Viral Video : తల్లిదండ్రులకు వారి పిల్లలే నిజమైన సంపద. కని పెంచి పెద్ద చేసిన పిల్లలు ముసలితనాన వాళ్లకు ఆసరా ఇవ్వాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ప్రస్తుతం అలాంటి బిడ్డలు కనిపించడం చాలా అరుదైపోయిందని చెప్పవచ్చు. బిజీ లైఫ్ కారణం లేదా మరి ఏదైనా కారణం చేతనో ఇప్పటి యువత తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద ప్రేమను చాటుకునే బిడ్డలను చూస్తే మురిసిపోవాల్సిందే. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో తల్లిదండ్రులు తమ బిడ్డతో కలిసి ఫ్లై ఓవర్ మీద సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నారు.
అయితే ఫ్లై ఓవర్ మీద మొదట్లో ఎక్కేటప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం చాలా కష్టం. దీంతో ఆ వ్యక్తి తన భార్యను బిడ్డను ఎక్కించుకొని ఫ్లై ఓవర్ మీద ఎక్కడానికి చాలా కష్టపడ్డాడు. తండ్రి అవస్థను గమనించిన ఆ పిల్లాడు సైకిల్ మీద నుంచి దిగి సైకిల్ను వెనక నుండి తోయడం ప్రారంభించాడు. ఆ పిల్లాడికి నిండా పదేళ్లు కూడా లేవు కానీ తన తల్లిదండ్రులు సైకిల్ మీద కూర్చుంటే వెనకనుంచి తోసాడు. ఈ క్రమంలోనే వెనకనుంచి ఒక కారులో వస్తున్న వ్యక్తి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త ఇలా వైరల్ గా మారింది.
తండ్రి కోసం ఆ పిల్లాడు పడుతున్న శ్రమ చూసి అందరికీ ముచ్చటేస్తుంది. తల్లిదండ్రుల కోసం పరితపిస్తున్న ఆ చిన్నపిల్లాడిని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చివరి వరకు మీ తల్లిదండ్రులను ఇలానే చూసుకోవాలి అని కొందరు, నీలాంటి సంతానానికి మించి ఏ తండ్రి కోరుకునేది ఏముంది అని మరి కొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నిండా పదేళ్లు కూడా లేని పిల్లాడు తన తల్లిదండ్రుల కోసం ఎంతలా తప్పిస్తున్నాడో చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.