the meaning of monkey antics monkeys playing with the cup
Viral Video : మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే.. లేదా ఏదైనా విచిత్రమైన పనులు చేస్తుంటే.. కోతి చేష్టలు అంటూ తిట్టడం చాలా కామన్. అయితే నిజానికి కోతి చేష్టలు అంటే అంత విచిత్రంగా ఉంటాయా అంటే చాలా సార్లు కోతులు దీన్ని నిజం చేసి చూపించాయి. కోతులకు వచ్చే ఆలోచనలు మరెవరికీ రావేమో. ఒక వస్తువును అయినా లేదంటే ఆహార పదార్థాలను అయినా తిన్నగా వాడవు అవి. చిత్ర విచిత్రంగా వాడుతూ వికారం తెప్పిస్తుంటాయి. మొన్నటికి మొన్న ఓ కోతి చీర కట్టుకుని రోడ్డు మీదే మురిసిపోతూ బైక్ అద్దంలో చూసుకోవడం చూశాం.
అంతకు ముందు ఓ వ్యక్తి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లి తెగ మారం చేసేసింది. అయితే ఇప్పుడు కూడా ఓ పిల్ల కోతి, తల్లి కోతి కలిసి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా చెక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ పిల్ల కోతి, తల్లి కోతి ముందు నుంచి ఓ కప్ప పాక్కుంటూ వెళ్తుంది. అయితే పిల్ల కోతి ఆ కప్ప ఎలా అయితే గెంతుతూ వెళ్తుందో.. అలాగే దాని వెనకాల కప్ప గెంతినట్టే గెంతుకుంటూ వెళ్లడం మనం చూడొచ్చు.
the meaning of monkey antics monkeys playing with the cup
అయితే కప్ప అది గమనించి ఆగిపోతుంది. ఇంతలో తల్లి కోతి అక్కడకు వచ్చి ఆ కప్పను చేతుల్లో తీసుకుని అటూ ఇటూ పడేస్తుంది. దీంతో ఆ కప్పకు చుక్కలు కనిపిస్తాయనుకోండి. ఇదేంట్రా నాయనా.. వీటి చేతుల్లో చిక్కాను అన్నట్టు ఆ కప్ప పరిస్థితి తయారవుతుంది. అలా తల్లి, పిల్ల కోతులు కలిసి ఆ కప్పను ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటాయి.
Mahesh Babu : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తోన్న సినిమా…
Tollywood : టాలీవుడ్ లో భక్తి కథలకు పునరుజ్జీవం లభిస్తోంది. ఒకప్పుడు అఖండ విజయాలు అందించిన ‘అమ్మోరు’, ‘దేవిపుత్రుడు’ వంటి…
Anushka : అరుంధతి, బాహుబలి లాంటి పవర్ఫుల్ చిత్రాలలో నటించి.. తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ముద్దుగుమ్మ అనుష్క. సూపర్ సినిమాతో…
Better Gut Health : కాలంలో చాలామంది ఉదయం పళ్ళు తోముకునే విషయంలో చాలా నిర్లక్ష్యతను వహిస్తారు. పళ్ళు సరిగ్గా…
Venkatesh : టంపాలో జరిగిన ‘NATS 2025’ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ వెంకటేష్ సందడి చేసిన విషయం తెలిసిందే.. ఈ…
Ashadha Purnima : ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది. ఈ జులై మాసంలో అంటే ఆషాడ మాసంలో పౌర్ణమి…
TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP)…
Rasi Phalalu : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రక్షించి మరొక రాష్ట్రంలోనికి మార్పు చెందుతూ…
This website uses cookies.