Home » News » Bride Mass Dance Video Viral 3
News

Viral Video : అందంగా స్టెప్పులేస్తూ అద‌ర‌గొట్టిన పెళ్లికూతురు.. వైర‌ల్ అవుతున్న డ్యాన్స్ వీడియో..

Authored By
mallesh
The Telugu News | Updated on: June 5, 2022 7:15 pm
Advertisement

Viral Video : ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్క‌డ చూసినా పెళ్లిలో డ్యాన్స్ వీడియోలు తెగ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. డ్యాన్స్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీయించుకుని నెట్టింట్లో అప్ లోడ్ చేయ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పెళ్లిలో బంధువులు, ఫ్రెండ్స్, కుటుంబ స‌భ్య‌ల‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. మండ‌పంలో పెళ్లి కొడుకు ఎదురుచూస్తుండ‌గా పెళ్లి కూతురు అదిరిపోయే స్టెప్పుల‌తో డ్యాన్స్ చేస్తూ మండ‌పంలోకి వ‌స్తుంది. ఇక మ్యారేజ్ త‌ర్వాత జ‌రిగే రిసెప్ష‌న్ ల‌లో కూడా గ్రూప్ గా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. అలాగే పెళ్లి కొడుకుతో క‌లిసి డ్యాన్స్ చేస్తున్నారు.

Advertisement

ట్రెండింగ్ సాంగ్స్ కి ప్ర‌త్యేకంగా డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీయించుకుంటున్నారు.చాలామంది వెడ్డింగ్ అంటే ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఫొటో షూట్స్, డ్యాన్స్ వీడియోల‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్పెష‌ల్ గా సాంగ్స్ ప్లాన్ చేసుకుని అందంగా ముస్తాబై శారీల్లో, లంగావోణీల్లో డ్యాన్స్ చేస్తూ చూపుతిప్పుకోకుండా చేస్తున్నారు. అందంగా డ్యాన్స్ చేస్తూ క్యూట్ లుక్స్ తో పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. అలాగే పెళ్లి కూతురు చుట్టూ అమ్మాయిలు, అబ్బాయిలు చేరి డ్యాన్స్ చేస్తూ మ‌రింత అందంగా పెళ్లికి వ‌చ్చిన వారంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు.

Bride Mass Dance Video Viral

Advertisement

ప్ర‌స్తుతం ఓ కేర‌ళ వెడ్డింగ్ వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. పెళ్లికూత‌రు అందంగా ముస్తాబై అదిరిపోయే స్టెప్స్ వేసింది. అల్లు అర్జున్ మూవీ అలా వైకుంఠ‌పురంలోని రాములో..రాములా సాంగ్ కి సింపుల్ గా కూల్ గా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంది. త‌న డ్యాన్స్ తో వెడ్డింగ్ రిసెప్ష‌న్ ని మ‌రింత అందంగా చేసింది. పెళ్లి కొడుకుని కూడా డ్యాన్స్ చేయ‌మ‌ని చేతిప‌ట్టుకుని తీసుకువ‌చ్చి డ్యాన్స్ చేయించింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి…

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి