Home » Exclusive » The Cat Following The Clock
Exclusive

Viral Video : పిల్లితోక టిక్.. టిక్.. సేమ్ గడియారం లాగే వైర‌ల్ వీడియో..!

Authored By
mallesh
The Telugu News | Updated on: January 8, 2022, 8:56 am
Advertisement

Viral Video : ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం కామన్. చాలా మంది వాటిని పెంచుకునేందుకు ఇష్టపడతారు కూడా. ఎందుకంటే వాటితో ఎక్కువ కాలక్షేపం అవుతుంది. దీని వల్ల మెంటల్ స్ట్రెస్ నుంచి చాలా వరకు రిలీఫ్ లభిస్తుంది. కొన్ని సార్లు అవి చేసే పనులు కోపాన్ని తెప్పిస్తాయి. మరి కొన్ని సార్లు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కొన్ని జంతువులకు ట్రైనింగ్ ఇచ్చి చాలా మంది చిన్న చిన్న పనులు చేయిస్తారు. ఇక పిల్లలు ఉన్న ఇంట్లో సందడే సందడి.వారికి తోడు పెంపుడు పిల్లులు కానీ, కుక్కులు కానీ ఉన్నాయంటే వారు వాటితోటే కాలక్షేపం చేస్తుంటారు.

Advertisement

టైం మొత్తం వాటితో ఆడుకునేందుకు కేటాయిస్తుంటారు. కొన్ని సార్లు పిల్లలతో ఆ జంతువులు ఆడుతూ ఉండటం చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. కొన్ని జంతువులు మనుషులను అనుకరిస్తే, మరి కొన్ని జంతువులు వస్తువులను చూసి వాటిలాగే బిహేవ్ చేస్తూ ఉంటాయి. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం లో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో చూడండి.. ఇక్కడ ఒక నల్ల పిల్లి టేబుల్‌పై కూర్కొని ఉంది. దాని ముందు ఒక గడియారం ఉంది.

the cat following the clock

Advertisement

Viral Video : అచ్చం అలాగే చేస్తున్న పిల్లి

అందులో సమయానికి తగినట్టుగా కింద వేలాడుతున్న ఓ పెద్దముల్లును చూస్తూ దాని లాగే తోకను ఊపడం మొదలుపెట్టింది పిల్లి. ఆ ముల్లు ఎడమ పక్కని ఊగితే పిల్లి కూడా తన తోకను ఎడమ పక్కకు ఊపుతూ.. ముల్లు కుడిపక్కకు ఊగితే పిల్లి కూడా కుడి పక్కకు తన తోకను ఊపుతూ గడియారాన్ని అనుకరించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి. పిల్లి చేష్టలను చూస్తూ ఎంజాయ్ చేయండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి