Home » News » The Mother Does Not Remember The Son Who Came After Three Years Viral Video
News

Viral Video : మూడేళ్ల తర్వాత వచ్చిన కొడుకుని గుర్తుపట్ట లేకపోయినా తల్లి .. వైరల్ వీడియో !!

Authored By
aruna
The Telugu News | Published on: September 25, 2023, 4:00 pm
Advertisement

Viral Video : అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అమ్మ అనే పదమే ఒక ఎమోషన్. మనల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నా, మనం ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నా వారందరిలో అమ్మకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకు ఏ చిన్న బాధ కలిగిన అమ్మనే తలుచుకుంటాం. నాన్న అని అనం, అలా అని నాన్న చెడ్డవాడేం కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఆప్యాయత, ఓ ఆత్మీయత. అమ్మతో అటువంటి బంధం ఉంటుంది.

Advertisement

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ యువకుడు తమ కుటుంబ సభ్యులను వదిలి ఉపాధి కొరకు దుబాయ్ కి వెళ్ళాడు. కన్న తల్లిదండ్రులను, బంధువులను వదిలి పరాయి దేశానికి వెళితే ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. సంతోషాలు బాధలు పంచుకోవడానికి ఎవరూ లేక ఎంతో దిగులుగా ఉంటుంది. అయితే ఇక్కడ చూపిస్తున్న వీడియోలో దుబాయ్ కి వెళ్లి వచ్చిన యువకుడు తన తల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలని దుబాయ్ నుండి చెప్పకుండా వచ్చాడు. ఈ క్రమంలోనే ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు.

the mother does not remember the son who came after three years Viral Video

Advertisement

ఈ వీడియోలో చూపిస్తున్న వాళ్లది కర్ణాటకలోని ఉడిపి. ఆ యువకుడు మూడేళ్ల క్రితం దుబాయ్ కి వెళ్లి ఇప్పుడు తిరిగి వచ్చాడు. అయితే ఆమె తల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా దుబాయ్ నుంచి వచ్చాడు. అయితే వచ్చి రాగానే నేరుగా అతడి తల్లి పనిచేస్తున్న చేపల మార్కెట్ కి వెళ్ళాడు. తన తల్లి గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించాడు. ఇక చేపలు అమ్ముకుంటూ ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్లి చేపలు బేరం ఆడాడు. వాళ్ళ అమ్మ వెంటనే గుర్తించలేకపోయింది. కానీ తర్వాత గుర్తుపట్టి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యి కొడుకుని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్ని రోజులకు తిరిగి రావడంతో కొడుకును చూసిన తల్లి ఆనంద భాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి