Home » News » Viral News A Woman Who Married Herself
News

Viral News : తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ .. పెళ్ళికి ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే నోరెళ్ళబెడతారు..!

Authored By
aruna
The Telugu News | Published on: October 18, 2023, 11:00 am
Advertisement

Viral News : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక కీలక ఘట్టం. అయితే మనకు నచ్చిన వ్యక్తిని, అన్ని విధాల మనకు సరిపోయే వ్యక్తిని ఎంపిక చేసుకోవడం కష్టం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కొందరు. స్నేహితులను వదిలి ఉండలేక ఒకే జెండర్ ను పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లి మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ఓ మహిళ తనను తానే పెళ్లి చేసుకుంది. తనకు సరైన జోడి కోసం 20 ఏళ్లు ఎదురు చూసింది. అయితే చివరకు 42 ఏళ్ల వయసులో తనను తానే పెళ్లి చేసుకుంది. తన పెళ్లి కోసం ఏకంగా 10 లక్షలు ఖర్చు పెట్టింది. ఈ వింత ఘటనా లండన్లో జరిగింది.

Advertisement

లండన్ కి చెందిన సారా అనే మహిళ క్రెడిట్ కంట్రోల్ గా పని చేస్తున్నారు. ప్రస్తుత ఆమె వయసు 42 సంవత్సరాలు. అందరూ యువతులు లాగానే ఆమె కూడా తనకు సరైన జోడి కోసం ఎదురు చూసింది. తన పెళ్లికి తానే డబ్బులు పొదుపు చేసుకుంది. 20 ఏళ్ల నుంచి డబ్బులు పొదుపు చేస్తూ వచ్చింది. ఇలా 20 ఏళ్లుగా సరైన జోడి కోసం ఎదురుచూసింది. కానీ ఎవరు చిక్కలేదు. దీంతో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. తన పెళ్లి ని మిస్ అవుతానని భావించిన సారా చివరికి తనను తానే గ్రాండ్గా పెళ్లి చేసుకుంది. అందుకోసం నిశ్చితార్థపు ఉంగరాన్ని కూడా కొనుగోలు చేసింది. ఆమె స్నేహితులు, బంధువుల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేసుకుంది.

Viral News A woman who married herself

Advertisement

దాదాపుగా తన పెళ్లికి పది లక్షల వరకు ఖర్చు చేసింది. వివాహం అనంతరం సారా మీడియాతో ముచ్చటించింది. తన పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈరోజు నా పెళ్లి రోజు అయింది. నా పక్కన భాగస్వామి లేకపోయినా నేను పెళ్లి నీ మిస్ కావద్దు అనుకున్నా. అందుకే నా పెళ్లి కోసం ఆదా చేసిన డబ్బులను పెళ్లికి ఖర్చు చేయాలని అనుకున్నా. ఈ విషయాన్ని బంధువులకు చెప్పాను కానీ వాళ్లంతా ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత అందరూ విష్ చేశారని నేను చాలా సంతోషంగా ఉన్నాను అని తెలిపింది. అయితే ఈ పెళ్లికి సారా 14 ప్రమాణాలను తీసుకున్నారని చెప్పింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి