Father slapped his son in public Viral Video
Viral Video ; పిల్లలు అన్నాక అప్పుడప్పుడు అబద్ధాలు చెబుతూ ఉంటారు. కానీ అదే అలవాటుగా మారితే అది వారి భవిష్యత్తుకే ప్రమాదం. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. లేదంటే వారి జీవితం అతలాకుతలమవుతుంది. తాజాగా ఓ కొడుకు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయటానికి వెళ్ళాడు. ఇది తెలిసిన తండ్రి పబ్లిక్ గానే కొడుకుని చితకబాదాడు. ఇది చూసి అక్కడున్నవారే కాదు నెటిజన్లు కూడా దిమ్మరపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో అది కాస్త ఇలా వైరల్ గా మారింది.
ఓ టీనేజర్ ఇంట్లో తన తల్లిదండ్రులకు క్లాసులకు వెళుతున్నానని చెప్పి స్నేహితులతో బార్ కు వచ్చి ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తండ్రికి ఎలా తెలిసిందో కానీ కుర్రాడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న టైంలో తల్లిదండ్రులు ఎంట్రీ ఇచ్చారు. ఇక కొడుకును చూడగానే తండ్రికి కోపం ఆగలేదు. ఏం చెప్పావు రా నాకు ఇందాక అంటూ అతడి చంప చల్లుమనిపించాడు. అంతేకాకుండా కొడుకు దవడ పేల కొట్టాడు. తన కొడుకుని కాకుండా అక్కడ ఉన్న అతడి స్నేహితులను కూడా పిచ్చ కొట్టుడు కొట్టాడు. పక్కనే ఉన్న కుర్రాడి తల్లి కూడా వాళ్ల మీద గయ్యమని లేచింది. అయితే అక్కడ ఉన్న కస్టమర్లు ఇదంతా చూసి నోరేళ్లపెట్టారు. ఒక్కరు కూడా తండ్రిని అడ్డుకొని ప్రయత్నం చేయలేదు.
Father slapped his son in public Viral Video
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు. ఈ కాలంలో తల్లిదండ్రులు స్ట్రిక్టుగా లేకపోతే పిల్లలు చెడిపోతారంటూ కామెంట్ చేశారు. మరికొందరు కుర్రాడి పరిస్థితిని తలుచుకొని జాలిపడ్డారు. పిల్లలను దారిలో పెట్టేందుకు ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. తండ్రి చేసిన పని కొడుకు మనసుపై ప్రభావం చూపుతుందని మానసిక ఆరోగ్యం దెబ్బతీస్తుందని ఇంకొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి అయితే ఈ వీడియో పై చాలా కామెంట్స్ వచ్చాయి.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.