Viral Video : కోతి విస్కీ తాగిందోచ్.. ఆ త‌ర్వాత తూలుతూ కుప్పి గంతులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : కోతి విస్కీ తాగిందోచ్.. ఆ త‌ర్వాత తూలుతూ కుప్పి గంతులు

Viral Video : సోష‌ల్ మీడియాలో జంతువుల‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు నిత్యం వైర‌ల్ అవుతుంటాయి. కుక్క‌ల‌కు సంబంధించిన వీడియోలు.. ప‌క్షులు, కోతుల‌కు సంబంధించిన వీడియోలు ఎక్కువ‌గా వైర‌ల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు న‌వ్వు తెప్పిస్తే మ‌రికొన్ని వీడియోలు భ‌య‌పెట్టిస్తాయి. అప్పుడ‌ప్పుడు కొన్ని జంతువులు ప్ర‌మాదాల భారిన ప‌డి చ‌నిపోయిన వీడియోలు చూసుంటాం. ఇక కోతుల‌కు సంబంధించిన వీడియోల్లో ఎక్కువ‌గా ఫ‌న్ ఉంటుంది. అయితే కోతి చేష్ట‌లు మామూలుగా ఉండ‌వు. ఒక్కోసారి మ‌నిషిని కూడా కోతిలాగా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :22 July 2022,7:40 am

Viral Video : సోష‌ల్ మీడియాలో జంతువుల‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు నిత్యం వైర‌ల్ అవుతుంటాయి. కుక్క‌ల‌కు సంబంధించిన వీడియోలు.. ప‌క్షులు, కోతుల‌కు సంబంధించిన వీడియోలు ఎక్కువ‌గా వైర‌ల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు న‌వ్వు తెప్పిస్తే మ‌రికొన్ని వీడియోలు భ‌య‌పెట్టిస్తాయి. అప్పుడ‌ప్పుడు కొన్ని జంతువులు ప్ర‌మాదాల భారిన ప‌డి చ‌నిపోయిన వీడియోలు చూసుంటాం. ఇక కోతుల‌కు సంబంధించిన వీడియోల్లో ఎక్కువ‌గా ఫ‌న్ ఉంటుంది. అయితే కోతి చేష్ట‌లు మామూలుగా ఉండ‌వు. ఒక్కోసారి మ‌నిషిని కూడా కోతిలాగా చేయ‌కు అంటుంటారు. చిన్న‌పిల్ల‌ల్ని కోతి ప‌నులు చేయ‌కు అంటుంటారు.

అయితే కోతులు ఒక్కోసారి అవే చేసే ప‌నుల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతుంటాం. అచ్చం మ‌నిషిలాగే ప్ర‌వ‌ర్తిస్తుంటాయి. అవి చేసే ప‌నుల‌కు కొంత‌మంది చిరాకు ప‌డుతుంటారు.. షాపులు దుకాణాల్లో ఉన్న ఫుడ్ ఐట్సెం లాక్కుని ప‌రిగెడ‌తాయి. ఇక కోతుల అల్ల‌రి మామూలుగా ఉండ‌దు. అడ‌వుల శాతం త‌గ్గిపోవ‌డంతో ఆహారం దొర‌క్కా గ్రామాల్లోకి వ‌స్తున్నాయి. ఇళ్ల‌లోకి చొర‌బ‌డి ఆహారాన్ని ప‌లు వ‌స్తువుల‌ను ఎత్తుకెళ్తుంటాయి. గుంపులు గుంపులుగా ఇళ్ల‌పై అటూ ఇటూ దూకుతూ భ‌య‌పెట్టిస్తుంటాయి. అలాగే రోడ్ల‌పైకి వ‌చ్చి ఆడుతుంటాయి. ఇక టెంపుల్స్ ద‌గ్గ‌ర ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. చేతిలో ఉన్న ఫుడ్, వాట‌ర్ బాటిల్స్ వంటివి లాక్కెళ్తుంటాయి.

Viral Video funny monkey drinking alcohol

Viral Video funny monkey drinking alcohol

స‌రైన ఆహారం దొర‌క్క ఏది పడితే అది తింటుంటాయి. ఇక చాలామంది కోతుల‌కు ఫ్రూట్స్ వేస్తుంటారు. గ‌తంలో మ‌నం క‌ల్లు తాగిన కోతిని చూసుంటాం.. కానీ విస్కీ తాగిన కోతిని ఇప్పుడు చూద్దాం… ఈ వీడియోలో ఓ కోతి విస్కీ బాటిల్ చేతిలో ప‌ట్టుకుని తాగేస్తోంది. తాగిన త‌ర్వాత క‌ళ్లు మూస్తూ మ‌త్తెక్కిన‌ట్లు అచ్చం మ‌నిషిలాగే చేసింది. ఆ త‌ర్వాత కుప్పిగంతులు వేస్తూ రోడ్ల‌పై రెండు కాళ్ల‌తో న‌డుస్తూ చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=Car9Ndc9qiE

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది