Home » News » Viral News Husband Enjoy The Party His Wife Left Her Boyfriend
News

Viral News : భార్య లేచిపోయిందని ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చిన భర్త .. వైరల్ వీడియో

Authored By
aruna
The Telugu News | Published on: October 11, 2023, 2:00 pm
Advertisement

Viral News : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ వీడియో తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలామంది పాపులర్ అవుతున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన భార్య లేచిపోయిందని ఏకంగా పార్టీ చేసుకుంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Advertisement

తన భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని అ భర్త ఏకంగా 250 మందికి ఆల్కహాల్ పార్టీ ఇచ్చిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకురాష్ట్రంలో. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను గమనిస్తే ఇందులో చాలామంది మద్యం తాగుతూ డాన్స్ చేస్తున్నారు. మోహన్ లాల్ సినిమాలోని పాటకు డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ఇంటి ఆవరణలో ఈ పార్టీ జరిగింది. అయితే ఈ వీడియో నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. వీడియో క్యాప్షన్ మాత్రం భార్య లేచిపోయిందని 250 మందికి మద్యం, ఆహారం పెట్టి వేడుక చేసుకుంటున్నాడు అని ఉంది.

Viral News Husband enjoy the party his wife left her boyfriend

Advertisement

ఈ వీడియో ఎవరు రికార్డ్ చేశారో కూడా వివరాలు లేవు. ఈ వీడియో అక్టోబర్ 6, 2023న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఇప్పటిదాకా ఈ వీడియోను ఎనిమిది లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకి 1100 కు పైగా కామెంట్లు వచ్చాయి. చాలామంది ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. విడాకులు ఇచ్చేయొచ్చు కదా అని అంటున్నారు. మరికొందరు దేశంలో చాలామంది ఇలాంటి పార్టీలను చేసుకోవాలి అని అంటూ సరదాగా కామెంట్లు పెట్టారు. మొత్తానికి వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి