
Cat : తండ్రి కొడుకుల ప్రాణాలు తీసిన పిల్లి ..!
Cat : చేతికి వచ్చిన కొడుకు, ఇంటి బాధ్యతలు మోసే తండ్రి ఇద్దరు ఒకేసారి కన్నుమూస్తే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది. చిన్నపాటి నిర్లక్ష్యం వారి ప్రాణాలకు ముప్పు తతెచ్చింది. ఉత్తరప్రదేశ్లోని అక్బర్ పూర్ గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో ఇంతియా హుజిన్ అనే వ్యక్తి పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు. ఆయన ముచ్చటపడి ఒక పిల్లిని ఇంటికి తెచ్చుకున్నారు. దానిని సాదుకోవటం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఆ పిల్లి ఇంట్లో అందరికీ ఇష్టమైన పెంపుడు జంతువు అయింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో అనుకోని ఉపద్రవం చోటుచేసుకుంది. అలా ఇలా తిరుగుతూ వీధిలోకి వచ్చిన పిల్లిని ఓ కుక్క వెంటపడి కరిచేసింది. వెంటనే పిల్లి ఇంట్లోకి పరుగు తీసింది. బయట ఉండి అరుస్తున్న శునకాన్ని ఇంట్లోని వాళ్ళు తరిమేశారు. రక్తం కారుతున్న పిల్లిని నీటితో కడిగేసి వదిలేశారు.
ఈ పరిణామం ఆ ఇంటి ఓనర్ పాలిట మృత్యు శాపం అయింది. పిల్లి కుక్క కాటుకు గురై వారం రోజులు అయింది. ఆ విషయాన్ని అందరూ మరిచిపోయారు. స్కూలు నుంచి ఇంటికి వచ్చిన ఇంతియా సార్ పిల్లిని ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. దానిని ప్రేమతో దువ్వటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో పిల్లి పళ్ళు ఆ పెద్దాయన చేతిని తాకాయి. లైట్ గా గాట్లు పడ్డాయి. వెంటనే పెద్దాయన చేతులు కడుక్కొని కూర్చున్నాడు. ఆ విషయాన్ని మరిచిపోయాడు. యాదృచ్ఛికంగా కొన్ని రోజుల తర్వాత ఇంతియా హుజిన్ కొడుకికి కూడా పంటి గాట్లు పడ్డాయి. నవంబర్ 24న ఇంతియా హుజిన్ కుటుంబం ఒక పెళ్లికి హాజరయ్యారు. తర్వాతి రోజు ఇంటికి చేరుకున్నారు. ఆ రోజే ఇంతియా కొడుకు ఆరోగ్య పరిస్థితి మారిపోయింది. ఆయనని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆయన శరీరంలో రాబిస్ లక్షణాలు పెరిగిపోయాయి.
మెరుగైన చికిత్స కోసం కాన్పూర్ కి వెళ్లే లోపు కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత కొద్ది రోజులకే ఇంటి పెద్ద కూడా అదే లక్షణాలతో తుది శ్వాస విడిచారు. ఆ పిల్లి చివరికి తండ్రి కొడుకుల ప్రాణాలని తీసేసింది. వీధి కుక్క కరవడంతో పిల్లికి రాబిస్ ఎటాక్ అయింది. దాని పళ్ళ గాట్లే కుటుంబంలోని ఇద్దరి మరణానికి కారణమైంది. పిల్లి గాట్లు తగిలిన వెంటనే యాంటీ రాబీస్ వ్యాక్సిన్ తీసుకుని ఉంటే వారి ప్రాణాలు నిలబడి ఉండేవని వైద్యులు అన్నారు. కుక్క పిల్లి ఆరోగ్యంగా ఉన్న ఆ పెంపుడు జంతువుల పళ్ళ గాట్లు శరీరానికి సున్నితంగా తగిలిన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెంపుడు జంతువులకు అప్పుడప్పుడు యాంటీ రాబిస్ ఇంజక్షన్లు వేపించాలి. ఈ ప్రక్రియ సరైన టైంలో జరగలేదు కాబట్టి తండ్రి కొడుకులు మరణించారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.