viral video : సోషల్ మీడియా యుగం వచ్చాక ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ ఏది జరిగినా ఇట్టే మన కళ్లముందు కదలాడుతోంది. మన ఇంట్లో, బయట జరిగే చిన్న చిన్న ఘటనలు, ప్రమాదాలు, వైరల్ వార్తలు, పాలిటిక్స్, క్రైమ్స్ ఇలా ప్రతీ ఒక్కటి తెలిసిపోతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో ఏదైనా జరిగిందంటే ఆ విషయం మన చానెళ్లు, పత్రికల్లో వచ్చేంత వరకు తెలిసేది కాదు. అందుకోసం రెండు నుంచి మూడు రోజుల వరకు టైం పట్టేది. అంటే ఆ విషయం మనకు తెలిసే సరికే చాలా ఆలస్యమయ్యేది. ఎప్పుడైతే సోషల్ మీడియా వాడకం పెరిగిందో నాటి నుంచి ఏ విషయమైన నిమిషాల్లో తెలుస్తోంది.
సాధారణంగా జంతు ప్రేమికులు ఇంట్లో అనేక రకాల జంతువు, పక్షి జాతులను పెంచుకుంటుంటారు. అయితే, పెట్స్ ఇంట్లో చేసే సందడి మాములుగా ఉండదు. అల్లరి అల్లరి చేస్తూ ఇళ్లంతా తిరుగుతుంటాయి. ఇక కోడి విషయానికొస్తే వేళపాల లేకుండా కూస్తూ నిద్రను డిస్టప్ చేస్తుంటాయి. వాటి పని అదే కాబట్టి పెద్దగా దానిని ఎవరూ పట్టించుకోరు. కానీ, వాటికి పిల్లల జోలికి వస్తే మాత్రం కోడి అస్సలు ఊరుకోవు. వెంబడించి మరీ తరిమేస్తాయి. కానీ ఓ కోడి జంట తమ పిల్లలతో పాటే చిన్న కుక్కపిల్లను, కుందేలు పిల్లను దత్తత తీసుకున్నాయి. వాటి పిల్లలతో పాటే కలిపి సాకుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టర్కీకి చెందిన ఫిజెన్ అనే మహిళ ఈ అరుదైన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. కోడి జంట వాటిని దత్తత తీసుకుందని రాసుకొచ్చింది. ఇందులో ఓ కోడి తన పిల్లలపై కూర్చుని ఉండగా.. పక్కనే కుందేలు, క్యూట్ పప్పి కోడి మూతిని నాకుతూ ముద్దు చేస్తోంది. కోడి, పక్కనే ఉన్న కోడి పుంజు కూడా వాటిని ఏం అనకుండా దగ్గరకు తీసుకున్నాయి. ఈ దృశ్యాలను చూసింది అందరూ వావ్ సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మనుషుల్లోనే కాదు జంతువులు, పక్షుల్లో అయినా తల్లి ప్రేమ మాత్రం కామన్.. దీనికి ఏది సాటిరాదంటూ మరికొందరు రిప్లై చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.