Home » Exclusive » Viral Video In Cat Landed In The Glass Pot
Exclusive

Viral Video : గాజు కుండలోకి దూరిన పిల్లి.. హాయిగా అందులో కూర్చుని..

Authored By
mallesh
The Telugu News | Published on: March 7, 2022, 10:00 pm
Advertisement

Viral video : ప్రస్తుత వత్తడి లైఫ్‌లో కాస్త రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది తమ ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. వీటితో కాస్త టైం స్పెండ్ చేయడం వల్ల వత్తిడిని జయించవచ్చు. కాస్త కాలక్షపం కూడా అవుతుంది. ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారు తామ పూర్తి సమయాన్ని పెంపుడు జంతువులతో ఆడుకోవడానికే కేటాయిస్తుంటారు. ఇలాంటి సమయంలో అవి చేసే పనులు మామూలుగా ఉండవు. అవి తెలిసి చేస్తాయో.. తెలియక చేస్తాయో.. తెలియదు గానీ.. అవి చేసే పనులు ఒక్కోసారి ఫన్నీగా అనిపిస్తాయి.

Advertisement

మరి కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ ఇంట్లో బల్లపై ఒక గాజుతో తయారు చేసిన కుండను ఉంచారు. అది చూడ్డానికి దాదాపుగా అక్వేరియం లాగానే ఉంది. కాకపోతే ఖాళీగా ఉంది. అక్కడే ఉన్న పిల్లి ముందుగా అందులోకి కాస్త తొంగి చూసింది. ఎముందో అని కాసేపు వెతికింది. ఇక నెమ్మెదిగా అటూ ఇటూ కదులుతూ అందులోకి మొత్తంగా దిగింది.

Viral Video in cat landed in the glass pot

Advertisement

Viral video : ఏముందని అనుకుందో మరి..

మొదట దానిని చూసిన వారంతా అది అందులో ఇరుక్కుపోయిందని అనుకున్నారు. కానీ ఆ పిల్లి అందులోకి దిగి దర్జాగా సేద తీరింది. మొహాన్ని కాస్త బయటకు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంతా పిల్లి తెలివితేటలను చూసి ఫిదా అవుతున్నారు. సూపర్ అంటూ కామెంట్స్ సైతం పెడుతున్నారు. మరి మీరు కూడా ఆ వీడియోను ఓ సారి చూడండి.

Advertisement

 

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి