Home » News » Cat And Duck Funny Fight Viral Video
News

Viral Video : వార్నీ.. ఇది మామూలు పిల్లి కాదండోయ్.. బాతు పిల్ల వెనక చేయి పెట్టి ఏం చేసిందో చూడండి

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: December 5, 2021, 7:15 am
Advertisement

Viral Video : సాధారణంగా పిల్లులు అంటేనే చిలిపి పనులు చేస్తుంటాయి. అందుకే చాలామంది పిల్లులను పెంచుకుంటారు. వాటితో సరదాగా ఆడుకుంటారు. అయితే.. కోతి ఎన్ని చేష్టలు చేస్తుందో పిల్లి కూడా అన్ని చేష్టలు చేస్తుంది. ఇంట్లో రచ్చ రచ్చ చేస్తుంది. వస్తువులను చిందర వందర చేస్తుంది. తాజాగా ఓ పిల్లి చేసిన రచ్చ చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు.పిల్లులకు ఎప్పుడూ తమతో ఆడుకోవడానికి ఏదైనా మరో జంతువు కావాలి. అందుకే.. కుక్క, పిల్లి కలిసినా కూడా అవి చాలా సరదాగా ఆడుకుంటాయి.

Advertisement

అయితే.. కుక్కతో అల్లరి చేసి.. కుక్కను చిరాకు తెప్పించి.. కుక్కతో చివాట్లు పడటం కూడా పిల్లికి అలవాటు. వద్దన్న పని చేస్తూ పిల్లలు చేసే రచ్చ మామూలుగా ఉండదు.తాజాగా ఓ పిల్లి, బాతుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాతు పిల్ల.. దాని మానాన కుర్చీ మీద కూర్చొని ఉంది.

cat and duck funny fight Viral Video

Advertisement

Viral Video : బాతు పిల్లతో రచ్చ రచ్చ చేసిన పిల్లి

కానీ.. అప్పుడే కుర్చీ మీదికి వచ్చిన పిల్లి ఏం చేసిందో తెలుసా? బాతు పిల్లతో ఆడటం మొదలు పెట్టింది.మామూలుగా ఆడితే ఓకే కానీ.. బాతు పిల్లను తన చేయితో కొడుతూ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత బాతు పిల్ల వెనుక కూడా తన చేయితో తడిమింది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పిల్లి చేష్టలను చూసి నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. వామ్మో.. ఇదేం పిల్లిరా బాబోయ్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి