వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు అని.. డ్రైవర్, పిల్లలతో సహా.. మొత్తం 27 మంది ప్రయాణికులు అందులో ప్రయాణించారు. ఈద్ సందర్భంగా దర్గాలో నమాజ్ చేసిన అనంతరం వాళ్లు తిరుగు ప్రయాణం అవగా..
auto carries 27 passengers in uttar pradesh video viral
ఆటోను పోలీసులు ఆపారు. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక్కొక్కరిని దింపి అందులో ఉన్న ప్రయాణికులను లెక్కిస్తే 27 మంది అయ్యారు. దీంతో ఆటోకు ఓవర్ స్పీడింగ్ తో పాటు.. ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు ఫైన్ వేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి.. వామ్మో అంత చిన్న ఆటోలో 27 మందిని ఎలా కూర్చోబెట్టావురా బాబు..అంటూ ఆ ఆటో డ్రైవర్ గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
This website uses cookies.