Viral video : వామ్మో.. ఈ కోతులు మామూలువి కాదు.. పంది మీద కూర్చొని ఏం చేశాయో చూస్తే అవాక్కవుతారు
Viral video : కోతుల గురించి తెలుసు కదా. అవి ఎంత అల్లరి చేస్తాయో. ఒరేయ్.. కోతిలా చేయకురా అని పెద్దలు కొందరిని తిడుతూ ఉంటారు. అంటే ఏవైనా కొంటెపనులు చేసినా.. అల్లరి చేష్టలు చేసినా కోతిలా చేయకు అని అంటుంటారు. ఎందుకంటే కోతులు చేసేదే అల్లరి పనులు కాబట్టి.అవును.. కోతుల గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇళ్ల మీద ఎగబడతాయి. మనుషుల మీదికి వస్తాయి. మనుషుల దగ్గర ఏం ఉంటే అవి ఎత్తుకెళ్తాయి. ఇవ్వకపోతే.. మనల్నే ఉల్టా బెదిరిస్తాయి.
Viral video : పంది మీదికి ఎక్కి దానితో ఓ ఆట ఆడుకున్న కోతులు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పందితో రెండు కోతులు కలిసి ఆడుకున్న వీడియో అది. రెండు కోతులు పందితో కలిసి తెగ ఎంజాయ్ చేశాయి. దాని మీద కూర్చొని దానితో పరాచకాలు ఆడాయి. ఒక కోతి అయితే దాని తోక పట్టుకొని లాగింది. మరో కోతి దాని మీదికి ఎక్కి జంప్స్ చేసింది.ఇలా ఆ కోతులు ఏం చేసినా.. పంది మాత్రం వాటిని ఏమీ అనలేదు. ఇదే కావచ్చు స్నేహం అంటే. పందుల జాతి వేరు.. కోతుల జాతి వేరు. అయినప్పటికీ.. రెండు జాతులు కలిసి స్నేహపూర్వకంగా ఉండటం అనేది గ్రేట్.

monkeys making fun with pig video viral
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి తెగ మెచ్చుకుంటున్నారు. ఇది స్నేహం అంటే. ఇలా ఉండాలి మనుషులు కూడా. ఎదుటివారితో ఇలా సంతోషంగా.. హ్యాపీగా సరదాగా ఉంటే ఎటువంటి గొడవలు రావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram