Sister Brother : తమ్ముడి కోసం జీవితాన్నే దారపోస్తున్న అక్క.. తల్లిగా మారి సపర్యలు
Sister Brother : కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులను చూస్తుంటే పెద్దగా ఆస్తులు, చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు, సమాజంలో హోదా, సౌకర్యాలు, సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ ఆప్యాయత అనుబంధాలు ఉండేవి. ఒకరికొకరు చేదోడువాదోడుగా, నీతి నిజాయితీగా, అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు. ఉన్నంతలోనే తృప్తిగా గడిపారు. కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారు. అయితే కుటుంబాల ఆర్థిక స్థితిగతులు ఎప్పుడైతే వేగంగా మారడం మొదలైందో, అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు పెరిగాయో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిందిపోయి రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది. సంబంధాలు పలుచపడటం మొదలైంది.
ఇలాంటి రోజుల్లో తమ్ముడి కోసం ఓ అక్క తన జీవితాన్నే త్యాగం చేసింది. తమ్ముడినే తన కొడుకుగా భావిస్తూ సపర్యలు చేస్తుంది శీతల్ మోదీ.. గుజరాత్ రాష్ట్రం అంకలేశ్వర్‌కు చెందిన శీతల్ మోదీ(51) తన తమ్ముడు అశ్విన్ మోదీ(48)తో కలిసి జీవిస్తున్నది. అశ్విన్ శరీరం ఎంత ఎదిగినా మానసికంగా అతడు కేవలం 6 నెలల పిల్లాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. వయస్సుకు తగినట్లుగా మెదడు ఎదగపోవడమే ఇందుకు కారణం. దీంతో అతడు అప్పుడప్పుడు తలను గోడకు వేసి కొట్టుకుంటాడు. తల మీద కొట్టాలని అడుగుతుంటాడు. ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకుండా పోయింది.
అశ్విన్‌ది చిన్న పిల్లల మనస్తత్వం కావడంతో శీతల్ తన తోడపుట్టిన తమ్ముడి కోసం పెళ్లి చేసుకోకుండా తల్లిగా మారి అతడికి సపర్యలు చేస్తుంది. తన తమ్ముడి కోసమే ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది. తను పెండ్లి చేసుకుంటే తన తమ్ముడిని చూసుకోవడం కుదరదనే భయంతో ఆవిడ అసలు పెళ్లి కూడా చేసుకోలేదు. ఆమె తన ఉద్యోగాన్ని కూడా మానుకోవాల్సి వచ్చింది. శీతల్ తన తల్లిదండ్రుల మరణానికి ముందు బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేసేది. తల్లిదండ్రుల మరణం తర్వాత తమ్ముడిని దగ్గరుండి చూసుకునేందుకు ఆ ఉద్యోగాన్ని మానేసింది. ఆ తర్వాత ఆమె బ్యూటీషన్ కోర్సు నేర్చుకుంది. డబ్బు సంపాదన కోసం అలా ఇంట్లోనే బ్యూటీపార్లర్ రన్ చేస్తుంది.
Sister Brother : తమ్ముడి కోసం జీవితాన్నే దారపోస్తున్న అక్క.. తల్లిగా మారి సపర్యలు
అశ్విన్ నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రతి పని, తన ప్రతి అవసరాన్ని శీతల్ చేస్తుంది. కాలకృత్యాలు తీర్చడం, షేవింగ్ చేయడం కూడా చేస్తుంది. కాస్త గట్టిగా ఉన్న పదార్థాలను అశ్విన్ నమలలేడు. దాంతో ఆ పదార్థాలను శీతల్ నమిలి అశ్విన్ కి తినిపిస్తుంది. ఇలా ప్రతి విషయంలో శీతల్ తన తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. అయితే శీతల్ ఆరోగ్యం కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. ఆమెకు విటమిన్ బీ12, కాల్షియం వంటి లోపాల కారణంగా ఊరికే అలిసిపోతుంటారు. కానీ తను విశ్రాంతి తీసుకుంటే తన తమ్ముడి బాగోగులు ఎవరు చూస్తారు, డబ్బు ఎలా వస్తుందని శీతల్ తన పార్లర్ లో పని చేస్తుంటుంది. డబ్బు కోసం బంధాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్న వారికి ఈ అక్కాతమ్ముళ్ల జీవితం కనువిప్పు అవుతుంది.
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…
This website uses cookies.