Viral Video : చెడ్డీలో పేలిన చిచ్చుబుడ్డి.. వీడియో వైరల్
Viral video : మనకు చాలా మంది ఆనందం వస్తే ఎగిరి గంతేస్తారు. మరి కొందరైతే స్వీట్లు పంచుతారు. ఇంకొందరు ఆనందాన్ని తట్టుకోలేక టపాసులు కాలుస్తుంటారు. పెళ్లి ఫంక్షన్ మొదలు నాయకుల ర్యాలీ, బర్డ్ డేలకు సైతం టపాసులు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక తమకు నచ్చిన హీరో మూవీ రిలీజ్ అయిందంటే ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద హాంగామా మామూలుగా ఉండదు. టపాసులు కాలుస్తూ తమ సంతోషాన్ని తెలుపుతుంటారు. ఇదే కాకుండా దీపావళి పండుగ వచ్చిందంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంతా టపాసులు కాల్చడంలో చాలా బిజీ అయిపోతారు.
కానీ కొందరు ఆకతాయిలు చేసే పని కాస్త ఇబ్బందులకు గురిచేస్తుంది. టపాసులు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ కొందరు చాలా నిర్లక్ష్యంగా వాటిని కాలుస్తుంటారు. ఇలాంటి సమయంలో ప్రమాదాల బారిన పడుతుంటారు. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ వ్యక్తి చిచ్చు బుడ్డిని తన చెడ్డీలో ముందవైపు పెట్టి కాలుస్తుంటాడు. కాసేపటి తర్వాత అది పై వైపుకు తిరుగుతుంది.
Viral Video fireworks exploding in neckar
Viral video : సీన్ అడ్డం తిరిగింది
ఈ క్రమంలో సదరు వ్యక్తిపై చిచ్చుబుడ్డి మెరుపులు పడతాయి. దీంతో అతడు కంగారు పడతాడు. ఈ మంట నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే అది ఆ చిచ్చుబుడ్డి పేలడం మొదలవుతుంది. దీంతో అతడు దానిని తీసేసి పరుగులు పెడతాడు. అంతలోపే కిందపడిపోతాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
