Home » News » Bride Wedding Dance Video Viral On Social Media
News

Viral Video : పెళ్లి కూతురు ఓ రేంజ్ లో మాస్ డ్యాన్స్.. ఎంట్రీ అదిరిపోలా..

Authored By
mallesh
The Telugu News | Updated on: July 21, 2022 12:47 am
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియాలో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోల‌కు మంచి క్రేజ్ ఉంది. నెటిజ‌న్లు కూడా వీటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో పెళ్లి కూత‌రు ఎంట్రీ డ్యాన్స్ అంటూ త‌మిళ్, కేర‌ళ వెడ్డింగ్ వీడియోలు ఎక్కువ‌గా నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. పెళ్లి కూత‌రు ఎంట్రీ డ్యాన్స్ చేస్తుంటే వెన‌కాల ప‌ది మంది వ‌రకు అబ్బాయిలు గానీ.. అమ్మాయిలు గానీ.. డ్యాన్స్ చేస్తున్నారు.. ఈ మొత్తం సీన్ పెళ్లికే హైలైట్ అవుతుంది. అయితే చాలామంది అమ్మాయిల‌కు.. అబ్బాయిల‌కు పార్ట్ న‌ర్ తో డ్యాన్స్ చేయాల‌ని ఉంటుంది.. అయితే ఇదివ‌ర‌కు పెళ్లి త‌ర్వాత ఇద్ద‌రూ క్లోస్ అయ్యాక ఎక్కడో ఓ ఫంక్ష‌న్ లో డ్యాన్స్ చేసేవారు.

Advertisement

కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.. ఏకంగా మండపంలోనే ఇద్ద‌రూ డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. రిసెప్ష‌న్ లో.. బ‌రాత్ లో ఎక్క‌డా వ‌ద‌ల‌కుండా వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్ట‌కుంటున్నారు. ఇక అమ్మాయిలైతే మ‌రింత ఎంజాయ్ చేస్తున్నారు.. పెళ్లి కూతురు మండ‌పంలోకి వ‌స్తూనే ఎంట్రీ డ్యాన్స్ చేసి అంద‌రి చూపు త‌న వైపు తిప్పుకుంటోంది. పెళ్లికొడుకు అక్క‌డే ఇంప్రెస్ చేస్తున్నారు. పెళ్లి కొడుకు సిగ్గ‌ప‌డుతున్నా పెళ్లి కూతురు మాత్రం డ్యాన్స్ చేస్తూ స‌ర‌దాగా ఆక‌ట్టుకుంటోంది. మ్యారేజ్ అంటేనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్యాన్స్ అనేలా ట్రెండ్ సెట్ చేస్తున్నారు..

Bride Wedding Dance Video viral on Social Media

Advertisement

ఇక పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్ కి ముందుగానే ప్లాన్ చేసుకుని అద‌ర‌గొడుతున్నారు.   ప్రొఫేష‌న‌ల్ డ్యాన్సర్ లాగా ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ప్ర‌స్తుతం ఓ పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఫుల్ ఎన‌ర్జిటిక్ గా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టిప‌డేస్తోంది. పెళ్లి కూతురు వెన‌కాల అబ్బాయిలు సెప‌రేట్ డ్రెస్ కోడ్ లో డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. కాగా ఈ వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. సూప‌ర్ డ్యాన్స్ అంటూ పెళ్లి కూతురికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి