Viral Video : ప్రేమ వివాహం చేసుకున్న కూతురు... తట్టుకోలేకపోయిన తండ్రి ఇలా..!
Viral Video : తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా సరే వారిపై అంతులేని ప్రేమ ఉంటుంది అనడంతో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ కూడా వారి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా తల్లిదండ్రులు బాధపడుతూ విలవిల్లాడుతారు. నిరంతరం వారి పిల్లల భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి జీవితాలను సైతం పణంగా పెడుతూ ఉంటారు. కానీ నేటి కాలంలో అలాంటి తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోకుండా తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో నేటి యువత తప్పటడుగులు వేస్తున్నారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు అలా చేయవద్దని పిల్లల్ని మందలిస్తే తల్లిదండ్రులను కాదని ఇంటి నుండి వెళ్లిపోయి మరి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే నేటి కాలంలో ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు మనం చాలానే చూస్తున్నాం. అలాంటి ఘటనే ఇటీవల సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. కన్నవారిని కాదని తాను ప్రేమించిన వాడి కోసం తల్లిదండ్రులను వదిలేసి ఓ యువతీ ఇంట్లో నుండి వెళ్లిపోయింది. కుమార్తె చేసిన పనికి తట్టుకోలేకపోయిన తండ్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే….
ఈ అనూహ్య ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల గ్రామానికి చెందిన చిలువేరు మురళి గత కొన్నేలుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు అనూష అనే కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష ఓ యువకుడుని ప్రేమించింది. ఇక ఆ విషయం కాస్త తన తండ్రి మురళికి తెలియడంతో కూతుర్ని మందలించాడు. ఇలాంటి వయసులో ఈ పనులు సరికాదని , బుద్ధిగా చదువుకోమని అనుష కు సూచించాడు. అయితే తండ్రి మాటలను పెడ చెవిన పెట్టిన అనూష మాత్రం తన ప్రేమికుడితో తాను విడిపోతానేమో అనే భయంతో ఇంటి నుండి పారిపోయి అతని పెళ్లి చేస్తుంది.
Viral Video : ప్రేమ వివాహం చేసుకున్న కూతురు… తట్టుకోలేకపోయిన తండ్రి ఇలా..!
చిన్ననాటి నుండి గుండెల్లో పెట్టుకొని చూసుకున్న బిడ్డ గుండెలపై తన్ని వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినా తండ్రి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అంతేకాక ఇరుగుపొరుగు బంధువుల మధ్య తన పరువు పోవడంతో మరింత తల్లడిల్లాడు..ఈ క్రమంలోనే అనుష తండ్రి మురళి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కన్న బిడ్డ అనూష చనిపోయిందంటూ మురళి ఫ్లెక్సీ వేయించాడు.అంతేకాదు తన బంధువులందరినీ పిలిచి బిడ్డకు పిండం పెట్టాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సందర్భంగా అనుష తండ్రి మాట్లాడుతూ…అమల్లారా…అయ్యల్లారా… నా బిడ్డ మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది…నా బిడ్డను నేను మంచి కాలేజీలో చదివిస్తుంటే కొందరు నా బిడ్డను ట్రాప్ చేశారు. నా బిడ్డ లాగా మీ బిడ్డల జీవితాలు బలి కాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అంటూ మురళి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తండ్రి మురళి ఆవేదన చూసిన పలువురు అనూష చర్యలను ఖండిస్తున్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.