Home » Exclusive » Viral Video In Everyone Is Fed Up With The Crows Intellect
Exclusive

Viral Video : కాకి తెలివికి నెటిజన్స్ ఫిదా.. అసలు ఏం చేసిందంటే..?

Authored By
mallesh
The Telugu News | Published on: March 18, 2022, 3:00 pm
Advertisement

Viral Video : ప్రస్తుత కాలంలో జంతువులను, పక్షులను పెంచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. వీటిల్లో కుక్క, పిల్లి, పక్షులు ఉంటాయి. వీటితో ఎక్కువ మంది కాలక్షేపం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళన, టెన్షన్స్ అన్నింటినీ నుంచి కాస్త రిలీఫ్ పొందుతారు. ఈ సమయంలో ఈ పెంపుడు జంతువులు మనుషులను అనుకరిస్తూ ఉంటాయి. కొన్ని జంతువులు ట్రైనింగ్ లేకున్నా.. కొన్ని పనులు చేస్తాయి. మరి కొన్ని జంతువులకు ట్రైనింగ్ ఇస్తే పనులను చకచకా చేస్తాయి. పక్షలు సైతం అంతే..

Advertisement

కానీ ఇలాంటి పనులు ఒక కాకి చేస్తే.. షాకింగ్ గా ఉంది కదా.. నిజమేనండి ఆ కాకి చేసిన పనికి దాని తెలివికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారంటే అతిశయోక్తి కాదు.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆహారం కోసం పక్షులు, జంతువులు చాలా కష్టపడతాయి. కానీ ఈ కాకి తన క్రియేటివిటీతో గింజలను సంపాదించుకుంది. ఒక కాకి ముందు వివిధ డిజైన్లతో కూడిన డబ్బాను ఉంచారు. అందుకు తగినట్టుగా అలాంటి డిజైన్లతో కొన్ని నమూనాలను ఏర్పాటు చేసి కాకి దూరంగా ఉంచారు.

Viral Video in everyone is fed up with the crows intellect

Advertisement

Viral Video : గింజల కోసం ఇలా చేసింది మరి..

ఈ నమూనాలను సేమ్ ఆకారంలో ఉన్న డబ్బాలో వేస్తే గింజలను ఇస్తామన్నట్టుగా ఆశ చూపడంతో అది ఆ నమూనాలను తీసుకొచ్చి అలాంటి ఆకారం ఉన్న రంధ్రంలోంచి డబ్బాలోకి వేస్తుంది. ఇలా దాదాపు ఐదు నమూనాలను వేసింది. అనంతరం దానికి గింజలను అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ కాకి తెలివిని పొగడకుండా ఉండలేకపోతున్నారు. మరి మీరు కూడా ఆ వీడియో చూసెయ్యండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి