Home » Exclusive » Bride Dance Video For Youtube
Exclusive

Viral Video : హైవోల్టెజ్ పవర్‌తో నాటు బీట్స్ వేసిన పెళ్లి కూతురు.. వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: October 29, 2022, 2:00 pm
Advertisement

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని జనాలు ఏది కొత్తగా వచ్చిన దానికి అప్డేట్ అవుతున్నారు. అప్పట్లో డబ్ స్మాష్‌లో డబ్బింగ్ వీడియాలు రాగా కొంతకాలం యువత, కిడ్స్, ఆంటీస్ కూడా దానిని అనుకరించారు. ఆ తర్వాత టిక్‌టాక్ ఇంకొన్ని రోజులు ఊరించింది. దానికి కూడా యువత అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ ఒకటి పోతే ఇంకొకటి వస్తూనే ఉంది. దానిని జనాలు ఆదరిస్తున్నారు. సాధారణంగా పెళ్లి జరిగే సమయంలో పెళ్లికూతురుని వారి మేనమామ లేదా బంధువులు పీటల మీదకు తీసుకొస్తారు.

Advertisement

అబ్బాయి మాత్రం ఒక్కడే వచ్చి కూర్చుంటాడు. ఒకప్పుడు పెళ్లికూతురిని డోలిలో లేదా బుట్టలో ఉంచి మండపానికి తీసుకొని వచ్చేవారు. ప్రస్తుతం సోషల్ యుగం నడుస్తుందని గనుక ఒకరిని చూసి మరొకరు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రౌటీన్‌కు భిన్నంగా అమ్మాయి మండపానికి డ్యాన్స్ చేస్తూ వచ్చిన వీడియో సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ప్రధాన న్యూస్ మీడియా కూడా ఆ వీడియోను బాగా ఫోకస్ చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మాయి తన బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తూ మండపంలోకి వస్తున్న ఘటన ముందుగా కేరళలో వెలుగు చూసింది.

bride dance video for youtube

Advertisement

Viral Video : కేరళలో మొదలైన కల్చర్..!

ఆ తర్వాత ఇది సౌత్ ఇండియాలోని మరో రెండు రాష్ట్రాలకు పాకింది. ప్రస్తుతం ఇటువంటి సంప్రదాయాన్ని తమిళ నాడు, కేరళ, కర్ణాటకలో మాత్రం అక్కడక్కడ ఫాలో అవుతున్నారు.అది కూడా బాగా చదువుకున్న అమ్మాయి.. చదువుకున్న ఫ్యామిలీకి చెందిన వారు మాత్రమే తమ కూతురి సంతోషం కోసం ఇలా ఏదైనా చేసేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. తాజాగా ఇదే తరహాలో ఓ పెళ్లికూతురు పెళ్లి మండపానికి వచ్చే క్రమంలో ఊరమాస్ స్టెప్పులేసి పెళ్లికి విచ్చేసిన వారందరికి షాక్ ఇచ్చింది. ఇదంతా వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.వధువు ఉత్సాహాన్ని కూడా కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి