Viral Video : సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. కుక్కలకు సంబంధించిన వీడియోలు.. పక్షులు, కోతులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే మరికొన్ని వీడియోలు భయపెట్టిస్తాయి. అప్పుడప్పుడు కొన్ని జంతువులు ప్రమాదాల భారిన పడి చనిపోయిన వీడియోలు చూసుంటాం. ఇక కోతులకు సంబంధించిన వీడియోల్లో ఎక్కువగా ఫన్ ఉంటుంది. అయితే కోతి చేష్టలు మామూలుగా ఉండవు. ఒక్కోసారి మనిషిని కూడా కోతిలాగా చేయకు అంటుంటారు. చిన్నపిల్లల్ని కోతి పనులు చేయకు అంటుంటారు.
అయితే కోతులు ఒక్కోసారి అవే చేసే పనులను చూసి ఆశ్చర్యపోతుంటాం. అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తుంటాయి. అవి చేసే పనులకు కొంతమంది చిరాకు పడుతుంటారు.. షాపులు దుకాణాల్లో ఉన్న ఫుడ్ ఐట్సెం లాక్కుని పరిగెడతాయి. ఇక కోతుల అల్లరి మామూలుగా ఉండదు. అడవుల శాతం తగ్గిపోవడంతో ఆహారం దొరక్కా గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి ఆహారాన్ని పలు వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. గుంపులు గుంపులుగా ఇళ్లపై అటూ ఇటూ దూకుతూ భయపెట్టిస్తుంటాయి. అలాగే రోడ్లపైకి వచ్చి ఆడుతుంటాయి. ఇక టెంపుల్స్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంటాయి. చేతిలో ఉన్న ఫుడ్, వాటర్ బాటిల్స్ వంటివి లాక్కెళ్తుంటాయి.
సరైన ఆహారం దొరక్క ఏది పడితే అది తింటుంటాయి. ఇక చాలామంది కోతులకు ఫ్రూట్స్ వేస్తుంటారు. గతంలో మనం కల్లు తాగిన కోతిని చూసుంటాం.. కానీ విస్కీ తాగిన కోతిని ఇప్పుడు చూద్దాం… ఈ వీడియోలో ఓ కోతి విస్కీ బాటిల్ చేతిలో పట్టుకుని తాగేస్తోంది. తాగిన తర్వాత కళ్లు మూస్తూ మత్తెక్కినట్లు అచ్చం మనిషిలాగే చేసింది. ఆ తర్వాత కుప్పిగంతులు వేస్తూ రోడ్లపై రెండు కాళ్లతో నడుస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.