Home » Exclusive » Viral Video In Abba How Cozy Tap Turned Bathing Dog
Exclusive

Viral Video : అబ్బ ఎంత హాయిగా ఉందో.. ట్యాప్ తిప్పి స్నానం చేస్తున్న డాగ్..

Authored By
mallesh
The Telugu News | Published on: April 11, 2022, 7:00 am
Advertisement

viral video: ప్రేమగా చూసుకుంటే కుక్క ఎంత విశ్వాసం చూపిస్తుందో మ‌న అంద‌రికీ తెలిసిందే.. ఎంత విశ్వాసంగా ఉంటాయంటే చాలాసార్లు అవి ప్రాణాలను కూడా లెక్క‌చేయ‌కుండా రిస్క చేస్తుంటాయి. స్విమ్మింగ్ పూల్ లో ప‌డిపోతే వెంట‌నే డాగ్ దూకి కాపాడిన సంఘ‌ట‌న‌లూ చూసాం.. అందుకే పెట్ డాగ్స్‌ను చాలా మంది ప్రాణంగా ప్రేమిస్తారు. అందుకే సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. చాలా మందికి కుక్క‌ల‌ను పెంచడం చాలా ఇష్టం.

Advertisement

అన్ని సమయాల్లో వాటిని పక్కనే ఉంచుకుంటారు. తినేటప్పడు, పడుకునేటప్పుడు కూడా వాటిని తమ వద్దే ఉంచుకుంటారు. అందుకే పెట్ డాగ్స్ కూడా చాలా విధేయతను చూపుతాయి.అయితే కొన్ని కుక్కులు య‌జ‌మాని ఏది చెప్తే అది చేస్తాయి.. చెప్పిన‌ట్లు వింటాయి.. కొన్ని మాత్రం అల్ల‌ర‌ల్ల‌రి చేస్తుంటాయి. య‌జ‌మాని లేక‌పోతే వాటికి న‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంటాయి. కొన్ని సార్లు అవి చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి.

Viral Video in abba how cozy tap turned bathing dog

Advertisement

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.ఓ ఇంట్లోని కుక్క దానికి ఎంత వేడిగా అనిపించిందో ఏమో గాని ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి వాట‌ర్ ట్యాప్ తిప్పి హాయిగా దానికి కింద త‌డుస్తూ స్నానం చేసింది. బాడీ మొత్తం త‌డిసేలా అటూ ఇటూ తిరుగుతూ ఎం చ‌క్కా స్నానం చేసింది. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ పెడుతూ న‌వ్వుకుంటున్నారు. మీరు కూడా చూసేయండి లేటెందుకు…

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి